దేశ రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మహిళా నేతలలో ఇందిరా గాంధీ మొదలు వైఎస్ షర్మిల వరకు ఎందరో ఉన్నారు. అయితే, తన సింప్లిసిటీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఫైర్ బ్రాండ్ నేతలు కొందరే ఉన్నారు. వారిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముందుంటారు. సాధారణ మధ్యతరగతి మహిళ మాదిరిగా చీరను ధరించే మమతను బెంగాళీ మహిళలు తమలో ఒకరిగా తమ దీదీగా భావిస్తుంటారు. మధ్యతరగతి మహిళల్లో ఒకరేమో అన్నట్లుగా దీదీ వస్త్రధారణ చాలా సాదాసీదాగా ఉంటుంది. జడ కొప్పుతో పెద్దమనిషి తరహాలో ఉండే దీదీ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు.
అందుకేనేమో, వస్త్రధారణలో దీదీని బీఆర్ఎస్ మాజీ నేత కల్వకుంట్ల కవిత ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించిన సందర్భంగా కవిత కొత్త లుక్ పై సోషల్ మీడియాలో చర్చ జరిగింది. మమతా బెనర్జీ, దివంగత బీజేపీ నేత సుష్మా స్వరాజ్ లను పోలి ఉండేలా కవిత వస్త్రధారణ, కట్టుబొట్టు ఉందని నెటిజన్లు అంటున్నారు. మరి, ఈ కొత్త లుక్ ను కవిత కంటిన్యూ చేస్తారా లేదా అన్నది వేచి చూడాలి.