hyderabadupdates.com movies దేవి కోసమే తమన్‌‌ రాలేదట

దేవి కోసమే తమన్‌‌ రాలేదట

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ పాటలు అందిస్తే.. తమన్ నేపథ్య సంగీతం సమకూర్చాడు. ఐతే మొన్నటి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఈ ఇద్దరూ కనిపించలేదు. ప్రి రిలీజ్ ఈవెంట్లలో సాధారణంగా సంగీత దర్శకుల హడావుడే ఉంటుంది. కానీ ఈ ఈవెంట్లో మాత్రం సినిమాకు పని చేసిన ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లలో ఒక్కరూ కనిపించకపోవడం చర్చనీయాంశం అయింది.

సినిమా రిలీజ్‌కు తక్కువ టైం ఉండడం, ఆ టైంకి దేవి అందుబాటులో లేకపోవడం వల్ల తమన్‌తో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేయించుకున్నట్లుగా దర్శకుడు హరీష్ శంకర్‌తో పాటు నిర్మాతలు స్పష్టం చేశారు. కానీ దేవి ఈ విషయంలో హర్టయ్యాడేమో అన్న అనుమానాలున్నాయి. మరి తమన్ ఈ వేడుకకు ఎందుకు రాలేదన్నది ప్రశ్న. దీని గురించి హరీష్ శంకర్ స్పందించాడు. దేవి వేరే పని ఉండే ఈ వేడుకకు రాలేదని చెప్పిన హరీష్.. తమన్ రాకపోవడం గురించి వివరణ ఇచ్చాడు.

ప్రి రిలీజ్ ఈవెంట్‌కు దేవి రావట్లేదు, నువ్వైనా రా అని తమన్‌ను పిలిస్తే.. ‘‘ఈ సినిమాకు సంగీత దర్శకుడు దేవి. నేను పని చేసేది నేపథ్య సంగీతం కోసం మాత్రమే. కాబట్టి నేను వెనకే ఉంటా. ఎందుకు స్టేజ్‌పైకి రావాలని పిలుస్తున్నావు. పైగా ఈ నెల 26కు అనుకున్న సినిమాను 19నే తీసుకు వస్తున్నావు. నాకు మ్యూజిక్ చేయడానికే టైం లేదు. ఇక ఈవెంట్‌కు ఎలా రాగలను’’ అని తమన్ అన్నట్లు హరీష్ వెల్లడించాడు. ఈ మాటలతో తమన్ సంస్కారం ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదిగింది అనిపించిందని.. అతడి నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని హరీష్ పేర్కొన్నాడు.

మరోవైపు తమన్ నేపథ్య సంగీతం కలిసిన తర్వాత ఫైనల్ ఔట్ పుట్ చూసుకుని హరీష్.. ఎంతో ఎగ్జైట్మెంట్‌తో ఎక్స్‌లో ఒక పోస్టు కూడా పెట్టాడు. ‘‘బావా తమన్.. ఇప్పుడే ఓవర్సీస్ కాపీ ఫైనల్ సౌండ్ చెక్ చేశా. రేయ్ బావా.. జీవితాంతం రుణపడిపోయా. ఇంత పూనకంతో కొట్టేశావేంట్రా. లవ్యూ’’ అంటూ హరీష్ బోలెడన్ని దండం పెట్టే ఎమోజీలు కూడా జోడించాడు పోస్టులో. అతనిచ్చిన హైప్‌కి పవన్ ఫ్యాన్స్ రిలీజ్‌కు ముందే పూనకాలు తెచ్చేసుకుంటున్నారు.

Related Post

మెగా అభిమానులు… ఉక్కిరి బిక్కిరేమెగా అభిమానులు… ఉక్కిరి బిక్కిరే

మెగా అభిమానులు కొన్నేళ్ల నుంచి అంత సంతృప్తిగా లేరు. చిరు నుంచి ‘భోళా శంకర్’ లాంటి భారీ డిజాస్టర్ వచ్చింది. రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ ఎలాంటి ఫలితాన్నిందుకుందో తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘బ్రో’తో నిరాశపరిచి.. ‘హరి హర

Like Father, Like Son! Pranav Mohanlal Joins His Dad in the 50-Crore Hattrick ClubLike Father, Like Son! Pranav Mohanlal Joins His Dad in the 50-Crore Hattrick Club

Mollywood celebrates a proud father-son moment as superstar Mohanlal and his son Pranav Mohanlal now share a rare record — both have delivered a hat-trick of ₹50 crore grossers. The