hyderabadupdates.com Gallery డ్వాక్రా సభ్యులకు నీటి నాణ్యత పరీక్ష బాధ్యత

డ్వాక్రా సభ్యులకు నీటి నాణ్యత పరీక్ష బాధ్యత

డ్వాక్రా సభ్యులకు నీటి నాణ్యత పరీక్ష బాధ్యత post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. జల్ జీవన్ మిషన్ కార్యక్రమం మొదటి దశలో 16 కోట్ల మంది గృహాలకు కుళాయిలు ఇచ్చాం అన్నారు. ప్రాజెక్టులో జరిగిన కొన్ని లోపాలను సవరించి నిర్వహణ కూడా చేపడుతున్నాం అని తెలిపారు. మరో 3 కోట్ల ఇళ్లకు సురక్షితమైన తాగు నీటిని అందించాల్సి ఉందన్నారు. ఏపీలో నీటి నాణ్యత ను పరీక్షించేందుకు డ్వాక్రా మహిళల సేవల్ని వినియోగించు కోవాలని కోరుతున్నా. జల్ జీవన్ మిషన్ ద్వారా వివిధ ప్రాంతాల్లో 9 కోట్ల మంది మహిళలకు దూరం నుంచి నీరు తెచ్చుకునే కష్టాలు తప్పుతాయన్నారు సీఎం. జేజెఎం 2.0 ద్వారా ఏపీలో ప్రతీ ఇంటికి కుళాయి అనే లక్ష్యం నెరవేరుతుందని ఆశిస్తున్నానని అన్నారు.
2047 వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరాలంటే ప్రతీ ఇంటికీ సురక్షిత తాగునీరు చేరటం ముఖ్యమ‌ని స్ప‌ష్టం చేశారు చంద్రబాబు నాయుడు. సాగు కోసం కూడా రైతులకు రెండు సార్లు నీరందితే వారు కూడా సంతోషంగా ఉంటారన్నారు. జేజేఎం 2.0 పై త్వరలో ఏపీలో జిల్లాల కలెక్టర్లతో వర్చువల్ మీటింగ్ ఏర్పాటు చేస్తే ప్రాజెక్టు లక్ష్యాలను నిర్దేశించు కుందాం అని తెలిపారు. పీఎం జన్ మన్, పీఎం జన్ భాగీదారీ మిషన్‌లో భాగంగానూ సురక్షిత నీటిని మారుమూల ప్రాంతాలకు అందించేందుకు నిధులు వినియోగించు కోవాలని కోరారు. జల్ జీవన్ మిషన్ సాకారం అయ్యేందుకు కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామ‌ని, ఏపీ పూర్తి స్థాయిలో వినియోగించు కోవాల‌ని కోరారు కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్.
The post డ్వాక్రా సభ్యులకు నీటి నాణ్యత పరీక్ష బాధ్యత appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఒక రోజు ముందుగానే పేద‌ల‌కు పెన్ష‌న్లు పంపిణీఒక రోజు ముందుగానే పేద‌ల‌కు పెన్ష‌న్లు పంపిణీ

అమ‌రావ‌తి : ఏపీలో త‌మ ప్ర‌భుత్వం ఒక రోజు ముందుగానే పేద‌ల‌కు పెన్ష‌న్లు పంపిణీ చేయ‌డం జ‌రిగింద‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర హొం శాఖ మంత్రి అనిత వంగ‌ల‌పూడి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంద‌న్నారు. శ‌నివారం ఎన్టీఆర్ భరోసా

PM Narendra Modi: ‘ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌’పై ప్రధాని మోదీ దీపావళి వేడుకలుPM Narendra Modi: ‘ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌’పై ప్రధాని మోదీ దీపావళి వేడుకలు

Narendra Modi : ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏటా దీపావళి వేడుకలను సరిహద్దుల్లో గస్తీ కాసే జవాన్లతో కలిసి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించి గోవా తీరంలో నౌకాదళ సిబ్బందితో దీపావళి వేడుకలు చేసుకున్నారు. ఆదివారం రాత్రి

ఎన్నారైలు స‌మాజాభివృద్దిలో కీల‌క పాత్ర పోషించాలిఎన్నారైలు స‌మాజాభివృద్దిలో కీల‌క పాత్ర పోషించాలి

గుంటూరు జిల్లా : ఎన్నారైలు స‌మాజ అభివృద్దిలో కీల‌క పాత్ర పోషించాల‌ని పిలుపునిచ్చారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. శుక్ర‌వారం గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం జ‌రిగిన స‌భ‌లో ప్ర‌సంగించారు. ప్రభుత్వంలో, పాలనలో అనేక కార్యక్రమాల్లో