hyderabadupdates.com Gallery న‌టి ప్ర‌త్యూష కేసులో సుప్రీం సంచ‌ల‌న తీర్పు

న‌టి ప్ర‌త్యూష కేసులో సుప్రీం సంచ‌ల‌న తీర్పు

న‌టి ప్ర‌త్యూష కేసులో సుప్రీం సంచ‌ల‌న తీర్పు post thumbnail image

న్యూఢిల్లీ : న్యాయం గెలిచింది. స‌త్యం బ‌తికే ఉంద‌ని తేలి పోయింది. ఒక‌టా రెండా ఏకంగా 24 ఏళ్ల తర్వాత సంచ‌ల‌నం సృష్టించిన న‌టి ప్ర‌త్యూష కేసుకు సంబంధించి సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది భార‌తదేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు. ఇదిలా ఉండ‌గా సినీ నటి ప్రత్యూష కేసులో ప్రధాన నిందితుడైన సిద్ధార్థ్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కొన్నిఏళ్లుగా కొనసాగుతున్న ఈ కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం తుది తీర్పును వెలువరించింది. 2002 ఫిబ్రవరి 23న తన ప్రియుడు సిద్ధార్థ రెడ్డితో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేయగా ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
ఈ ఘటనలో సిద్ధార్థ రెడ్డి కొద్ది రోజులకు కోలుకుని ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అయితే సిద్ధార్థ రెడ్డి వల్లే తన కూతురు మరణించిందంటూ ప్రత్యూష తల్లి సరోజిని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు . ఈ కేసులో సెషన్స్ కోర్టు ఆయనకు ఐదేళ్లు జైలు శిక్ష విధించగా.. హైకోర్టు దాన్ని రెండేళ్లకు కుదించింది. హైకోర్టును తీర్పును సవాల్ చేస్తూ ప్రత్యూష తల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. సిద్ధార్డ్ రెడ్డి కూడా దానికి కౌంటర్ పిటిషన్ వేశారు. ఈ కేసుకు సంబంధించి వాదోపవాదాలు పరిశీలించిన న్యాయస్థానం గతేడాది నవంబర్ లో తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా తీర్పును వెలువరిస్తూ సిద్ధార్డ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. త‌ను నాలుగు వారాల్లోగా పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది.
The post న‌టి ప్ర‌త్యూష కేసులో సుప్రీం సంచ‌ల‌న తీర్పు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ధ‌వ‌ళేశ్వ‌రం బ్యారేజ్ గేట్లు మార్చేందుకు రూ. 150 కోట్లుధ‌వ‌ళేశ్వ‌రం బ్యారేజ్ గేట్లు మార్చేందుకు రూ. 150 కోట్లు

అమ‌రావ‌తి : రాష్ట్రంలో నీటి పారుద‌ల ప్రాజెక్టుల‌పై కూట‌మి స‌ర్కార్ ఫుల్ ఫోక‌స్ పెట్టింద‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర భారీ నీటి పారుద‌ల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు. శ‌నివారం శాస‌న స‌భ‌లో ఎమ్మెల్యేలు అడిగిన ప‌లు ప్ర‌శ్నల‌కు స‌మాధానం ఇచ్చారు.

Manchu Vishnu: మోహన్‌ బాబు యూనివర్సిటీ జరిమానాపై ప్రకటన విడుదల చేసిన మంచు విష్ణుManchu Vishnu: మోహన్‌ బాబు యూనివర్సిటీ జరిమానాపై ప్రకటన విడుదల చేసిన మంచు విష్ణు

    విద్యార్థుల నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేయడం, ఆదాయాన్ని వెల్లడించకపోవడం, విద్యార్థుల హాజరు నిర్వహణలో అవకతవకలు, ఒరిజినల్‌ సర్టిఫికెట్లను నిలిపివేయడంపై మోహన్‌బాబు ప్రైవేటు విశ్వవిద్యాలయానికి ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ రూ.15 లక్షల జరిమానా విధించిన సంగతి

Digital Arrest: ఎమ్మెల్యే భార్య డిజిటల్ అరెస్ట్ చేసిన సైబర్ నేరగాళ్ళుDigital Arrest: ఎమ్మెల్యే భార్య డిజిటల్ అరెస్ట్ చేసిన సైబర్ నేరగాళ్ళు

    డిజిటల్ అరెస్టు పేరుతో పలువురిని సైబర్ క్రిమినల్స్ ఇటీవల మోసం చేస్తున్నారు. సైబర్ నేరస్తుల బారిన పడి బాధితులు పెద్దమొత్తంలో నష్టపోతున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ భార్యను సైతం డిజిటల్ అరెస్ట్