hyderabadupdates.com movies నవంబర్ 24 – కంటెంట్ ఉన్నోళ్లే విజేతలు

నవంబర్ 24 – కంటెంట్ ఉన్నోళ్లే విజేతలు

ఈ వారం బాక్సాఫీస్ పోటీ ఆసక్తికరంగా ఉంది. స్టార్లు లేకపోయినా సరే కంటెంట్ల మధ్య యుద్ధం ప్రేక్షకులను వీటి వైపు చూసేలా ప్రేరేపిస్తోంది. అల్లరి నరేష్ మొదటిసారి క్రైమ్ థ్రిల్లర్ చేసిన ’12 ఏ రైల్వే కాలనీ’ మీద క్రమంగా అంచనాలు పెరుగుతున్నాయి. కామెడీని పక్కన పెట్టి వివిధ జానర్లు ట్రై చేస్తున్న అల్లరోడు ఈసారి పొలిమేర దర్శకుడు డాక్టర్ అనిల్ విశ్వనాథ్ కథతో డైరెక్టర్ గా నాని కాసరగడ్డకు మొదటి అవకాశం ఇచ్చాడు. ట్రైలర్ ఇంటరెస్టింగ్ గానే అనిపించింది. కమర్షియల్ హంగామా లేకుండా కుర్చీకి కట్టిపడేసే స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తామని టీమ్ హామీ ఇస్తోంది. హీరోయిన్ గా కామాక్షి భాస్కర్ల నటించింది.

ప్రియదర్శి, ఆనంది జంటగా నటించిన ‘ప్రేమంటే’ వెరైటీ ప్రమోషన్లతో అటెన్షన్ తీసుకుంటోంది. యాంకర్ సుమ పోలీస్ ఆఫీసర్ గా నటించడాన్ని బాగా హైలైట్ చేస్తున్నారు. దర్శకుడిగా నవనీత్ శ్రీరామ్ కు ఇది డెబ్యూ మూవీ. ఏషియన్ సంస్థ అండదండలు ఉండటంతో డిస్ట్రిబ్యూషన్ పరంగా ఇబ్బందులు లేవు. మిత్ర మండలితో షాక్ తిన్న ప్రియదర్శి ఈసారి ఎలాంటి అతిశయోక్తి స్టేట్ మెంట్లు ఇవ్వలేదు. దాదాపు అందరూ కొత్త వాళ్లతో తీసిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ మీద సోషల్ మీడియా దృష్టి పడింది. క్లైమాక్స్ లీక్ వార్తలు రావడం, టైటిల్ సాంగ్ హిట్ కావడంతో యూత్ ఓపెనింగ్స్ వచ్చేలా ఉన్నాయి. సాయిల కంపతి దర్శకుడు.

యాక్షన్ కింగ్ అర్జున్, ఐశ్వర్య రాజేష్ నటించిన ‘మఫ్టీ పోలీస్’ కూడా వీటితో పాటు బరిలో దిగుతోంది. దర్శకుడు దినేష్ లక్ష్మణన్. డబ్బింగ్ మూవీనే అయినప్పటికీ షాకింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని టీమ్ చెబుతోంది. చిరంజీవి 1990 క్లాసిక్ ‘కొదమసింహం’ని భారీ ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు. ట్రైలర్ క్వాలిటీ చూశాక శివ స్థాయిలో స్పందన ఉంటుందని మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. వీటితో పాటు బాలీవుడ్ మూవీ ‘120 బహద్దూర్’ మీద పాజిటివ్ బజ్ ఉంది. సో ఎవరైతే కంటెంట్ తో జనాన్ని మెప్పిస్తారో వాళ్లే విజేతలుగా నిలుస్తారు. గత శుక్రవారం రిలీజైనవి ఆల్రెడీ ఫైనల్ రన్ కు దగ్గర కావడంతో మంచి ఛాన్సే ఉంది.

Related Post

చెత్త‌-స‌త్తా.. తేల్చుకుందాం: కేటీఆర్‌చెత్త‌-స‌త్తా.. తేల్చుకుందాం: కేటీఆర్‌

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్‌కు మ‌రో ఐదు రోజుల స‌మ‌య‌మే ఉన్న నేప‌థ్యంలో ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య రాజ‌కీయ వేడి మ‌రింత పెరిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇంటింటి ప్ర‌చారం, ప్ర‌సంగాలు చేసుకున్న నాయ‌కులు.. తాజాగా ప్ర‌జ‌ల‌ను మ‌రింత‌గా త‌మ‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నంలో