hyderabadupdates.com movies తెలంగాణలో రేపటినుండి ‘ముక్క’ దొరకదు

తెలంగాణలో రేపటినుండి ‘ముక్క’ దొరకదు

ఈ వార్త నిజంగానే షాకింగనే చెప్పాలి. రేపు అంటే బుధవారం నుంచి తెలంగాణవ్యాప్తంగా చికెన్ ముక్క దొరకదట. మరి ముక్క లేనిదే ముద్ద దిగని వారి పరిస్థితి ఏమిటంటారా? ఖరీదు ఎక్కువైనా మటన్ షాపులకు దారి తీయడమొక్కటే మార్గం. అయితే చికెన్ ముక్కకు అలవాటు పడ్డ వారు మటన్ షాపులకు అంతగా వెళ్లలేరు కదా. మరి ఎలా అంటారా? ఏలా ఏమిటి? చికెన్ షాపులు తెరిచేదాకా వేచి చూడాల్సిందే. అప్పటిదాకా ముక్క మాటను పక్కన పెట్టాల్సిందే.

అయినా తెలంగాణలో బుధవారం నుంచి చికెన్ దొరకకపోవడానికి కారణమేమిటంటే… రాష్ట్రంలోని చికెన్ షాపులన్నీ మూత పడనున్నాయట. ఈ మేరకు తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ మంగళవారం ఓ సంచనల ప్రకటనను విడుదల చేసింది. బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులను మూసివేస్తున్నామని సదరు ప్రకటనలో అసోసియేషన్ ప్రకటించింది. అయితే ఎప్పటి నుంచి తిరిగి షాపులను తెరుస్తామన్న విషయాన్ని మాత్రం అసోసియేషన్ వెల్లడించలేదు.

అయినా చికెన్ షాపులన్నీ కట్టకట్టుకుని మూత పడటానికి గల కారణాలేమిటన్న విషయానికి వస్తే… ఫారం కోళ్లను పౌల్ట్రీ ఫారాల నుంచి చికెన్ షాపులు తీసుకుంటున్నాయి. ఇలా తమ కోళ్లను చికెన్ గా మలచి విక్రయిస్తున్న చికెన్ షాపులకు పౌల్ట్రీ యాజమాన్యాలు కమీషన్ ను అందిస్తున్నాయి. ఈ కమీషన్ ను ఇటీవలి కాలంలో ఏమాత్రం పెంచలేదట.

దీంతో మారిన కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా తమకు కమిషన్ పెంచాల్సిందేనని అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్ చాలా కాలం నుంచి ఉన్నా… పౌల్ట్రీ ఫారం యాజమాన్యాలు ఏమాత్రం పట్టించుకోలేదట. దీంతో చికెన్ షాపుల బంద్ కు అసోసియేషన్ పిలుపునిచ్చింది. మరి ఎప్పుడు ఈ సమస్య పరిష్కారం అవుతుందో చూడాలి.

Related Post

‘వందేమాతరం – నెహ్రూ’ : ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు‘వందేమాతరం – నెహ్రూ’ : ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాల్లో సోమ‌వారం.. జాతీయ గేయం వందేమాత‌రంపై చ‌ర్చ జ‌రిగింది. ఈ గేయానికి 150 సంవ‌త్స‌రాలు పూర్త‌యిన నేప‌థ్యాన్ని పుర‌స్క‌రించుకుని చేప‌ట్టిన‌ చ‌ర్చ‌లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ప్ర‌సంగించారు. అయితే.. ఆయ‌న తొలుత వందేమాత‌రం గొప్ప‌ద‌నాన్ని, నాటి బ్రిటీష్