hyderabadupdates.com movies దురంధర్ కుర్చీ మీద రాజాగారి కన్ను

దురంధర్ కుర్చీ మీద రాజాగారి కన్ను

బాక్సాఫీస్  వద్ద దురంధర్ సునామి పాతిక రోజులుగా ఏ స్థాయిలో సాగుతోందో చూస్తున్నాం. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి అల్ట్రా స్టార్స్ వల్ల కానీ రికార్డులను రణ్వీర్ సింగ్ అలవోకగా దాటేస్తున్నాడు. నిన్న ఆదివారం కూడా రెండున్నర లక్షలకు పైగా బుక్ మై షో టికెట్లు అమ్ముడు పోవడం మాములు విషయం కాదు.

1100 కోట్ల వసూళ్లను క్రాస్ చేసిన దురంధర్ సింగల్ లాంగ్వేజ్ లో ఇంత భారీ మొత్తం సాధించిన నెంబర్ వన్ మూవీగా సింహాసనాన్ని అధీష్టించింది. తొలుత తెలుగుతో పాటు ఇతర వర్షన్లు డబ్బింగ్ చేయాలనుకున్నారు కానీ తర్వాత ఆలోచన మానుకున్నారు. పార్ట్ 2 మాత్రం మల్టీ లాంగ్వేజెస్ లో వస్తుంది.

ఇదిలా ఉండగా దురంధర్ సెట్ చేసిన బెంచ్ మార్క్ ని బ్రేక్ చేయడం అంత సులభం కాదు కానీ ఆ ఛాన్స్ దగ్గరలో ఉన్న హీరోల్లో మొదటగా వినిపిస్తున్న పేరు ప్రభాస్. జనవరి 9 రాజా సాబ్ రిలీజ్ అవుతోంది. ఓపెనింగ్స్ కుమ్మేయడం ఖాయమే అయినా ఏ స్థాయి బ్లాక్ బస్టర్ అవుతుందనేది ఇప్పుడే చెప్పాలేం.

అయితే ఫిమేల్ ఓరియెంటెడ్ గా తీసిన స్త్రీ 2నే అయిదు వందల కోట్లు వసూలు చేసినప్పుడు ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అదే జానర్ లో సినిమా చేస్తే రికార్డులు బద్దలు కాక ఏమవుతాయి. ఎలాగూ సంక్రాంతికి బాలీవుడ్ లో చెప్పుకోదగ్గ రిలీజ్ లేదు. ఈ అవకాశాన్ని కనక డార్లింగ్ వాడుకుంటే ఆకాశమే హద్దుగా చెలరేగిపోవచ్చు.

సుమారు ఎనిమిది వందల కోట్ల గ్రాస్ బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బరిలో దిగుతున్న రాజా సాబ్ పండగకు అయిదు రోజుల ముందే వస్తుండటంతో పెద్ద నెంబర్లు నమోదు కాబోతున్నాయి. ఒకవేళ కాంపిటీషన్ కాకుండా సోలో వచ్చి ఉంటే కెజిఎఫ్, పుష్ప రేంజ్ లో హైప్ వచ్చేదని, ఇప్పుడు అరడజన్లు సినిమాలు రేస్ లో ఉండటంతో ఆడియన్స్ తమ టేస్ట్ ల ప్రకారం విడిపోతారు.

న్యూట్రల్ ఆడియన్స్ రివ్యూలు, పబ్లిక్ టాక్ మీద ఆధారపడతారు. అన్ని విభాగాల్లో కనక రాజా సాబ్ మెప్పించగలిగితే దురంధర్ కుర్చీని లాక్కోవడం ఈజీనే కానీ దానికున్న బలమైన మేకులు తీయాలంటే మాత్రం ఎక్స్ ట్రాడినరి కంటెంట్ ఉండాలి.

Related Post

Chiranjeevi’s “Meesala Pilla” Song from Mana Shankara Vara Prasad Garu Creates BuzzChiranjeevi’s “Meesala Pilla” Song from Mana Shankara Vara Prasad Garu Creates Buzz

The first single Meesala Pilla from Megastar Chiranjeevi’s upcoming family entertainer Mana Shankara Vara Prasad Garu is out now and already trending everywhere. The promo had created massive excitement, and

ఐఫోన్ పాకెట్… ధర ఎన్ని వేలో తెలుసా?ఐఫోన్ పాకెట్… ధర ఎన్ని వేలో తెలుసా?

మీ ఖరీదైన ఐఫోన్ కోసం యాపిల్ ఒక కొత్త ‘జేబు’ను రిలీజ్ చేసింది. దీని పేరు ‘ఐఫోన్ పాకెట్’. ఇది మామూలు జేబు కాదు, జపాన్‌కు చెందిన ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్ ‘ఇస్సే మియాకే’తో కలిసి తయారు చేయించింది. ‘ఒక గుడ్డ