hyderabadupdates.com movies దురంధరుడి వేట ఇప్పట్లో ఆగేలా లేదు

దురంధరుడి వేట ఇప్పట్లో ఆగేలా లేదు

పెద్ద బడ్జెట్లలో తీసిన పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ ముంగిట మంచి హైప్ తెచ్చుకుంటాయి. ఆ హైప్‌కు తగ్గట్లు మంచి ఓపెనింగ్సూ వస్తాయి. కానీ చాలా సినిమాల విషయంలో జరిగేది ఏంటంటే.. వీకెండ్ అవ్వగానే చల్లబడిపోతుంటాయి. టాక్ బాగున్నా సరే.. వసూళ్లు క్రమ క్రమంగా తగ్గుతుంటాయి. ఇదే చాలా ఏళ్లుగా నడుస్తున్న ట్రెండ్. కానీ కొన్ని సినిమాలు మాత్రం రివర్స్‌లో నడుస్తుంటాయి. 

రిలీజ్ ముంగిట హైప్ అనుకున్నంత మేర ఉండదు. రివ్యూలు మోడరేట్‌గా ఉంటాయి. ఓపెనింగ్స్ పర్వాలేదనిపిస్తాయి. కానీ తర్వాత సినిమా పుంజుకుంటుంది. వసూళ్లను పెంచుకుంటూ పోతుంది. లాంగ్ రన్‌తో ఆశ్చర్యపరుస్తాయి. బాలీవుడ్ మూవీ ‘దురంధర్’ ఈ దారిలోనే నడుస్తోంది. ఈ చిత్రానికి వసూళ్లు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తొలి వీకెండ్‌కు దీటుగా.. ఇంకా చెప్పాలంటే అంతకుమించి వసూళ్లు రాబడుతూ రోజు రోజుకూ స్ట్రాంగ్ అయిపోతోందీ సినిమా. 

శుక్రవారం నాడు రూ.34 కోట్లకు (కేవలం ఇండియా లో) పైగా వసూళ్లతో సెకండ్ ఫ్రైడే అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా ‘దురంధర్’ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. తర్వాతి రోజు కూడా ఈ చిత్రం ఇంకో రికార్డును ఖాతాలో వేసుకుంది. రెండో శనివారం అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. శనివారం ‘దురంధర్’ రూ.50 కోట్ల మార్కును దాటిపోయాయి. ఏకంగా రూ.53.70 కోట్లు కొల్లగొట్టిందీ చిత్రం. ‘పుష్ప-2’ రూ.46.50 కోట్లతో నెలకొల్పిన రికార్డును భారీ మార్జిన్‌తో బద్దలు కొట్టింది ‘దురంధర్’. 

శనివారం దేశవ్యాప్తంగా ఈ సినిమాకు హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఆదివారం అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మామూలుగా లేవు. ఈ రోజు కూడా ప్యాక్డ్ హౌస్‌‌లతో నడవనున్న ‘దురంధర్’.. సెకండ్ సండే హైయెస్ట్ గ్రాసర్ రికార్డును కూడా తన ఖాతాలో వేసుకునేలా ఉంది. ఈ చిత్రం ఇప్పటికే రూ.400 కోట్ల వసూళ్ల మార్కును దాటేయడం విశేషం. ఆదిత్య ధర్ స్వీయ నిర్మాణంలో రూపొందించిన ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా నటించాడు.

Related Post

Thiru Veer, Aishwarya Rajesh and Gangaa Entertainments Pan-India movie launchedThiru Veer, Aishwarya Rajesh and Gangaa Entertainments Pan-India movie launched

Thiru Veer has delivered a good success with The Great Pre Wedding Show. Now, he has joined hands with Gangaa Entertainments for their Pan-India film. Aishwarya Rajesh is playing the

ప్రశాంత్ కిశోర్ పార్టీ.. అభ్యర్దులతో షాక్ ఇచ్చాడుగా!ప్రశాంత్ కిశోర్ పార్టీ.. అభ్యర్దులతో షాక్ ఇచ్చాడుగా!

ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిశోర్ జన్ సూరాజ్ పార్టీనీ స్థాపించిన విషయం తెలిసిందే. అయితే బీహార్ ఎన్నికల కోసం తమ మొదటి అభ్యర్థుల లిస్ట్‌ను రిలీజ్ చేసి ఆశ్చర్యం కలిగించారు. ఎందుకంటే ఈ లిస్ట్‌లో మామూలు

ఈ దీపావళికి ఇదే పెద్ద సర్ప్రైజ్ఈ దీపావళికి ఇదే పెద్ద సర్ప్రైజ్

ఈ దీపావళికి మూడు రోజుల వ్యవధిలో నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. అన్ని సినిమాలూ ప్రామిసింగ్‌గా కనిపించడంతో గత దీపావళి లాగే ఈసారి కూడా 100 పర్సంట్ సక్సెస్ రేట్ చూస్తామా అన్న ఆశలు కలిగాయి. కానీ పండుగ రేసులో ముందుగా వచ్చిన ‘మిత్రమండలి’