అమరావతి : దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సు ముగిసింది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. భారీ ఎత్తున కంపెనీలు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వచ్చాయి. ఇదేక్రమంలో వరల్డ్ లోనే టాప్ కంపెనీగా పేరు పొందింది బ్లాక్ స్టోన్. సదరు కంపెనీ సీఈవో, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు నారా లోకేష్. బ్లాక్ స్టోన్ పెట్టుబడి పెట్టిందంటే, ఆ రాష్ట్రం వ్యాపారానికి అనుకూలమని ప్రపంచ దేశాలకు సంకేతం వెళ్తుంది. ప్రపంచ ఆర్థిక వేదిక దావోస్ సదస్సులో జనవరి 22న మంత్రి నారా లోకేష్ ప్రపంచపు అతిపెద్ద ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ బ్లాక్ స్టోన్ ఛైర్మన్ స్టీఫెన్ ఎ. స్క్వార్జ్‌మాన్‌తో జరిపిన భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు 100 లక్షల కోట్ల రూపాయల (మనదేశ ఏడాది బడ్జెట్ 50 లక్షల కోట్లు) కంటే ఎక్కువ విలువైన ఆస్తులను ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తోంది. బ్లాక్ స్టోన్ వంటి దిగ్గజ సంస్థ ఒక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం అంటే ఆ ప్రాంతపు ఆర్థిక ముఖచిత్రం పూర్తిగా మారి పోయే అవకాశం ఉంది.
ఇప్పటికే భారతదేశంలోని ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో భారీ డేటా సెంటర్లు, ఐటీ పార్కులు . మాల్స్‌లో బిలియన్ల కొద్దీ డాలర్లను ఇన్వెస్ట్ చేసింది బ్లాక్ స్టోన్ కంపెనీ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వైపు మళ్ళించేందుకు మంత్రి లోకేష్ పక్కా వ్యూహంతో అడుగులు వేశారు. ఈ సమావేశంలో భాగంగా విశాఖపట్నంలో ‘గ్రేడ్-ఏ’ ఆఫీస్ స్పేస్‌లు, ఇంటిగ్రేటెడ్ మిక్స్‌డ్ యూజ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులు, హైపర్‌స్కేల్ డేటా సెంటర్ల ఏర్పాటుపై ప్రత్యేకంగా చర్చించారు. విశాఖకు ఉన్న తీరప్రాంత కనెక్టివిటీ, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ , స్కేలబుల్ విద్యుత్ లభ్యతను ప్రధానంగా ప్రస్తావించారు. చెన్నై-బెంగళూరు (CBIC), విశాఖ-చెన్నై (VCIC) ఇండస్ట్రియల్ కారిడార్ల వెంబడి లాజిస్టిక్ పార్కులను అభివృద్ధి చేయాలని కోరారు.
The post నారా లోకేష్ ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ కు ఆలంబన appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
నారా లోకేష్ ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ కు ఆలంబన
Categories: