hyderabadupdates.com movies నాతో నాకే పోటీ అంటున్న అఖండ విలన్

నాతో నాకే పోటీ అంటున్న అఖండ విలన్

ఆది పినిశెట్టి.. అచ్చమైన తెలుగు కుర్రాడు. కానీ నటుడిగా అతడికి తమిళంలోనే ఫస్ట్ బ్రేక్ వచ్చింది. అక్కడే ఎక్కువ సినిమాలు చేశాడు. లెజెండరీ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి తనయుడైన ఆది.. పుట్టి పెరిగింది చెన్నైలోనే. తమిళంలో హీరోగా పలు చిత్రాలు చేసి విజయాలూ అందుకున్న ఆది.. తెలుగులో అప్పుడప్పుడూ నటిస్తున్నాడు. ఇక్కడ ఎక్కువగా అతను విలన్ పాత్రలే చేశాడు.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో గతంలో ‘సరైనోడు’ చేసి మంచి పేరు సంపాదించిన ఆది.. ఇప్పుడు ‘అఖండ-2’ లాంటి భారీ చిత్రంలో బాలయ్యకు విలన్‌గా నటించడం విశేషం. ఈ సినిమా అతడికి ఇంకా ఎక్కువ పేరు తెస్తుందని అంచనా వేస్తున్నారు. విశేషం ఏంటంటే.. ‘అఖండ-2’ రిలీజయ్యే రోజే ఆది హీరోగా నటించిన సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ చిత్రమే.. డ్రైవ్.

‘అఖండ-2’ డిసెంబరు 5న వస్తుందన్న అంచనాతో 12న అనేక చిన్న సినిమాలను షెడ్యూల్ చేసుకున్నారు నిర్మాతలు. కానీ ‘అఖండ-2’ అనూహ్యంగా వాయిదా పడి 12కు షిఫ్ట్ అయింది. దీంతో ఆ రోజు రావాల్సిన పలు చిత్రాలను వాయిదా వేశారు. కానీ మోగ్లీ, అన్నగారు వస్తారు చిత్రాలతో పాటు ‘డ్రైవ్’ కూడా 12కే ఫిక్స్ అయింది.

డ్రైవ్ కొన్నేళ్ల ముందు మొదలైన సినిమా. షూట్ ఎప్పుడో పూర్తయినా రిలీజ్ బాగా ఆలస్యం అయింది. భవ్య క్రియేషన్స్ బేనర్ మీద ఆనంద్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేసిన ఈ చిత్రాన్ని జెనూస్ మహమ్మద్ రూపొందించాడు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ సినిమా రిలీజ్ కానుంది. ఐతే లాంగ్ డిలేయ్డ్ మూవీ కావడం, పెద్దగా పబ్లిసిటీ చేయకపోవడంతో ఈ సినిమాకు బజ్ క్రియేట్ కాలేదు. మరి రిలీజ్ తర్వాత టాక్ బాగుంటే సినిమా పుంజుకుంటుందేమో చూడాలి. ఇటు విలన్‌గా, అటు హీరోగా ఒకే రోజు బాక్సాఫీస్ పరీక్షకు సిద్ధమవుతున్న ఆదికి ఎలాంటి ఫలితం వస్తుందో?

Related Post

G20లో మోదీ: ప్రపంచానికి 4 ఐడియాలు!G20లో మోదీ: ప్రపంచానికి 4 ఐడియాలు!

జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న G20 సమ్మిట్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. కేవలం చర్చలతో సరిపెట్టకుండా, ప్రపంచవ్యాప్త అభివృద్ధి కోసం నాలుగు కీలకమైన ప్రతిపాదనలను తెరపైకి తెచ్చారు. భారతీయ విలువలే ప్రపంచ ప్రగతికి బాటలు

యుద్ధం అంత నిడివి ఉంటే చూస్తారాయుద్ధం అంత నిడివి ఉంటే చూస్తారా

రేపు బాలీవుడ్ మల్టీస్టారర్ బోర్డర్ 2 విడుదల కానుంది. 1997లో వచ్చిన ఆల్ టైం బ్లాక్ బస్టర్ కొనసాగింపుగా రూపొందిన ఈ వార్ డ్రామా ఏకంగా 3 గంటల 20 నిమిషాల నిడివి ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకన్నా ఎక్కువ లెన్త్