hyderabadupdates.com movies దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో అంతగా అటాచ్ అయినట్టుగా కనిపించడం లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం తమన్ ని రంగంలోకి దించిన తర్వాత ఈ గ్యాప్ మరింత పెరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు దేవి రాలేదు. ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చి ఎలాంటి కబుర్లు పంచుకోలేదు. దర్శకుడు హరీష్ శంకర్ చెప్పినట్టు బిజీగా ఉండటం రీజన్ కావొచ్చు.

అయితే నిజమో కాదో నిర్ధారణ కాని ఇంకో విషయం కొంచెం విశ్లేషించుకోవాలి. మాములుగానే దేవిశ్రీ ప్రసాద్ పాత పాటలను రీమిక్స్ చేయడానికి పూర్తి వ్యతిరేకి. పలు సందర్భాల్లో దీన్ని చెప్పాడు కూడా. అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ వదులుకోవడానికి కారణం ఇదేనని చెన్నై వర్గాల్లో ప్రచారం జరిగింది. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ లో ఇలాంటివి బోలెడున్నాయి. దేవా కంపోజ్ చేసిన తొలిప్రేమలోని ఈ మనసే నా మనసే నేరుగా ఒరిజినల్ వెర్షన్ వాడేసుకున్నారు.

ఇది కాకుండా ఇళయరాజా స్వరపరిచిన రుద్రవీణలో తరలిరాదా తనే వసంతంకి బీట్స్ మిక్స్ చేసి ఫైట్ కోసం వాడుకున్నారు. నిజానికది స్ఫూర్తినిచ్చే హంటింగ్ మెలోడీ. సినిమా ప్రారంభంలో గుంటూరు కారం, ఆర్ఆర్ఆర్, గ్యాంగ్ లీడర్, ఠాగూర్ బిట్స్ కూడా వాడుకున్నారు. ఇవన్నీ తెలియడం వల్లే దేవీశ్రీ ప్రసాద్ డిస్ కనెక్ట్ అయ్యి ఉంటారని తెలిస్తే అంత ఈజీగా కొట్టి పారేయలేం. ఎందుకంటే ఈ మనసే స్థానంలో మరో మంచి పాట ఇమ్మంటే దేవి కాదని చెప్పడు కదా.

గమనించాల్సిన అంశం మరొకటి ఉంది. పుష్ప 2 సాంగ్స్ కంపోజ్ చేశాక బిజిఎం కోసం సామ్ సిఎస్ సహాయం తీసుకున్నా, నిన్న గుడ్ బ్యాడ్ అగ్లీని వదులుకున్నా, తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దేవి వేరొకరికి ఇచ్చేసినా ఇవన్నీ మైత్రి మూవీ మేకర్స్ సంస్థలోనే జరిగాయి. సరే ఇది ఇప్పటికిప్పుడు కాకపోయినా తర్వాతైనా బయట పడొచ్చు పడకపోవచ్చు కానీ ఎంతో కొంత వాస్తవం లేకపోలేదు. ఏది ఏమైనా దేవి మార్కు పూర్తిగా లేకపోవడం ఉస్తాద్ కు లోటే.

Related Post

Padayappa Re-Release Surprise: AR Rahman Releases 33-Track OST for Rajinikanth FansPadayappa Re-Release Surprise: AR Rahman Releases 33-Track OST for Rajinikanth Fans

Superstar Rajinikanth’s Padayappa is heading back to theatres 25 years after it first hit the screens, with the re-release slated for December 12, 2025 – the actor’s birthday. And before

దురంధర్ దర్శకుడిది భలే స్టోరీ గురుదురంధర్ దర్శకుడిది భలే స్టోరీ గురు

ఆదిత్య ధర్.. ఇప్పుడు బాలీవుడ్లోనే కాక, దేశవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీల్లోనూ చర్చనీయాంశం అవుతున్న పేరిది. బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్లలో ఒకటిగా నిలిచేలా కనిపిస్తున్న ‘దురంధర్’ సినిమాకు దర్శకుడే కాదు, నిర్మాత కూడా ఇతనే. దర్శకుడిగా రెండో సినిమానే అయినా.. ఫిలిం మేకింగ్‌లో

సీనియర్ స్టార్ల సంక్రాంతి… క్లాష్ సాధ్యమేనాసీనియర్ స్టార్ల సంక్రాంతి… క్లాష్ సాధ్యమేనా

పెళ్లి లేదు ప్రెగ్నెంటూ లేదు, కొడుకు పేరు కృష్ణమనోహర్ అనేది కొత్త సామెత. కొన్ని రిలీజ్ డేట్ల వ్యవహారం చూస్తుంటే అలాగే ఉంది. ప్రతి ఏడాది సంక్రాంతికి జరుగుతున్న వసూళ్ల జాతర పెద్ద దర్శక నిర్మాతలను అదే సీజన్ ని టార్గెట్