hyderabadupdates.com Gallery తప్పు చేసిన వారు శిక్ష నుంచి త‌ప్పించు కోలేరు

తప్పు చేసిన వారు శిక్ష నుంచి త‌ప్పించు కోలేరు

తప్పు చేసిన వారు శిక్ష నుంచి త‌ప్పించు కోలేరు post thumbnail image

హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ఆయ‌న మాజీ సీఎం కేసీఆర్ , బీఆర్ఎస్, మాజీ మంత్రులు కేటీఆర్, హ‌రీశ్ రావుల‌పై భ‌గ్గుమ‌న్నారు. సోమ‌వారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ జాతిపిత అని కొందరు వాళ్లకు వాళ్లే రాసుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. ఉద్యమకారులం అని వాళ్లే చెప్పుకుంటున్నారు . పోలీసులు చిన్న నోటీసులు ఇస్తే జాతిపితకు నోటీసులు ఇస్తారా అంటున్నారు . ఆనాడు జాతిపిత గాంధీజీ పదవులను త్యాగం చేసి దుర్మార్గుల తూటాలకు ప్రాణాలు వదిలారని, మరి ఇప్పుడు జాతిపిత అని చెప్పుకుంటున్న వాళ్లు ఏం చేశారంటూ ప్ర‌శ్నించారు. తెలంగాణ ఉద్యమకారులను ఏకం చేసి ఉద్యమాన్ని నడిపించిన ప్రొఫెసర్ కోదండరాం ఉద్యమకారుడు కాదా అని నిల‌దీశారు.
ఆనాడు తలుపులు బద్దలు కొట్టి ఆయన్ను అరెస్టు చేసింది మీ పాలనలో కాదా.. అప్పుడు ఉద్యమకారులు గుర్తుకు రాలేదా? అని ప్ర‌శ్నించారు. పోలీసులు మిమ్మల్ని అలా తలుపులు బద్దలు కొట్టి తీసుకురాలేదు కదా… నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు. రావి నారాయణ రెడ్డి లాంటి వారు తెలంగాణ కోసం సర్వం కోల్పోయార‌న్నారు. పదవులు, వేలకోట్ల ఆస్తులు సంపాదించుకున్న మీరు ఉద్యమకారులు ఎలా అవుతారంటూ ప్ర‌శ్నించారు. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినప్పుడు అర్థం చేసుకోవాలి.. హుందాగా తప్పుంటే కొంతైనా మీ గౌరవం నిలబడేది .ప్రజలే తప్పు చేశారని చెప్పడం.. ఇదెక్కడి ప్రజాస్వామ్యం, ఇదెక్కడి ఉద్యమకారుడి లక్షణం, ఇదెక్కడి జాతిపిత లక్షణం అంటూ మండిప‌డ్డారు సీఎం రేవంత్ రెడ్డి.
The post తప్పు చేసిన వారు శిక్ష నుంచి త‌ప్పించు కోలేరు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Tejashwi Yadav: మహాగఠ్‌బంధన్‌ సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్Tejashwi Yadav: మహాగఠ్‌బంధన్‌ సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్

Tejashwi Yadav : బిహార్‌ శాసనసభ ఎన్నికల్లో విపక్ష మహాకూటమి (మహాగఠ్‌బంధన్‌) తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ (Tejashwi Yadav) పేరు ఖరారైంది. ఉపముఖ్యమంత్రి అభ్యర్థిగా ‘వికాస్‌శీల్‌ ఇన్సాన్‌ పార్టీ’ (వీఐపీ) అధినేత ముఖేశ్‌ సాహ్నీ పేరును

Mohan Bhagwat: సత్యం, ధర్మానికి రామాలయం ప్రతీక – మోహన్ భాగవత్Mohan Bhagwat: సత్యం, ధర్మానికి రామాలయం ప్రతీక – మోహన్ భాగవత్

    రామాలయ నిర్మాణం కోసం ఎందరో త్యాగాలు చేశారని, వారి ఆత్మలు ఈరోజు సంతోషంగా ఉంటాయని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. అయోధ్యలో బాలరాముడి ఆలయ శిఖరంపై ప్రధానమంత్రి మోదీతో కలిసి కాషాయ

Degree Student: మహిళా అధ్యాపకుల వేధింపులు తాళలే డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యDegree Student: మహిళా అధ్యాపకుల వేధింపులు తాళలే డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య

Degree Student : విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో దారుణం జరిగింది. కళాశాలలో మహిళా అధ్యాపకుల వేధింపులు తాళలేక… డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కళాశాలలో ఇద్దరు మహిళా అధ్యాపకులు… తమ లైంగిక అవసరాలు తీర్చాలంటూ