hyderabadupdates.com movies తేజు.. ఇంకొంచెం ముందు చేసి ఉంటే…

తేజు.. ఇంకొంచెం ముందు చేసి ఉంటే…

మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజ్‌కు ఇప్పుడు ఓ పెద్ద హిట్ చాలా అవసరం. యాక్సిడెంట్ తర్వాత నటించిన తొలి చిత్రం ‘విరూపాక్ష’ పెద్ద హిట్టయినా.. తన కెరీర్ వేగం పుంజుకోలేదు. తన మావయ్య పవన్ కళ్యాణ్‌తో తొలిసారి కలిసి నటించిన ‘బ్రో’ నిరాశపరిచింది. యాక్సిడెంట్ తాలూకు ఇబ్బందుల వల్ల గ్యాప్ తీసుకోవడం.. ‘గాంజా శంకర్’ క్యాన్సిల్ కావడంతో తేజు కెరీర్లో గ్యాప్ వచ్చింది.

తర్వాత రోహిత్ కేపీ అనే కొత్త దర్శకుడితో ‘సంబరాల ఏటి గట్టు’ అనే భారీ చిత్రాన్ని మొదలుపెట్టాడు. ‘హనుమాన్’ నిర్మాతలు వంద కోట్లకు పైగా బడ్జెట్లో ఈ సినిమా తీయడానికి రెడీ అయ్యారు. రంగంలోకి దిగాక ఖర్చు అంచనాలను మించిపోయింది. కొన్ని రోజులు టీం సైలెంటుగా ఉండిపోయింది. ఇటీవలే ‘సంబరాల ఏటి గట్టు’ టీజర్ ప్రేక్షకులను పలకరించింది. దానికి పాజిటివ్ ఫీడ్ బ్యాకే వచ్చింది.

అనగనగా ఒక వెనుకబడ్డ ప్రాంతం.. అక్కడో తెగ.. వారి మీద దారుణమైన అకృత్యాలు జరుగుతుంటాయి. అక్కడి జనం అల్లాడిపోతుంటారు. అప్పుడు ఒక రక్షకుడు వచ్చి వారికి నాయకత్వం వహిస్తాడు. వీరోచితంగా పోరాడతాడు. ఇప్పుడు భాషా భేదం లేకుండా ఈ కథలే ట్రెండుగా మారాయి. ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టించి హీరోతో రక్షకుడి అవతారం ఎత్తించి భారీ యాక్షన్ ఘట్టాలు, ఎలివేషన్లతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు దర్శకులు. 

కాకపోతే వివిధ భాషల్లో గత కొన్నేళ్లలో ఈ తరహా సినిమాలు చాలా వచ్చేశాయి. వీటి డోస్ ఎక్కువైపోయి జనాలకు మొహం మొత్తేసే పరిస్థితి వచ్చింది. ‘సంబరాల ఏటి గట్టు’ టీజర్లో విజువల్స్, భారీతనం, తేజు లుక్, తన డైలాగ్స్ అన్నీ బాగున్నా సరే.. ఇలాంటివి గత కొన్నేళ్లలో చాలా చూసేశాం కదా అనే ఫీలింగ్ కలిగింది. ఇలాంటి కథను తేజు కొన్నేళ్ల ముందు చేయాల్సిందని.. అప్పుడైతే తనకు పెద్ద బ్రేకే వచ్చేదని.. ఇలాంటి సినిమాల డోస్‌ బాగా ఎక్కువైపోయి ప్రేక్షకులు మొనాటనస్ ఫీలింగ్‌లోకి వచ్చేసిన సమయంలో రానున్న ఈ సినిమా ఎంతమేర వారిని మెప్పిస్తుందో అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Related Post

ఒక్కొక్క కుటుంబానికీ 3 వేలు.. మ‌రోసారి బాబు పెద్ద మ‌న‌సు!ఒక్కొక్క కుటుంబానికీ 3 వేలు.. మ‌రోసారి బాబు పెద్ద మ‌న‌సు!

సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి త‌న పెద్ద మ‌న‌సు చాటుకున్నారు. ప్ర‌స్తుతం దోబూచులాడుతున్న మొంథా తుఫాన్ ప్ర‌భావిత జిల్లాల్లో ముఖ్యంగా తీర ప్రాంత గ్రామాల్లోని ప్ర‌జ‌ల‌ను పున‌రావాస కేంద్రాల‌కు చేర్చారు. నిజానికి తుఫాను ఎఫెక్ట్ ఉంటుంద‌ని భావిస్తున్నా.. సోమ‌వారం అర్ధ‌రాత్రి త‌ర్వాత‌.. తేలిపోయే

Veteran Tamil filmmaker and musician Thakkali Srinivasan passes away at 72 in BengaluruVeteran Tamil filmmaker and musician Thakkali Srinivasan passes away at 72 in Bengaluru

His fans and industry insiders have been mourning his sad demise on social media. He started his career by bankrolling the Tamil language film, Ivargal Varungala Thoongal, followed by Manasukkul