hyderabadupdates.com movies ధనుష్ అంత పెద్ద మాట తప్పాడా

ధనుష్ అంత పెద్ద మాట తప్పాడా

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మీద నిర్మాణ సంస్థ తేనాండాళ్ ఫిలిమ్స్ 20 కోట్ల పరిహారాన్ని డిమాండ్ చేస్తూ కేసు వేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 2016లో ఈయన స్వీయ దర్శకత్వంలో నాన్ రుద్రన్ అనే సినిమా తీయడానికి సదరు ప్రొడక్షన్ హౌస్ ధనుష్ తో ఒప్పందం చేసుకుంది.

కానీ కాలం గడిచిపోతున్నా ప్రాజెక్టు పట్టాలు ఎక్కలేదు. తర్వాత వేరే దర్శకుడికి ఈ బాధ్యతను అప్పగిద్దామనుకుంటే ధనుష్ ఆ స్క్రిప్ట్ ని ఇవ్వకుండా మరింత కాలాయాపన చేశాడు. దీంతో ఇప్పటిదాకా జరిగిన ఆలస్యానికి నష్టపరిహారంగా అంత పెద్ద మొత్తాన్ని డిమాండ్ చేయడం సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది.

తమ సినిమాని పక్కనపెట్టి ధనుష్ వరసగా వేరే సినిమాలు చేస్తున్నాడని తేనాండాళ్ అధినేతలు ఆరోపిస్తున్నారు. దీని తర్వాతే ధనుష్ తన డైరెక్షన్ లో రాయన్, జాబిలమ్మ నీకు అంత కోపమా, ఇడ్లి కొట్టు తీశారు. రెండోది తప్ప మిగిలిన వాటిలో ఆయనే హీరో.

కమర్షియల్ గా బాగానే వర్కౌట్ చేసుకున్నాయి. మరి నాన్ రుద్రన్ ని ఎందుకు పక్కన పెట్టారనేది సస్పెన్స్ గా మారింది. ప్రస్తుతం ధనుష్ తన 55వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సాయిపల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తుండగా మమ్ముట్టి ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రస్తుతానికి ధనుష్ టీమ్ వైపు నుంచి ఈ కాంట్రవర్సి పట్ల స్పందన లేదు. లీగల్ గా అన్ని కోణాలు విశేషించుకున్నాకే రెస్పాన్డ్ అయ్యే అవకాశముంది. అప్పుడప్పుడు ధనుష్ ఇలాంటి వాటిలో చిక్కుకోవడం పరిపాటిగా మారింది.

ఆ మధ్య నయనతారతో కాపీ రైట్స్ విషయంలో జరిగిన రాద్ధాంతం గుర్తుండే ఉంటుంది. అంతకు ముందు వ్యక్తిగత జీవితంలో విడాకులు తీసుకోవడం హైలైట్ అయ్యింది. ఇళయరాజా బయోపిక్ ప్రకటించి దాన్ని పెండింగ్ లో ఉంచడం ఇప్పటికే మ్యూజిక్ లవర్స్ లో బోలెడు డౌట్లను తీసుకొచ్చింది. ఇదంతా ఎలా ఉన్నా ముందు తేనాండాళ్ ఆరోపణలు ధనుష్ ఎలా ఎదురుకుంటారో చూడాలి. 

Related Post

Varanasi trailer creates waves—Rajamouli gives a big shout-out to his teamVaranasi trailer creates waves—Rajamouli gives a big shout-out to his team

The trailer of SS Rajamouli and Mahesh Babu’s Varanasi, introducing the film’s world and theme, blew away the minds of not just fans but audiences across the globe. Western audiences

బాలయ్యని కవ్విస్తున్న రణ్వీర్ సింగ్బాలయ్యని కవ్విస్తున్న రణ్వీర్ సింగ్

డిసెంబర్ 5 విడుదల కాబోతున్న అఖండ 2 తాండవం కోసం నార్త్ లో ప్రత్యేకంగా ప్రమోషన్లు చేస్తున్న సంగతి తెలిసిందే. పబ్లిసిటీ బోణీనే ముంబై నుంచి మొదలుపెట్టి తెలుగు మీడియా సైతం చూడని కొన్ని విజువల్స్ ని అక్కడి ప్రతినిధులకు ప్రత్యేకంగా