hyderabadupdates.com Gallery తిరుమలలో అంగ‌రంగ వైభవంగా రథ సప్తమి

తిరుమలలో అంగ‌రంగ వైభవంగా రథ సప్తమి

తిరుమలలో అంగ‌రంగ వైభవంగా రథ సప్తమి post thumbnail image

తిరుమల : కోట్లాది భ‌క్తుల కొంగు బంగారంగా వినుతి కెక్కిన తిరుమ‌ల పుణ్య క్షేత్రం భ‌క్త బాంధ‌వుల‌తో కిట కిట లాడింది. సూర్య జయంతిని పురస్కరించుకుని ఆదివారం తిరుమలలో రథసప్తమి ఉత్సవాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించింది.ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమినాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఒకే రోజున శ్రీమలయప్ప స్వామి వారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై అనుగ్రహించడం విశేషం. ఈ కారణంగా ఈ ఉత్సవాన్ని అర్ధ బ్రహ్మోత్సవం, మినీ బ్రహ్మోత్సవం, ఒకరోజు బ్రహ్మోత్సవంగా పిలుస్తుంటారు.
రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో క్రీ.శ 1564 నుండి జరుపుతున్నట్లుగా శాసన ఆధారాలు ఉన్నాయి. సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు వివిధ వాహనాలపై స్వామి వారిని వేంచేపు చేస్తారు. ఇదిలా ఉండ‌గా సూర్య ప్ర‌భ వాహ‌నం మీద ఊరేగారు స్వామి వారు. ఉద‌యం 5.30 గంట‌ల నుండి 8 గంట‌ల‌కు నిర్వ‌హించారు ఘ‌నంగా. సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్య కారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాడు. ఈ వాహ‌నంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్య ప్రభ. సూర్య మండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యుని సూర్య నారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతే జఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్య నారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని భ‌క్తుల ప్ర‌గాఢ న‌మ్మ‌కం.
The post తిరుమలలో అంగ‌రంగ వైభవంగా రథ సప్తమి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Tejashwi Yadav: ప్రభుత్వం ఏర్పాటయ్యాక ‘రిటర్న్‌ గిఫ్ట్‌’ ఉంటుంది – తేజస్వీయాదవ్‌Tejashwi Yadav: ప్రభుత్వం ఏర్పాటయ్యాక ‘రిటర్న్‌ గిఫ్ట్‌’ ఉంటుంది – తేజస్వీయాదవ్‌

    ఆర్జేడీ నాయకుడు తేజస్వీయాదవ్‌ 36వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఎన్నికల ప్రచారం చివరి రోజైన ఆదివారం కారాకట్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న తేజస్వీ… ‘నాకు శుభాకాంక్షలు తెలిపిన ఆర్జేడీ మద్దతుదారులకు కృతజ్ఞతలు. ఎన్నికల ఫలితాలు వెలువడిన

ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైపు బ్లాక్ స్టోన్, బ్రూక్ ఫీల్డ్ చూపుఆంధ్ర‌ప్ర‌దేశ్ వైపు బ్లాక్ స్టోన్, బ్రూక్ ఫీల్డ్ చూపు

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర స‌ర్కార్ తీసుకుంటున్న చ‌ర్య‌లు స‌త్ఫ‌లితాలు ఇస్తున్నాయి. ఈ మేర‌కు సానుకూలమైన వాతావ‌ర‌ణం క‌ల్పించ‌డంతో విస్తృతంగా పెట్టుబ‌డులు వ‌స్తున్నాయ‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ఇందులో భాగంగా దావోస్ లో

CM Mamata Banerjee: వైద్య విద్యార్థిని అత్యాచారంపై సీఎం మమత షాకింగ్ కామెంట్స్CM Mamata Banerjee: వైద్య విద్యార్థిని అత్యాచారంపై సీఎం మమత షాకింగ్ కామెంట్స్

    పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో శుక్రవారం(అక్టోబర్‌ 10వ తేదీ) వైద్య విద్యార్థినిపై అత్యాచారం జరగడంపై సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది తనను షాక్‌కు గురి చేసిందని, బాధితురాలికి కచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే