ఇంకో అయిదు రోజుల్లో ధనుష్ కర విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగులో సమాంతరంగా రిలీజ్ చేస్తున్నా ఇక్కడ ప్రమోషన్ల విషయంలో చూపిస్తున్న అలసత్వం ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపించేలా ఉంది. రేపో ఎల్లుండో ధనుష్ వచ్చి ఈవెంట్ చేసినా ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేందుకు అది సరిపోదు. ఇంకేదో సౌండ్ చేయాలి. ఇడ్లి కొట్టు, రాయన్ లాంటివి మన దగ్గర దారుణంగా ఫెయిలవ్వడంతో ఇక్కడ మార్కెట్ ధనుష్ లైట్ తీసుకున్నారేమో బహుశా.సరే బజ్ సంగతి పక్కనపెడితే కరలో మన స్టువర్ట్ పురం ఛాయలు ఉన్నాయని ఇన్ సైడ్ టాక్. ఒకప్పుడు సంయుక్త ఆంధ్రప్రదేశ్ లో దొంగల ఊరిగా బాగా ప్రసిద్ధి చెందిన గ్రామం ఇది. ఈ ఊరి మీద యండమూరి వీరేంద్రనాథ్ ఒక నవల రాస్తే ఆయన దర్శకత్వంలోనే చిరంజీవి స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ లో నటించారు. అది డిజాస్టరయ్యింది. అదే టైంలో స్టువర్ట్ పురం దొంగలు అనే మరో భాను చందర్ మూవీ కమర్షియల్ గా సక్సెస్ కొట్టింది. ఇది 1991 నాటి ముచ్చట.రవితేజ టైగర్ నాగేశ్వరరావు బ్యాక్ డ్రాప్ కూడా దీని ఆధారంగా తీసుకున్నదే. అయితే ఇది పీరియాడిక్ బయోపిక్. కరలో మెయిన్ పాయింట్ స్టువర్ట్ పురం నేపధ్యానికి దగ్గరగా ఉంటుందని, దొంగతనాలకు అలవాటు పడిన ఒక యువకుడి జీవితం సామజిక, రాజకీయ పరిస్థితుల వల్ల ఎలాంటి మలుపులు తీసుకుందనే పాయింట్ మీద దీన్ని రూపొందించారట. ఏప్రిల్ 30 రావాల్సిన పెద్ది తప్పుకోవడంతో కరకు ఇతర రాష్ట్రాల్లో బెనిఫిట్ కానుంది.ఫలితం మీద ధనుష్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మన దగ్గరే కాదు తమిళనాడులోనూ బాక్సాఫీస్ డల్ గా ఉంది. జనవరిలో జన నాయకుడు వాయిదా పడ్డాక అంత ఊపు ఇచ్చే సినిమాలు పెద్దగా రాలేదు. రాధికా తాయ్ కిళవి లాంటివి కొంత ఊరట కలిగించాయి కానీ లేదంటే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. ఇప్పుడు కర కనక సక్సెస్ అయితే థియేటర్లకు ఆక్సిజన్ దొరుకుతుందని బయ్యర్లు ఆశపడుతున్నారు. తమిళ నేటివిటీ నిండిన కరని మనోళ్లు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
ధనుష్ ‘కర’లో స్టువర్టుపురం ఛాయలు
April 26, 2026April 26, 2026|
Ai Generated Article, credits to ogrinal websiteAi Generated Article, credits to ogrinal website|
0 Comment|
12:09 am
Categories:
Related Post
అమరావతిలో బాబుతో బిల్ గేట్స్ భేటీ, కారణమేంటి?అమరావతిలో బాబుతో బిల్ గేట్స్ భేటీ, కారణమేంటి?
February 17, 2026February 17, 2026|
Ai Generated Article, credits to ogrinal websiteAi Generated Article, credits to ogrinal website|
0 Comment|
12:05 am
27 ఏళ్ల క్రితం మైక్రోసాఫ్ట్ అధినేత, గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ తో హైదరాబాద్ లో సీఎం చంద్రబాబు భేటీ అయిన సందర్భం తెలుగు వారందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ ఒక్క మీటింగ్ ఏపీ, తెలంగాణలోని వేలాది మంది యువత
చిరుతో రెహమాన్… మూడోసారి మిస్సవ్వదా?చిరుతో రెహమాన్… మూడోసారి మిస్సవ్వదా?
January 7, 2026January 7, 2026|
Ai Generated Article, credits to ogrinal websiteAi Generated Article, credits to ogrinal website|
0 Comment|
12:09 am
మూవీ లవర్స్ పాతికేళ్ల క్రితమే కోరుకున్న కాంబినేషన్ మెగాస్టార్ చిరంజీవి సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం. కానీ రెండుసార్లు ఆ అవకాశం మిస్ అయ్యింది. 1999లో చిరు మొదటి బాలీవుడ్ మూవీ ‘రిటర్న్ అఫ్ ది థీఫ్ అఫ్ బాగ్దాద్’కు
Marc Anthony Breaks Silence on Brooklyn Beckham Versus Family: ‘It’s Hardly The Truth’Marc Anthony Breaks Silence on Brooklyn Beckham Versus Family: ‘It’s Hardly The Truth’
February 11, 2026February 11, 2026|
Ai Generated Article, credits to ogrinal websiteAi Generated Article, credits to ogrinal website|
0 Comment|
4:55 am
The Beckham family feud has become a spectacle. Following whispers of an alleged rift, things spiralled as Brooklyn went on a 6-page rant against his family, and especially his parents,