hyderabadupdates.com Gallery తన రచ్చలోకి జగన్ లాగుతున్న పేర్ని నాని!

తన రచ్చలోకి జగన్ లాగుతున్న పేర్ని నాని!

అవును మరి.. వివాదం పుట్టించినా సరే.. నిజాలను మాత్రమే ప్రచారం చేస్తే దానికి పెద్ద ప్రజాదరణ ఉండదు. సోషల్ మీడియాల్లో వైరల్ చేయడమే జీవితంగా అందరూ బతుకుతున్న రోజులివి. మరి మామూలు వివాదానికి కూడా సెలబ్రిటీని జోడిస్తే.. దానికి క్రేజ్ పెరుగుతుంది కదా. ఈ చిన్న సూత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన మాజీ మంత్రి పేర్ని నానికి కూడా చాలా బాగా తెలుసు. అందుకే ఆయన తన నియోజకవర్గంలో పోలీసుల మీదకు దూసుకెళ్లి.. స్టేషన్ లో తన అరాచకత్వాన్ని ప్రదర్శించడం మాత్రమే కాకుండా.. తన బెదిరింపులకు లొంగకుండా దీటుగా వ్యవహరించిన పోలీసు అధికారిని ఇరికించడానికి జగన్ పేరును కూడా అడ్డగోలుగా వాడుకుంటున్నారు. జగన్ పేరు చెప్పి ఇరికిస్తే తప్ప.. ఒకవేళ వాళ్ల ప్రభుత్వం వస్తే.. ఆ పోలీసు అధికారి మీద చర్యలు తీసుకోవడం సాధ్యం కాదేమో అని ఆయన భావిస్తున్నట్టుగా ఉంది.  వివరాల్లోకి వెళితే.. మచిలీపట్నంలో సోషల్ మీడియలో అనుచిత పోస్టులు పెట్టినందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు సుబ్బన్నను పోలీసులు అరెస్టు చేశారు. అయితే సుబ్బన్నను తక్షణం విడుదల చేయాలనే దబాయింపుతో.. మాజీ మంత్రి పేర్ని నాని పోలీసు స్టేషన్ మీదికి దాదాపుగా దండెత్తి వెళ్లారు. అక్కడి అధికారితో వాగ్వాదం పెట్టుకున్నారు. ఒక రేంజిలో రెచ్చిపోయారు. ఇప్పటికిప్పుడు విడుదల చేస్తావా లేదా? బయటకు పంపుతావా లేదా? అంటూ ఎగబడ్డారు. పోలీసు అధికారి మాత్రం.. ఆయనను చట్టప్రకారం అరెస్టు చేస్తామని.. విడిచిపెట్టడం కుదరదని ఖరాఖండిగా తేల్చిచెప్పారు.పేర్ని నాని అంతటితో వదలిపెట్టలేదు. ‘మీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తారా? రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తాం’ అంటూ రెచ్చిపోయారు. అయితే పోలీసు అధికారి తగ్గలేదు. వైసీపీకి చెందిన ప్రతి నాయకుడూ ‘మా ప్రభుత్వం వస్తే’ అని బెదిరించడం పరిపాటి అయిపోయింది. ఈ నేపథ్యంలో పోలీసు అధికారి గట్టిగానే జవాబిచ్చారు. ‘మీసంగతి చూస్తాం’ అని బెదిరిస్తోంటే.. ‘ఏం చేస్తారో చేసుకోండి.. వదలడం మాత్రం కుదరదు’ అని అన్నారు. పేర్ని నాని మరింత రెచ్చిపోయి ‘నువ్వు మాత్రం ఏం చేస్తావు.. సుబ్బన్నను ఉరేస్తావా? ఉరేయ్.. ఇప్పుడే ఉరి వేయ్’ అంటూ పెద్దపెద్దగా కేకలు పెట్టారు. కానీ పోలీసులు దృఢంగా వ్యవహరించారు.అసలు కామెడీ ఆ తర్వాత జరిగింది. స్టేషనునుంచి బయటకు వచ్చిన పేర్ని నాని.. ఈ రచ్చలోకి జగన్ పేరును కూడా లాక్కొచ్చారు. ఆ పోలీసుఅధికారి ‘జగన్ వస్తే ఏం చేస్తాడు’ అని అన్నట్టుగా మీడియా ముందు ఆరోపణలు గుప్పించారు. నిజానికి ఆ అధికారి జగన్ పేరు ప్రస్తావించనేలేదు. అయినా సరే.. జగన్ పేరు పెట్టి అధికారి తిట్టినట్టుగా ప్రచారంలో పెడితే.. కాస్త మసాలా జోడించినట్టుగా ఉంటుందని పేర్నినాని భావించి ఉంటారని ప్రజలు నవ్వుకుంటున్నారు.
The post తన రచ్చలోకి జగన్ లాగుతున్న పేర్ని నాని! appeared first on Telugumopo – Movies and Politics.

Related Post

Ponnam Prabhakar: రాజకీయ దుమారం రేపుతోన్న మంత్రి పొన్నం వ్యాఖ్యలుPonnam Prabhakar: రాజకీయ దుమారం రేపుతోన్న మంత్రి పొన్నం వ్యాఖ్యలు

Ponnam Prabhakar : జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో జరిగిన ఓ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ (Ponnam Prabhakar)…చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణా కాంగ్రెస్ లో దుమారం రేపుతున్నాయి. మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ ను ఉద్దేశించి… పొన్నం (Ponnam Prabhakar)

TTD: మంగళూరులో శ్రీవారి ఆలయానికి భూమి మంజూరు చేసిన ప్రభుత్వంTTD: మంగళూరులో శ్రీవారి ఆలయానికి భూమి మంజూరు చేసిన ప్రభుత్వం

TTD : దక్షిణకన్నడ జిల్లా కేంద్రం మంగళూరులోనూ వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించేందుకు ప్రభుత్వం భూమిని మంజూరు చేసిందని టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ కుమార్‌ అన్నారు. బెంగళూరు వయ్యాలికావల్‌లోని టీటీడీ (TTD) ఆలయంలో గురువారం 2026 ఏడాదికి సంబంధించిన క్యాలెండర్‌లు, డైరీలను

56 ఏళ్లు పూర్తి చేసుకున్న డైరెక్ట‌ర్ సుకుమార్56 ఏళ్లు పూర్తి చేసుకున్న డైరెక్ట‌ర్ సుకుమార్

హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన ద‌ర్శ‌కుల‌లో టాప్ లో ఉన్నాడు సుకుమార్. త‌నకు 56 ఏళ్లు పూర్త‌య్యాయి. త‌ను ఇప్పుడు స్టార్ హీరో రామ్ చ‌ర‌ణ్ తో త‌న త‌దుప‌రి సినిమా స్క్రీనింగ్ ప‌నుల్లో