hyderabadupdates.com movies నవంబర్ మీదే వీళ్లందరి ఆశలు

నవంబర్ మీదే వీళ్లందరి ఆశలు

కొత్త నెల వచ్చేసింది. సెప్టెంబర్, అక్టోబర్ లో చెప్పుకోదగ్గ విజయాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడింది. ఇదే జోరు సంక్రాంతి దాకా ఉంటుందనే నమ్మకంతో బయ్యర్లు తమ వ్యాపారం కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు సిద్ధం చేసుకున్నారు. వచ్చే నాలుగు వారాల్లో రాబోయే సినిమాల్లో స్టార్ హీరోలు నటించినవి లేవు కానీ కంటెంట్, జానర్ పరంగా ఆసక్తి రేపేవి చాలానే ఉన్నాయి. పట్టువదలని విక్రమార్కుడిలా హిట్టు కోసం ప్రయత్నిస్తూనే ఉన్న సుధీర్ బాబు ఈసారి ‘జటాధరా’ రూపంలో నవంబర్ 7వ తేదీ ఫాంటసీ సబ్జెక్టుతో వస్తున్నాడు. బడ్జెట్ పరంగా భారీగా ఖర్చు పెట్టిన ఈ మూవీలో సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటించింది.

రష్మిక మందన్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ అదే రోజు రానుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ లవ్ థ్రిల్లర్ లో ఊహించని సర్ప్రైజులు చాలా ఉంటాయని టీమ్ ఊరిస్తోంది. తమ్మ ఫ్లాప్ చేసిన గాయం దీంతో మాయమవుతుందని రష్మిక ఎదురు చూస్తోంది. ప్రతిభ ఎంత ఉన్నప్పటికీ సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న తిరువీర్ నటించిన ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ అదే రోజు అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అటుపై వారం దుల్కర్ సల్మాన్ ‘కాంత’ నవంబర్ 14 వచ్చేస్తుంది. నిర్మాత రానా దీని కోసం ప్రత్యేకంగా పబ్లిసిటీ ప్లాన్ చేస్తున్నాడు. చాందిని చౌదరి ‘సంతాన ప్రాప్తిరస్తు’ అదే రోజు థియేటర్లలో అడుగు పెట్టనుంది.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే నవంబర్ చివర్లో వచ్చే రామ్ ‘ఆంధ్రకింగ్ తాలూకా’ మరో లెక్క. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ భారీ ఎంటర్ టైనర్ లో ఉపేంద్ర టైటిల్ రోల్ పోషించగా తనకు రామ్ కు మధ్య వచ్చే ఎపిసోడ్స్ ఇప్పటిదాకా తెలుగు తెరపై రాలేదనే రేంజ్ లో ఉంటాయని ఇన్ సైడ్ టాక్. అయితే నెక్స్ట్ వీకే అఖండ 2 తాండవం ఉంటుంది కాబట్టి ఒక రోజు ముందే రిలీజయ్యే ఆలోచనలో ఆంధ్రకింగ్ తాలూకా ఉందట. ఇక్కడ చెప్పినవి నవంబర్ లో రాబోయే ముఖ్యమైన సినిమాల గురించే. జనాల దృష్టిలో పడాల్సిన చిన్న చిత్రాలు, డబ్బింగ్ సినిమాల లిస్టు పెద్దదే ఉంది. చూడాలి ఎవరెవరు ఏమేం చేయబోతున్నారో.

Related Post

Sunny Sanskari Ki Tulsi Kumari (SSKTK): When Love Quest Turns Into A Dilemma!Sunny Sanskari Ki Tulsi Kumari (SSKTK): When Love Quest Turns Into A Dilemma!

Does love sometimes lead to heartbreak? What if that heartbreak brings you to the true love of your life? The Bollywood big screens now dazzle with a romantic-comical tale of

“Mowgli 2025’s First Single ‘Sayyare’ Promises Pure Magical Romance”“Mowgli 2025’s First Single ‘Sayyare’ Promises Pure Magical Romance”

Young actor Roshan Kanakala, who won hearts with his debut film Bubblegum, is back with his second movie Mowgli 2025, directed by National Award-winning filmmaker Sandeep Raj of Colour Photo