hyderabadupdates.com movies దేశం నుంచి ప‌రారైన అమెరికా మాజీ అధ్య‌క్షుడి పుత్ర‌ర‌త్నం!

దేశం నుంచి ప‌రారైన అమెరికా మాజీ అధ్య‌క్షుడి పుత్ర‌ర‌త్నం!

అప్పులు.. వివాదాలు.. అక్ర‌మ తుపాకులు.. డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం.. ప‌న్నుల ఎగ‌వేత‌- ఇవీ ఇత‌మిత్థంగా అమెరికా మాజీ అధ్య‌క్షు డు జోబైడెన్ పుత్ర‌ర‌త్నం హంట‌ర్ బైడెన్ ప్ర‌త్యేక‌త‌లు. దీంతో కేసులు ముసురుకున్నాయి. ఇంకేముంది.. చెప్పాపెట్ట‌కుండా రాత్రికి రాత్రి దేశం వ‌దిలి వెళ్లిపోయారు. అయితే.. ఆయ‌న ఎప్పుడు దేశం వ‌దిలి వెళ్లారు.. ఎక్క‌డికి వెళ్లారు?  ఏ దేశంలో త‌ల‌దాచుకుంటున్నార‌న్న వివ‌రాలు అమెరికా ప్ర‌భుత్వానికే తెలియ‌లేదు. తాజాగా ఈయ‌న‌కు సంబంధించిన కేసు విచార‌ణ సంద‌ర్భంగా.. ఆయ‌న త‌ర‌ఫు లాయ‌ర్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

ఈ క్ర‌మంలో లాయ‌ర్ చేసిన ఆస‌క్తిక‌ర వ్యాఖ్య కోర్టును సైతం విస్మ‌యానికి గురి చేశాయి. “హంట‌ర్ బైడెన్ అనేక అప్పులు చేశారు. వారికి ఇవ్వ‌లేదు. కానీ.. నా ఫీజు సంగ‌తేంటి?  నాకు 50 వేల డాల‌ర్ల వ‌ర‌కు ఫీజులు చెల్లించాలి. అవి కూడా ఇవ్వ‌లేదు. నేను ఏం చేయాలో నాకు తెలియ‌డం లేదు“ అని న్యాయ‌వాది అన‌గా.. మీరు కూడా కేసు పెట్టండి(యూ ఫైల్ ఏ పిటిష‌న్‌) అని న్యాయ‌మూర్తి సూచించారు. ఇక‌, హంట‌ర్ బైడెన్‌పై ప‌లు కేసులు ఇప్ప‌టికే న‌మోదు కాగా.. ఆయ‌న తండ్రి జో బైడె్న్ హ‌యాంలో అక్రమ ఆయుధాల కేసులను అధ్య‌క్ష హోదాతో ర‌ద్దు చేశారు.

56 ఏళ్ల హంట‌ర్‌.. వృత్తి రీత్యా న్యాయవాది. త‌ర్వాత‌.. ఆయ‌న స్నేహితుల‌తో క‌లిసి వ్యాపారవేత్తగా ఎదిగారు. హంటర్ బైడెన్ 2013లో చైనా సంస్థ బీహెచ్ ఆర్‌తో క‌లిసి కూడా వ్యాపారాలు చేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న అప్పుల పాల‌య్యార‌న్న చ‌ర్చ ఉంది. ఆ తర్వాత ఉక్రెయిన్‌లోని అతిపెద్ద ప్రైవేట్ సహజ వాయువు ఉత్పత్తిదారులలో ఒకటైన బురిస్మా హోల్డింగ్స్ బోర్డులో  పనిచేశారు. అతను లాబీయింగ్ సంస్థలకు లాబీయిస్ట్‌గా, న్యాయ ప్రతినిధిగా, వెంచర్ క్యాపిటల్, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ ఇన్వెస్టర్‌గా వ్య‌వ‌హారించారు.

ఎంత ఎగ్గొట్టారంటే..

భార‌త క‌రెన్సీలో హంట‌ర్ బైడెన్‌.. దాదాపు 158 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఎగ్గొట్టిన‌ట్టు అధికారులు కేసు న‌మోదు చేశారు. ఇది అమెరికా క‌రెన్సీలో 170 ల‌క్ష‌ల డాల‌ర్లుగా ఉంటుంది. డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా ముఠాల‌తోనూ.. హంట‌ర్‌కు ప్ర‌త్య‌క్ష సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా తుపాకుల‌ను అక్ర‌మంగా నిల్వ చేయ‌డం.. వినియోగించ‌డం వంటి కేసులు కూడా ఉన్నాయి.

అయితే..ఈ రెండు కేసుల‌ను కూడా జో బైడెన్ అధ్య‌క్షుడిగా ఉన్న చివ‌రి రోజుల్లో త‌న విచ‌క్ష‌ణ‌, ప్ర‌త్యేక అధికారాల‌ను వినియోగించి కొట్టివేశారు. వాస్త‌వానికి 2024లో కోర్టు ఈ రెండు అంశాల్లోనూ హంట‌ర్‌ను దోషిగా నిర్ధారించింది. శిక్ష ఖ‌రారు చేయాల్సిన స‌మ‌యంలో అధ్య‌క్షుడిగా ఉన్న బైడెన్ జోక్యం చేసుకుని.. వాటిని ర‌ద్దు చేశారు. కాగా.. ఇప్పుడు దేశం విడిచి పారిపోవ‌డంతో అమెరికా ఆయ‌న‌ను `వాంటెడ్ లిస్టు`లో పెట్ట‌డం గ‌మ‌నార్హం.

Related Post

Vijay Deverakonda as Ranabaali: A Powerful Pre Story to the Revolutionary taleVijay Deverakonda as Ranabaali: A Powerful Pre Story to the Revolutionary tale

Rowdy Vijay Deverakonda and director Rahul Sankrityan, previously collaborated for blockbuster Taxiwaala and now bringing a revolutionary tale VD14. The film titled Ranabaali is releasing in theatres on September 11th,

“Akhanda 2 Will Shake the Screens”: Balakrishna’s Powerful Speech at Grand Pre-Release Event“Akhanda 2 Will Shake the Screens”: Balakrishna’s Powerful Speech at Grand Pre-Release Event

The pre-release event of the highly awaited divine action spectacle Akhanda 2: Tandavam turned into a massive celebration as “God of Masses” Nandamuri Balakrishna, director Boyapati Sreenu, the cast, and