hyderabadupdates.com movies థియేటర్లో జనాలున్నా ట్విస్ట్ వేరే ఉంది

థియేటర్లో జనాలున్నా ట్విస్ట్ వేరే ఉంది

ఇవాళ నూతన సంవత్సరం సందర్భంగా దాదాపుగా అన్ని చోట్లా సెలవు వాతావరణం ఉండటంతో జనం థియేటర్లకు బాగానే వెళ్లారు. ఈ రోజు ఏకంగా ఆరేడు రిలీజులు ఉన్నాయి కాబట్టి వాటిని హౌస్ ఫుల్ చేశారేమో అనుకుంటే పప్పులో కాలేసినట్టే.

తాజాగా వచ్చిన సైక్ సిద్దార్థ్, వనవీర, 45, మార్క్, నీలకంఠ, గత వైభవం, మదం దేనికీ పెద్దగా చెప్పుకునే ఓపెనింగ్స్ రాలేదు. ఉన్నంతలో నందు టీమ్ చేసిన ప్రమోషన్ల వల్ల ఏ సెంటర్లలో ప్రేక్షకులు కనిపించారు కానీ మిగిలినవి మాత్రం కనీస ఆక్యుపెన్సీల కోసం పోరాడాల్సిన పరిస్థితి. మరి ట్విస్ట్ ఏమనుకుంటున్నారా. ఈ రోజు విడుదలైన వాటికి కాకుండా వేరే సినిమాలకు పబ్లిక్ బాగా వచ్చారు.

రెండో వారంలో అడుగు పెట్టిన ఆది సాయికుమార్ శంబాల అనూహ్యంగా పికప్ అందుకుని బుక్ మై షో గంటల వారిగా చూపించే ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. అఖండ 2 తాండవం మళ్ళీ పుంజుకోవడం ఇంకో మలుపు. ఈషా, ఛాంపియన్ లకు డీసెంట్ టర్న్ అవుట్స్ కనిపిస్తున్నాయి.

నువ్వు నాకు నచ్చావ్ ఈ రిలీజ్ ఉదయం షోలకు భారీ స్పందన కనిపించగా పవన్ కళ్యాణ్ అభిమానులు జల్సాని పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. మురారి జస్ట్ ఓకే అనిపించుకుని బండి లాగుతోంది. ఇక దురంధర్ గురించి చెప్పనవసరం లేదు. నాలుగో వారంలోనూ రోజుకు నాలుగు షోలు వేస్తున్న అరుదైన రికార్డు చాలా చోట్ల అందుకుంది.

ఇదంతా ఈ రోజుకే పరిమితం అనడానికి లేదు. ఎందుకంటే రేపు మినహాయిస్తే మళ్ళీ వీకెండ్ వస్తుంది. ఇదే సీన్ రిపీట్ కావొచ్చు. బయ్యర్ల అంచనాలు కూడా అదే విధంగా ఉన్నాయి. నిజానికి కొత్త సినిమాలు ఏవైనా కొంచెం పెద్ద సౌండ్ చేస్తే రాజా సాబ్ వరకు ఫీడింగ్ వస్తుందనుకుంటే లాస్ట్ వీక్ వే మళ్ళీ ఫామ్ లోకి రావడం అనూహ్యం.

ఇంకో వారం దాటడం ఆలస్యం ప్రభాస్ తో సంక్రాంతి సందడి మొదలవుతుంది కాబట్టి ఆలోగా వీలైనంత రాబట్టుకునే టార్గెట్ మీద ఇప్పుడున్న సినిమాలు పరుగులు పెడుతున్నాయి. తెలంగాణలో అఖండ 2ని టికెట్ రేట్లు అమాంతం తగ్గించేయడానికి కారణం ఇదే.

Related Post

బాహుబలి ఎపిక్ ముగింపుకు వచ్చిందాబాహుబలి ఎపిక్ ముగింపుకు వచ్చిందా

రీ రిలీజుల్లో సరికొత్త రికార్డులకు శ్రీకారం చుట్టిన బాహుబలి ది ఎపిక్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు ట్రేడ్ టాక్. హైదరాబాద్ లాంటి మెయిన్ సెంటర్స్ మినహాయించి మిగిలిన చోట్ల మూడు రోజులు బాగా వసూళ్లు రాబట్టి సడన్

Tharun Bhascker Says ‘Santhana Prapthirasthu’ Feels as a Telugu MealTharun Bhascker Says ‘Santhana Prapthirasthu’ Feels as a Telugu Meal

Director and actor Tharun Bhascker, known for his sharp storytelling and natural humor, has shared his heartfelt appreciation for the upcoming film Santhana Prapthirasthu. The movie, starring Vikranth and Chandini