hyderabadupdates.com movies దేశాభివృద్ధికి ఏపీ కీలకం: మోదీ

దేశాభివృద్ధికి ఏపీ కీలకం: మోదీ

దేశవ్యాప్తంగా 28 శాతం జీఎస్టీ ఉన్న చాలా వస్తువులు, సేవలను ఇప్పుడు 18 శాతం జీఎస్టీ లేదా 5 శాతం జీఎస్టీకే ప్రజలంతా పొందుతున్న సంగతి తెలిసిందే. ఇకపై, కేవలం జీఎస్టీలో రెండు శ్లాబులు మాత్రమే ఉండేలా, ముఖ్యమంగా పేద, మధ్య తరగతి ప్రజలకు భారీ ఊరట కలిగేలా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.ఈ క్రమంలోనే జీఎస్టీ తగ్గింపుతో దసరా, దీపావళి సందర్భంగా ప్రజలకు సూపర్ సేవింగ్స్ లభించాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ పేరుతో కర్నూలులో బహిరంగ సభ ఏర్పాటు చేసింది.

ఈ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నిర్మించిన,నిర్మించబోతున్న రూ.13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులకు మోదీ వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఆ తర్వాత సభలో ప్రసంగించిన మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాభివృద్ధిలో ఏపీ అభివృద్ధి ఎంతో కీలకమని, ఏపీ అభివృద్ధికి రాయలసీమ అభివృద్ధి ఎంతో కీలకం అని మోదీ అన్నారు. ఈ ప్రాజెక్టులతో సీమ డెవలప్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆత్మగౌరవం, సంస్కృతికి నిలయంగా, సైన్స్, ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని కొనియాడారు. ఏపీలో ఎన్నో అవకాశాలున్నాయని, వాటిని అందిపుచ్చుకునే యువతకు అపార శక్తి ఉందని అన్నారు. ఈ రోజు శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆశీస్సులు పొందానని చెప్పారు.

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ల రూపంలో ఏపీకి శక్తిమంతమైన నాయకత్వం ఉందని కితాబిచ్చారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఉంటుందని భరోసానిచ్చారు. డబుల్ ఇంజన్ సర్కారు వల్ల 16 నెలలుగా ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. ఓ వైపు ఢిల్లీ, మరోవైపు అమరావతి అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధిస్తామని, 21వ శతాబ్దం..140 కోట్ల మంది భారతీయుల శతాబ్దం అని అన్నారు.

Related Post

Dhurandhar: The Revenge Upcoming Movie 2026 – Cast, Release Date, and MoreDhurandhar: The Revenge Upcoming Movie 2026 – Cast, Release Date, and More

Minutes to read: 5 min In 2026, several highly anticipated movies will release that have been carrying audience anticipation for around a year or more. However, a film that landed

Dhurandhar: Makers asked to remove THIS crucial word in the filmDhurandhar: Makers asked to remove THIS crucial word in the film

In a significant development, the Ministry of Information and Broadcasting has asked the makers of Dhurandhar to remove the word Baloch from the film. Following the directive, the Ranveer Singh–starrer

రైరైరారా… డాన్స్ అదరగొట్టేశాడు కదరారైరైరారా… డాన్స్ అదరగొట్టేశాడు కదరా

ఉదయం నుంచి ఎప్పుడెప్పుడా అని తెగ వెయిటింగ్ లో పెట్టిన పెద్ది సెకండ్ సింగల్ వచ్చేసింది. నిజానికి సాయంత్రం ఏడు గంటలకు విడుదల చేస్తామని దర్శకుడు బుచ్చిబాబు రామ్ చరణ్ కు హామీ ఇచ్చినప్పటికీ మూడు గంటలు ఆలస్యంగా పదికి రిలీజ్