hyderabadupdates.com Gallery తిరుమలలో శ్రీవారి ధర్మ రథాలకు విశేష ఆదరణ

తిరుమలలో శ్రీవారి ధర్మ రథాలకు విశేష ఆదరణ

తిరుమలలో శ్రీవారి ధర్మ రథాలకు విశేష ఆదరణ post thumbnail image

తిరుమ‌ల : తిరుమలలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవారి ధర్మ రథాలు (ఉచిత బస్సు సేవలు) డిజిటల్ డిస్ప్లే బోర్డుల ఏర్పాటుతో మరింత ప్రజాదరణ పొందుతున్నాయి. బస్సులు వచ్చే సమయాన్ని భక్తులు ముందుగానే తెలుసుకునేలా డిజిటల్ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయడం వల్ల వేచి చూసే సమయం తగ్గి, ఉచిత రవాణా సేవలను విస్తృతంగా వినియోగిస్తున్నారు ప్రస్తుతం తిరుమలలో మొత్తం 12 ఆధునిక ఎలక్ట్రిక్ బస్సులు ఈ సేవలో ఉన్నాయి. రోజుకు సగటున 300 ట్రిప్పులు నిర్వహిస్తూ, ఒక్కో ట్రిప్పు సుమారు 6.5 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తోంది. ఈ విధానం దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాల్లో భక్తుల కోసం ప్రత్యక్ష బస్సు సమాచారం అందించే తొలి సాంకేతిక ప్రయోగంగా నిలుస్తోంది
బస్సుల ప్రత్యక్ష స్థానం, వచ్చే సమయాన్ని డిజిటల్ డిస్ప్లే ద్వారా భక్తులకు తెలియ జేయడంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రోజుకు సుమారు 60 వేల మంది భక్తులు ఈ ఉచిత బస్సు సేవలను వినియోగిస్తూ సౌకర్యవంతంగా ప్రయాణిస్తున్నారు. గతంలో ఉచిత బస్సు వచ్చే సమయం ముందుగా తెలియక పోవడంతో భక్తులు ప్రైవేట్ ట్యాక్సీల్లో ప్రయాణించేందుకు మొగ్గు చూపేవారు. దీంతో ట్యాక్సీ డ్రైవర్లు భక్తుల నుండి అధిక ధరలను వసూలు చేసేవారు. ఈ సమస్యను గుర్తించిన టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి ప్రత్యేక చొరవ తీసుకుని తిరుమలలోని 20 బస్టాప్ లలో బస్సుల ప్రత్యక్ష సమయం తెలిసేలా డిజిటల్ డిస్ప్లే బోర్డుల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు.
The post తిరుమలలో శ్రీవారి ధర్మ రథాలకు విశేష ఆదరణ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Amit Shah: తనయుల కోసం సోనియా, లాలూ ఆరాటం – అమిత్ షాAmit Shah: తనయుల కోసం సోనియా, లాలూ ఆరాటం – అమిత్ షా

Amit Shah : తనయుడు రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయాలని కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ, కుమారుడు తేజస్విని బిహార్‌ కు ముఖ్యమంత్రిగా చూడాలని ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ పరితపిస్తున్నా ఆ రెండు పదవులూ ఖాళీగా లేవని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

ప్ర‌భాస్ రాజా సాబ్ త‌ప్ప‌కుండా హిట్ అవుతుందిప్ర‌భాస్ రాజా సాబ్ త‌ప్ప‌కుండా హిట్ అవుతుంది

హైద‌రాబాద్ : ద‌ర్శ‌కుడు మారుతి సీరియ‌స్ కామెంట్స్ చేశాడు. ప్ర‌భాస్ , మాళ‌విక మోహ‌న్, రిద్దీ కుమార్, నిధి అగ‌ర్వాల్ , సంజ‌య్ ద‌త్ తో క‌లిసి ది రాజా సాబ్ తీశాడు. దీనిని పీపుల్స్ మీడియా నిర్మించింది. భారీ బడ్జెట్

ReNew Energy Global: రూ.82,000 కోట్లతో ‘రెన్యూ పవర్’ ప్రాజెక్టులకు కుదిరిన ఒప్పందాలుReNew Energy Global: రూ.82,000 కోట్లతో ‘రెన్యూ పవర్’ ప్రాజెక్టులకు కుదిరిన ఒప్పందాలు

  గత ప్రభుత్వంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలు భారీ పెట్టుబడులతో తిరిగి రాష్ట్రానికి వస్తున్నాయి. విశాఖలో 14, 15 తేదీల్లో జరిగే 30వ సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ సమావేశాలకు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. పునరుత్పాదక విద్యుత్ రంగంలో