hyderabadupdates.com movies డోస్ సరిపోలేదు రాకా

డోస్ సరిపోలేదు రాకా

‘పుష్ప-2’ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ సినిమా మీద ఏ స్థాయిల ో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. త్రివిక్రమ్ సినిమాను హోల్డ్‌లో పెట్టి మరీ అట్లీతో బన్నీ జట్టు కట్టడంతో అది చాలా ప్రత్యేకమైన సినిమానే అయి ఉంటుందని అభిమానులు భావించారు. ఇప్పటిదాకా అట్లీకి ఫెయిల్యూర్ అన్నదే లేదు.

‘రాజా రాణి’ నుంచి ‘జవాన్’ వరకూ అన్నీ బ్లాక్‌బస్టర్లే. కాకపోతే అట్లీ సినిమాలు రొటీన్‌‌గా ఉంటాయని.. సగటు కమర్షియల్ మీటర్‌ను దాటి ముందుకు వెళ్లడనే విమర్శలు ఉన్నాయి. కానీ ఈసారి అట్లీ సగటు మాస్ మసాలా సినిమాకు పరిమితం కాకుండా బన్నీ రేంజికి తగ్గట్లు ఒక భారీ ఈవెంట్ ఫిల్మ్ చేయడానికే రెడీ అయ్యాడు. అతను ఏదో స్పెషల్‌గా ట్రై చేస్తున్నాడని.. సినిమాను అనౌన్స్ చేసినపుడే అర్థమైంది. పెద్ద పెద్ద హాలీవుడ్ స్టూడియోలను ఈ సినిమాలో ఇన్వాల్వ్ చేశారు. ఏకంగా రూ.800 కోట్ల బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ ఈ సినిమా కోసం రంగంలోకి దిగింది.

ఐతే ఈ సినిమా గురించి ఇప్పటిదాకా జనాలు ఊహించుకున్న రేంజిలో అయితే నిన్న రిలీజ్ చేసిన టైటిల్ లుక్ లేదన్నది వాస్తవం. బన్నీ సినిమా నుంచి తొలి విశేషాన్ని పంచుకున్నపుడు సోషల్ మీడియా షేక్ అయిపోతుందనే సంకేతాలను టీం వర్గాలు ఇచ్చాయి. కానీ నిన్న అలా జరగలేదు. ముందు సినిమా నుంచి వీడియో గ్లింప్స్ కాకుండా టైటిల్ లుక్ మాత్రమే రిలీజ్ చేయడంతోనే సగం ఆసక్తి తగ్గిపోయింది.

ఇక టైటిల్, బన్నీ లుక్‌‌కు ఎక్కడెక్కడో పోలికలు కనిపించడంతో ఒక రకమైన నిట్టూర్పు కనిపించింది అభిమానుల్లో. తాము అంచనా వేసినట్లు నిన్న సోషల్ మీడియా షేక్ కాకపోవడంతో ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. సోషల్ మీడియా ట్రెండ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే బన్నీ టీంకు ఈ ఫీడ్ బ్యాక్ అందకుండా ఉండదు.

ఈ ప్రాజెక్టు స్కేల్‌కు తగ్గట్లు తర్వాత ఏదో భారీగా చేస్తే తప్ప సినిమాకు కోరుకున్న హైప్ రాదు. ఇంతకుముందు ఊరించి ఊరించి ప్రస్తుతానికి పక్కన పెట్టి గ్లింప్స్ విషయంలో అట్లీ అండ్ టీం చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిందే. దాన్ని వావ్ అనిపించే స్థాయిలో తీర్చిదిద్ది మంచి సందర్భం చూసి రిలీజ్ చేయాలి.

ఇప్పుడు వచ్చిన నెగెటివిటీ అంతా కొట్టుకుపోయేలా.. సోషల్ మీడియా అంతా కొన్ని రోజుల పాటు తమ సినిమా గురించి చర్చించుకునేలా చేసేలా ఆ గ్లింప్స్‌ను తీర్చిదిద్దాలి. అందుకోసం ఎంత టైం తీసుకున్నా పర్వాలేదు కానీ.. కంటెంట్ మాత్రం వేరే లెవెల్లో ఉండాలి. దాని మీద బన్నీ, అట్లీ దృష్టిపెడతారనడంలో సందేహం లేదు.

Related Post

Virat Kohli transforms legendary singer’s bungalow into a restaurantVirat Kohli transforms legendary singer’s bungalow into a restaurant

Indian cricket legend Virat Kohli has given a modern twist to history by turning legendary singer Kishore Kumar’s iconic Juhu residence, Gouri Kunj, into Mumbai’s latest luxury dining hotspot, One8

అఖండ-2… మళ్లీ ఇక్కడ టెన్షనేనా?అఖండ-2… మళ్లీ ఇక్కడ టెన్షనేనా?

డిసెంబరు 5 నుంచి వాయిదా పడ్డ నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రం ‘అఖండ-2’ను మరీ ఆలస్యం చేయకుండా వారం వ్యవధిలోనే రిలీజ్ చేసేస్తున్నారు. 12 సినిమాకు అఫీషియల్ రిలీజ్ డేట్ కాగా.. 11న రాత్రి సెకండ్ షోతో ప్రిమియర్స్ మొదలవుతున్నాయి. ఆ షోలు