hyderabadupdates.com movies తెరంగేట్రం చేయాల్సింది ఇలా కాదు

తెరంగేట్రం చేయాల్సింది ఇలా కాదు

ప్రముఖ బాలీవుడ్ సీనియర్ హీరో శత్రుఘ్న సిన్హా అంటే తెలియని నిన్నటి తరం ప్రేక్షకులు ఉండరు. అమితాబ్ సమకాలీకులే అయినా రాజకీయాల్లోకి వెళ్ళిపోయాక నటనకు పూర్తిగా స్వస్తి చెప్పారు. ఆయన వారసురాలిగా సోనాక్షి సిన్హా 2010లో ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రమే సల్మాన్ ఖాన్ దబాంగ్ అదిరిపోయే బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇంకేముంది అమ్మడికి తిరుగు లేదని అందరూ అనుకున్నారు. కానీ జరిగింది వేరు. తర్వాత అడపాదడపా హిట్లు ఉన్నప్పటికీ ఎక్కువ శాతం ఫ్లాపులు పలకరించడంతో క్రమంగా కనిపించడం తగ్గించేసింది. రజనీకాంత్ లింగాతో తమిళంలో ప్రవేశించినా అక్కడా తిరస్కారం తప్పలేదు.

పదిహేను సంవత్సరాల తర్వాత తెలుగులో జటాధరతో తొలి టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీతో పరిచయమయ్యింది. అయితే దీనికొచ్చిన నెగటివ్ టాక్ కన్నా సినిమాలో ఆమె పోషించిన ధన పిశాచి పాత్ర మీదే ఎక్కువ నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. చంద్రముఖి, తుంబాడ్ ని కలిపి దర్శకులు ఏదో తెలివైన పని చేశామనుకున్నారు కానీ అది ఎంత దారుణంగా తెరమీద ఫెయిలవుతుందో పసిగట్ట లేకపోయారు. అయినా ఊరికే కేకలు వేస్తూ ఒళ్ళంతా బంగారం దిగేసుకొన్న క్యారెక్టర్ లో తనను రిసీవ్ చేసుకుంటారని సోనాక్షి సిన్హా ఎలా అనుకుందో కానీ దీని దెబ్బకు మళ్ళీ ఇంకో ఆఫర్ వస్తే ఒట్టు అనేలా పరిస్థితి మారిపోయింది.

నిజానికి కొన్నేళ్ల క్రితమే సోనాక్షి సిన్హాకు చిరంజీవి, బాలకృష్ణ లాంటి సీనియర్ల సరసన నటించేందుకు ఆఫర్లు వెళ్లాయట. కానీ రజనీకాంత్ లాంటి సీనియర్ తో చేశాక చాన్సులు తగ్గిపోయాయని భావించిన ఈమె వాటికి సున్నితంగా నో చెప్పేసిందట. ఒకవేళ ఒప్పుకున్నా బాగుండేదేమో. ఏది ఏమైనా ఎక్కాల్సిన రైలు జీవితం లేట్ అన్న తరహాలో వయసులో ఉన్నప్పుడే ఇతర భాషల్లో తెరంగేట్రం చేయాలి తప్ప ఇలా నాలుగు పదుల వయసుకు దగ్గరగా ఉన్నప్పుడు కాదు. తనకే కాదు నమ్రతా శిరోద్కర్ సోదరి శిల్పా శిరోద్కర్ కు కూడా జటాధర చేదు జ్ఞాపకంగా మిగిలింది. ఆవిడ 33 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చింది.

Related Post

ఆ ఇద్ద‌రినీ అలా సంతృప్తి ప‌రిచిన రేవంత్ రెడ్డిఆ ఇద్ద‌రినీ అలా సంతృప్తి ప‌రిచిన రేవంత్ రెడ్డి

మంత్రి ప‌ద‌వులు ఆశించిన వారి విష‌యంలో సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ముఖ్యంగా ఇద్ద‌రు సీనియ‌ర్ నేత‌లు.. రేవంత్‌రెడ్డి మంత్రి వ‌ర్గంలో చోటు కోసం ప్ర‌య‌త్నాలు చేశారు. అయితే.. వివిధ కార‌ణాల‌తో వారికి అవ‌కాశం చిక్క‌లేదు. నిజానికి 18