hyderabadupdates.com movies తెలుగు అభిమానులకు దురంధర్ స్ట్రోక్

తెలుగు అభిమానులకు దురంధర్ స్ట్రోక్

భయపడినట్టే జరిగింది. దురంధర్ ది రివెంజ్ తెలుగు ప్రీమియర్లు క్యాన్సిలయ్యాయని ట్రేడ్ టాక్. పివిఆర్ ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్సులు ఇప్పటికే దీనికి సంబంధించిన బుకింగ్స్ ఆపేయగా మెల్లగా ఇతర చోట్ల కూడా దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. హిందీ మాత్రం యథావిధిగా చెప్పిన టైం అంటే సాయంత్రం అయిదు గంటల నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. వీటిలో మార్పు ఉండకపోవచ్చు.

ఇది దురంధర్ 2 తెలుగులో చూద్దామని ప్లాన్ చేసుకున్న అభిమానులకు ఇది ఆశనిపాతం లాంటి వార్త. ఇప్పటికిప్పుడు హిందీ వెర్షన్లకు షిఫ్ట్ అయిపోదామన్నా చాలా చోట్ల టికెట్లు అందుబాటులో లేవు. ప్రీమియమ్ స్క్రీన్లలో మరీ ముందు వరసలో చూసేందుకు రెడీ అయితే తప్ప దొరకవు. ఇక బిసి సెంటర్లలో డబ్బింగ్ బదులు ఒరిజినల్ వెర్షన్ చూసేందుకు ఆడియన్స్ ఇష్టపడితే కలెక్షన్లు మిస్ కాకుండా చూసుకోవచ్చు. కానీ అదంత సులభం కాదు.

అయినా మార్చి 19 విడుదల తేదీ ఎప్పుడో డిసైడ్ చేసినప్పుడు చివరి నిమిషం దాకా కంటెంట్ డెలివరీలో ఎందుకు నిర్లక్ష్యం చేశారనేది పెద్ద ప్రశ్న. ఒత్తిళ్లు, పనులు లాంటి కారణాలు ఎన్ని చెప్పుకున్నా మూవీ లవర్స్ కి అవన్నీ అనవసరం. టికెట్ కొన్నాక ఆ ఎక్స్ పీరియన్స్ మిస్ అవుతుందంటే ఆ బాధ మాములుగా ఉండదు. అందులోనూ దురంధర్ ది రివెంజ్ మీద అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. నాలుగు గంటల ర్యాంపేజ్ కి బాగా సిద్దమై ఉన్నారు.

ఇప్పుడు కోరుకోవాల్సింది ఒకటే. హిందీ ప్రింటుకు ఎలాంటి ఆటంకాలు రాకూడదని. రేపు ఉదయం ఉస్తాద్ భగత్ సింగ్ చూసే ప్రణాళికలో ఉండటం వల్ల చాలా మంది దురంధర్ ది రివెంజ్ ఇవాళే ప్లాన్ చేసుకున్నారు. కానీ హఠాత్తుగా జరిగిన ఈ పరిణామం వాళ్ళను డిస్టర్బ్ చేస్తుంది. దర్శకుడు ఆదిత్య ధార్, నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ శతవిధాలా ప్రయత్నించినప్పటికీ దురంధర్ 2 డబ్బింగ్ వెర్షన్లను సకాలంలో ఇవ్వలేకపోయారట. ఇది మాత్రం షాక్ అఫ్ ది డే అని చెప్పాలి.

Related Post

‘అవున‌యా… అదేమ‌న్నా జ‌గ‌న్ సొంత‌మా?’‘అవున‌యా… అదేమ‌న్నా జ‌గ‌న్ సొంత‌మా?’

ఏపీ సీఎం చంద్ర‌బాబు తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌లు సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు సంబంధించి ఒక ప్ర‌త్యేక `క్యాలెండ‌ర్‌` తీసుకురావాల‌ని నిర్ణ‌యించారు. వ‌చ్చే ఏడాది మొద‌ల‌య్యే ఆర్థిక సంవ‌త్స‌రం(ఏప్రిల్ 1) నుంచి ఈ క్యాలెండ‌ర్‌ను అమల్లోకి