hyderabadupdates.com Gallery దర్శ‌కులు ధురంద‌ర్ ను చూసి నేర్చుకోవాలి

దర్శ‌కులు ధురంద‌ర్ ను చూసి నేర్చుకోవాలి

దర్శ‌కులు ధురంద‌ర్ ను చూసి నేర్చుకోవాలి post thumbnail image

హైద‌రాబాద్ : వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా ఆదిత్య ధ‌ర్ తీసిన దురంధ‌ర్ -2 మూవీ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఆ సినిమాను ఆకాశానికి ఎత్తేశారు. త‌ను సామాన్యంగా ఏ వ్య‌క్తుల‌ను, సినిమాల‌ను ప్ర‌శంసించ‌రు. కానీ గ‌త కొంత కాలంగా దురంధ‌ర్ -1, దురంధ‌ర్ సీక్వెల్ మూవీ గురించి ప‌దే ప‌దే పేర్కొంటూ దానిని ప్ర‌మోట్ చేస్తూ వ‌స్తున్నారు రామ్ గోపాల్ వ‌ర్మ‌. చిత్ర పరిశ్రమ కింద ఒక అణుబాంబును పేల్చిన తర్వాత, మిగతా చిత్ర పరిశ్రమ నుండి వస్తున్న నిశ్శబ్దం దిగ్భ్రాంతి కలిగిస్తోందని పేర్కొన్నారు.
ప్ర‌ధానంగా దురంధ‌ర్ -2 మూవీ సృష్టించిన ఈ విధ్వంసకరమైన విస్ఫోటనం చిత్ర పరిశ్రమలోని మిగతా వారందరినీ అంతరిక్షంలోకి విసిరేసిందని అన్నారు ఆర్జీవీ. ఆ సుదూర ప్రాంతాల వల్ల వారి చప్పట్లు ఇక్కడికి చేరలేవని ఇలా జరుగుతోందా, లేక వాళ్ళు వాస్తవాన్ని అంగీకరించకుండా, “ఇది కేవలం ప్రచారం… త్వరలోనే ఇది పోతుంది,” అని ఒకరికొకరు గుసగుసలాడుకుంటూ, వెనక్కి పాకుతూ వెళ్లి తమ పాత, రొటీన్ సినిమాలనే మళ్ళీ తీయడం మొదలుపె ట్టాలనుకుంటున్నారా, నాకేమీ తెలియడం లేదని పేర్కొన్నారు ఆర్టీవి.
లేక, ఆ సినిమా అద్భుతమైన ప్రతిభకు నిశ్చేష్టులైపోయి, తాము ఇప్పటి వరకు తీస్తున్నా లేదా తీయాలని అనుకుంటున్నా, ఏ సినిమా కూడా ఇప్పుడు దీనికి సాటి రాదని గ్రహించారా అని ప్ర‌శ్నించారు. కానీ, కళ్లెదుటే నిలబడి, బాక్సాఫీస్ వద్ద నేలనే కంపింప జేస్తున్న, గర్జనతో కళ్లలో నిప్పులు కక్కుతున్న ధురందర్2 లాంటి డైనోసార్‌ను పట్టించు కోక పోవడం అత్యంత అవివేకం కాదా? అని నిల‌దీశారు. సినీ పరిశ్రమలోని నా సహోద్యోగులందరికీ నా మనస్ఫూర్తి సలహా ఏంటంటే, దయచేసి ధురందర్2ను అత్యంత తీవ్రంగా తీసుకోండి. సినిమా నిర్మాణంలో ఒక సరికొత్త కోర్సులా దీన్ని అధ్యయనం చేసి, మిమ్మల్ని మీరు విద్యావంతులుగా చేసుకోండి అని సూచించారు రామ్ గోపాల్ వ‌ర్మ‌.
The post దర్శ‌కులు ధురంద‌ర్ ను చూసి నేర్చుకోవాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

తెలంగాణ‌లో 40 రైల్వే స్టేష‌న్ల అభివృద్దితెలంగాణ‌లో 40 రైల్వే స్టేష‌న్ల అభివృద్ది

హైద‌రాబాద్ : శ్రీ‌రామ న‌వమి పండుగ వేళ తీపి క‌బురు చెప్పింది కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి . అమృత్ భార‌త్ ప‌థ‌కం కింద రాష్ట్రంలోని 40 రైల్వే స్టేష‌న్ల‌ను ఎంపిక చేసిన‌ట్లు తెలిపింది. ఈ ప‌థ‌కం కింద ఎంపిక చేసిన వాటిని

ఏఐలో అమెరికా, భార‌త భాగ‌స్వామ్యం కీల‌కంఏఐలో అమెరికా, భార‌త భాగ‌స్వామ్యం కీల‌కం

న్యూఢిల్లీ : ఏఐ ప్రయోజ‌నాల‌ను అంద‌రికీ అందుబాటులో ఉంచ‌డంలో యుఎస్, భార‌త భాగ‌స్వామ్యం కీల‌క పాత్ర పోషించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు గూగుల్ సీఈఓ సుంద‌ర్ పిచాయ్. రెండు దేశాల మధ్య అలంకారికంగా, అక్షరాలా కనెక్షన్ పాయింట్‌గా పని చేయడం పట్ల గూగుల్

Mohammed Azaruddin: మైనారిటీ సంక్షేమం, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ శాఖా మంత్రిగా అజారుద్దీన్‌Mohammed Azaruddin: మైనారిటీ సంక్షేమం, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ శాఖా మంత్రిగా అజారుద్దీన్‌

    ఇటీవల రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మహ్మద్‌ అజారుద్దీన్‌కు ప్రభుత్వం శాఖలు కేటాయించింది. రాష్ట్ర అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమం, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ శాఖలను ఆయనకు కేటాయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం