hyderabadupdates.com Gallery తిరుమల పవిత్రతతో ఆటలాడితే ఊరుకోం

తిరుమల పవిత్రతతో ఆటలాడితే ఊరుకోం

తిరుమల పవిత్రతతో ఆటలాడితే ఊరుకోం post thumbnail image

​కాకినాడ రూరల్ : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ వ్యవహారంలో గత వైసీపీ ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదం ఇప్పుడు సిబిఐ ఛార్జ్‌షీట్ ద్వారా బట్ట బయలైందని , దీని నుంచి తప్పించు కోవడానికి అంబటి రాంబాబు కొత్త డ్రామాలు ఆడుతున్నారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ధ్వజమెత్తారు. ఆదివారం త‌న‌ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీకి సరఫరా అయిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సిబిఐ చెప్పిందంటూ వైసీపీ నేతలు సంబరాలు చేసుకోవడాన్ని నానాజీ తప్పుబట్టారు. అసలు పాలు, వెన్న అనే ఆనవాళ్లే లేని సింథటిక్ నెయ్యిని సరఫరా చేసి, కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. సుమారు 250 కోట్ల రూపాయల విలువైన కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేయడం మహాపాపం కాదా? అని ఆయన ప్రశ్నించారు.
గుంటూరులో టిడిపి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలో అంబటి రాంబాబు సృష్టించిన గొడవను నానాజీ తీవ్రంగా ఖండించారు. చేసిన తప్పులు బయట పడుతున్నాయనే భయంతోనే అంబటి ఇలాంటి “డైవర్షన్ పాలిటిక్స్” చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిపై అసభ్య పదజాలం వాడటం అంబటి అహంకారానికి నిదర్శనమని, దీనికి తగిన శాస్తి జరుగుతుందని అన్నారు. తిరుమల ప్రతిష్టను గంగలో కలిపిన ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఎవరినీ ఉపేక్షించేది లేదని పంతం నానాజీ స్పష్టం చేశారు. తిరుమల పవిత్రతను కాపాడటమే కూటమి ప్రభుత్వ మొదటి ప్రాధాన్యతని, అంబటి రాంబాబు లాంటి వారు ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని నానాజీ పేర్కొన్నారు.
The post తిరుమల పవిత్రతతో ఆటలాడితే ఊరుకోం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Banjara: ఎస్టీ రిజర్వేషన్ కోసం చెట్టుకు వేలాడదీసిన మంచంపై కూర్చుని నిరాహారదీక్షBanjara: ఎస్టీ రిజర్వేషన్ కోసం చెట్టుకు వేలాడదీసిన మంచంపై కూర్చుని నిరాహారదీక్ష

      తమ హక్కులు సాధించుకునేందుకు శాంతియుత మార్గంలో చేపట్టే నిరసనల్లో ప్రధానమైనది నిరాహారదీక్ష. సాధారణంగా ఓ ప్రాంతంలో టెంటు వేసుకొని నిరాహారదీక్షలు చేయటం మనం చూస్తుంటాం. కానీ, మహారాష్ట్రలో ఓ వ్యక్తి ఒక చెట్టుకు నులక మంచాన్ని వేలాడదీసి,

Justice Suryakant: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్Justice Suryakant: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్

Justice Suryakant : సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 24వ తేదీన జస్టిస్ సూర్యకాంత్ (Justice Suryakant) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు

“KCR Confident: Jubilee Hills Victory ‘Inevitable,’ Holds Key Conclave”“KCR Confident: Jubilee Hills Victory ‘Inevitable,’ Holds Key Conclave”

The BRS party has taken the Jubilee Hills by-election with great pride. In this context, party chief Kalvakuntla Chandrasekhar Rao himself has been busy strategizing. He held a key meeting