హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో తాము ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతామని స్పష్టం చేశారు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఆమె హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ జాగృతి కాంట్రాక్టర్లకు కాకుండా కార్మికులకు అండగా నిలుస్తుందని ఆమె పునరుద్ఘాటించారు . సింగరేణిలోని కార్మిక సమస్యలను బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ విస్మరించాయని ఆందోళన వ్యక్తం చేశారు. బడా కాంట్రాక్టర్లను వదిలేసి చిన్న కాంట్రాక్టర్లను టార్గెట్ చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. మీడియా స్వేచ్ఛ విషయమై, కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులను అరెస్టు చేయడాన్ని కవిత ఖండించారు. జర్నలిస్టులు నేరస్తులు లేదా ఉగ్రవాదులు కాదని, వారికి నోటీసులు జారీ చేయాల్సిందని ఆమె అన్నారు. అదే సమయంలో, కొన్ని మీడియా సంస్థలు కొన్ని కథనాలను ప్రసారం చేసినప్పుడు, ఆ మీడియా సంస్థలపై దాడులు జరిగాయని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నాయకత్వం ద్వంద్వ ప్రమాణాలను ఆమె ప్రశ్నించారు.
దళిత మహిళలపై అవమానకరమైన, పరువు నష్టం కలిగించే కవరేజీని కవిత తీవ్రంగా వ్యతిరేకించారు, ఈ విషయంలో రాజకీయ పార్టీలు చూపిస్తున్న పక్షపాత వైఖరిని నిలదీశారు. శక్తివంతమైన నాయకులకు ఒక నియమం, దళిత మహిళలకు మరొక నియమం ఉండటం ఆమోద యోగ్యం కాదని అన్నారు. సింగరేణిలో ఎండీఓ (మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్) వ్యవస్థ సంస్థకు తీవ్ర ఆర్థిక నష్టాలను కలిగించిందని పేర్కొన్నారు. గతంలో ఓపెన్-కాస్ట్ మైనింగ్ ద్వారా సింగరేణి లాభదాయకంగా ఉండేదని గుర్తు చేశారు. ఎండీఓ వ్యవస్థ ప్రభుత్వ రంగ సంస్థ నష్టానికి ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చిందని ఆమె ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో సింగరేణి అప్పు రూ. 25,000 కోట్లు ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అది కాస్తా రూ. 50,000 కోట్లకు పెరిగిందని, జీతాల చెల్లింపుల కోసం కూడా కంపెనీ అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆమె ఎత్తి చూపారు.
The post తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతాం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతాం
Categories: