hyderabadupdates.com Gallery తెలంగాణ నుంచి కేసీఆర్ ను విడ‌దీయ‌లేరు

తెలంగాణ నుంచి కేసీఆర్ ను విడ‌దీయ‌లేరు

తెలంగాణ నుంచి కేసీఆర్ ను విడ‌దీయ‌లేరు post thumbnail image

హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్ అంటేనే తెలంగాణ అని , ఆయ‌న లేకుండా రాష్ట్రాన్ని ఊహించ లేమ‌న్నారు. సీఎం రేవంత్ రెడ్డి త‌న ఆన‌వాళ్లు చెరిపి వేయాల‌ని చూస్తున్నాడ‌ని, కానీ ఆయ‌న ఆట‌లు సాగ‌వ‌న్నారు. శ‌నివారం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎవ‌రు పోరాడితే ఈ స్వ‌రాష్ట్రం వ‌చ్చిందో గ‌మ‌నించాల‌ని అన్నారు. ఇవాళ తెలంగాణ గడ్డపై ఒక వికృతమైన రాజకీయ క్రీడ జరుగుతోంద‌ని అన్నారు. పద్నాలుగేళ్ల సుదీర్ఘ పోరాటంతో, ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించి స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. ఒక తండ్రిలా ఈ రాష్ట్రాన్ని అక్కున చేర్చుకుని, పడావు పడ్డ తెలంగాణను ప్రగతి బాటలో నడిపించిన మహోన్నత శిల్పి కేసీఆర్ అని పేర్కొన్నారు కేటీఆర్.
తన జీవితం అంతా తెలంగాణ కోసం పోరాటం చేశార‌ని గుర్తు చేశారు. ఎప్పుడూ బిరుదుల కోసం పాకులాడ లేద‌ని అన్నారు సన్మానాల కోసం తపించలేదని స్ప‌ష్టం చేశారు. ఎందుకంటే, తెలంగాణ ప్రజల శ్రేయస్సు, సంక్షేమమే ఆయనకు నిజమైన సన్మానం, సత్కారం అని తెలిపారు. ఉద్యమ సారథిగా పద్నాలుగేళ్లు చారిత్రాత్మక పోరాటం చేసినా తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణ పల్లె పల్లెను పచ్చగ చేసినా.. ఆయన గుండె చప్పుడు అనుక్షణం తెలంగాణనే అని మ‌రోసారి ప్ర‌క‌టించారు కేటీఆర్. కానీ, నేడు అధికారం చేతిలో ఉందనే అహంకారంతో, తన వైఫల్యాలను, తన ప్రభుత్వ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద, ఆయన వ్యక్తిత్వం మీద విషం చిమ్ముతున్నాడని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇది కేవలం ఒక వ్యక్తి మీద దాడి కాదు.. తెలంగాణ పోరాట చరిత్ర మీద జరుగుతున్న దాడిగా ప‌రిగ‌ణించాల‌ని అన్నారు.
The post తెలంగాణ నుంచి కేసీఆర్ ను విడ‌దీయ‌లేరు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Palla Srinivasarao: బొత్సకు జగన్ నుంచి ప్రాణహాని ఉంది – టీడీపీ అధ్యక్షుడు పల్లా Palla Srinivasarao: బొత్సకు జగన్ నుంచి ప్రాణహాని ఉంది – టీడీపీ అధ్యక్షుడు పల్లా 

Palla Srinivasarao : విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో కుటుంబ సభ్యులతో కలిసి తాను కూర్చున్న స్టేజి కూలిపోయిన ఘటన వెనుక ప్రభుత్వం యొక్క కుట్ర దాగి ఉందని శాసన మండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే

సీఎస్ కె. రామ‌కృష్ణారావు ప‌ద‌వీ కాలం పొడిగింపుసీఎస్ కె. రామ‌కృష్ణారావు ప‌ద‌వీ కాలం పొడిగింపు

హైద‌రాబాద్ : కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు తెలంగాణ స‌ర్కార్ కు తీపి కబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌ని చేస్తున్న కె. రామ‌కృష్ణారావు ప‌ద‌వీ కాలం పొడిగించేందుకు అనుమ‌తి ఇస్తున్న‌ట్లు స్ప‌ష్టం

Operation Chhatru: జమ్మూకశ్మీర్‌ లో ఆపరేషన్‌ ఛత్రు ! ముగ్గురు ఉగ్రవాదులు హతం !Operation Chhatru: జమ్మూకశ్మీర్‌ లో ఆపరేషన్‌ ఛత్రు ! ముగ్గురు ఉగ్రవాదులు హతం !

    జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు బుధవారం ఆపరేషన్‌ ఛత్రును చేపట్టాయి. కిష్తివాడ్‌ జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులు దాక్కున్నట్లు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఉగ్రవాదులను చుట్టుముట్టాయి. దీంతో సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కిష్తివాడ్‌లోని ఛత్రు