hyderabadupdates.com movies త్రివిక్రమ్… ఆ ఒక్క సీన్‌లో అసలైన స్టఫ్?

త్రివిక్రమ్… ఆ ఒక్క సీన్‌లో అసలైన స్టఫ్?

వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటేనే ఒక ప్రత్యేకమైన బ్రాండ్. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలు (రచయితగా మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావు) ఇప్పటికీ టీవీల్లో వస్తే ఛానల్ మార్చకుండా చూసే ప్రేక్షకులు కోకొల్లలు. ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఇద్దరూ ‘ఆదర్శ కుటుంబం’ సినిమా కోసం చేతులు కలపడంతో అంచనాలు సహజంగానే పెరిగిపోయాయి. సమ్మర్ చివరలో రాబోతున్న ఈ చిత్రం గురించి ప్రస్తుతం ఒక క్రేజీ అప్‌డేట్ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది.

సినిమా అంటే కేవలం కథే కాదు, ప్రేక్షకుడిని కడుపుబ్బ నవ్వించే సన్నివేశాలు కూడా ఉండాలి. ‘ఆదర్శ కుటుంబం’ విషయంలో త్రివిక్రమ్ ఇదే ఫార్ములాను నమ్ముకున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ఒక కామెడీ ఎపిసోడ్ ఈ సినిమాకే ప్రాణం అని సమాచారం. సుమారు ఇరవై నిమిషాల పాటు సాగే ఈ సీక్వెన్స్‌లో వెంకటేష్ తన మార్క్ కామెడీ టైమింగ్‌తో విశ్వరూపం చూపించబోతున్నారట.

అసలు విషయానికి వస్తే, త్రివిక్రమ్ సినిమాల్లో డైలాగులు ఎంత పదునుగా ఉంటాయో మనకు తెలిసిందే. దానికి వెంకీ ఎనర్జీ తోడైతే ఇక నవ్వుల పండగే. ఈ ప్రత్యేకమైన కామెడీ సీన్ కోసం త్రివిక్రమ్ చాలా రోజులు కష్టపడి పంచ్ డైలాగులు రాశారని తెలుస్తోంది. థియేటర్లోకి వచ్చే ఫ్యామిలీ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని, ఇంటిల్లిపాది హాయిగా నవ్వుకునేలా ఈ ఎపిసోడ్‌ను డిజైన్ చేశారు. కేవలం నవ్వులే కాకుండా, ఆ సన్నివేశం కథలో ఒక కీలక మలుపుగా కూడా ఉంటుందని టాక్.

త్రివిక్రమ్ తన సినిమాల్లో ఎమోషన్స్ కూడా పక్కాగా ఉండేలా చూసుకుంటారు. ‘ఆదర్శ కుటుంబం’లో కూడా కుటుంబ విలువల చుట్టూ కథ తిరుగుతుందని ప్రచారం జరుగుతోంది. నారా రోహిత్ యాంటీ కాప్ రోల్ చేయడం వల్ల కథలో కొంత సీరియస్‌నెస్ ఉన్నప్పటికీ, ఆద్యంతం వినోదానికే ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. వెంకీ రోహిత్ మధ్య వచ్చే గిల్లీకజ్జాలు కూడా ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తాయని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

Related Post

AI తెచ్చే ప్రమాదాల్లో ఇదింకా మొదటిదిAI తెచ్చే ప్రమాదాల్లో ఇదింకా మొదటిది

తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇదే తరహాలో కొద్దిరోజుల క్రితం చిరంజీవి, నాగార్జున లాంటి సెలబ్రిటీలు డిజిటల్ రక్షణ

Boyapati Srinu promises immersive 3D experience with Akhanda 2Boyapati Srinu promises immersive 3D experience with Akhanda 2

​The sequel to the blockbuster hit, Akhanda 2, featuring the celebrated God of Masses, Nandamuri Balakrishna, under the direction of Boyapati Srinu, has escalated its anticipation. At a recent Hyderabad