hyderabadupdates.com Gallery నా వ‌ల్లే రూ. 30 వేల కోట్ల స్కాం బ‌య‌ట ప‌డింది

నా వ‌ల్లే రూ. 30 వేల కోట్ల స్కాం బ‌య‌ట ప‌డింది

నా వ‌ల్లే రూ. 30 వేల కోట్ల స్కాం బ‌య‌ట ప‌డింది post thumbnail image

హైద‌రాబాద్ : రాష్ట్ర రోడ్లు భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఓ ఛాన‌ల్ తో చిట్ చాట్ చేశారు. ఈ సంద‌ర్బంగా సింగ‌రేణి టెండ‌ర్ వ్య‌వ‌హారం గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. త‌న వ‌ల్ల‌నే నైనీ బ్లాక్ టెండ‌ర్ ర‌ద్దు అయ్యింద‌న్నారు. దీని వ‌ల్ల రాష్ట్ర ప్ర‌భుత్వానికి రూ. 30,000 కోట్లు న‌ష్టం లేకుండా మేలు చేశాన‌ని చెప్పారు. ఒక న్యూస్ ఛాన‌ల్ త‌న‌ను డ్యామేజ్ చేస్తూ ఓ క‌థ‌నం ప్ర‌సారం చేసింద‌న్నారు. ఇంకో ఛాన‌ల్ , పేప‌ర్ ఇంకొక‌టి వేసింద‌న్నారు. దీని వెనుక పెద్ద క‌థ ఉంద‌న్నారు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. త‌న వ‌ల్లే లాభం జ‌రిగినప్పుడు, త‌న‌ను ఎవ‌రూ బ్లేమ్ చేయ‌లేర‌న్నారు. త‌న‌కు ఏమీ కాద‌న్నారు. కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి అంటే ప్ర‌జ‌ల‌కు బాగా తెలుస‌న్నారు. త‌న మ‌న‌సులో ఏమీ పెట్టుకోన‌ని చెప్పారు.
అస‌లు స్కాం జ‌ర‌గ‌లేదంటూ నిన్న‌టి దాకా ప్ర‌జ‌ల‌ను న‌మ్మించే ప్ర‌య‌త్నం చేస్తూ వ‌చ్చారు రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, సీఎం ఎ. రేవంత్ రెడ్డిలు. కానీ తాజాగా కోమ‌టిరెడ్డి చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఈ ఇద్ద‌రూ అస‌లు కుంభ‌కోణం జ‌ర‌గ‌లేద‌ని చెప్ప‌డం విడ్డూరంగా ఉంది. ఈ ఇద్ద‌రికీ వ్య‌తిరేకంగా ఇప్పుడు మంత్రి మాట్లాడటం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఎలాంటి స్కాం జ‌ర‌గ‌లేద‌ని, నైనీ బ్లాక్ టెండ‌ర్ ను ర‌ద్దు చేశామ‌న్నారు భ‌ట్్టి. ఇదంతా విష ప్ర‌చారం అంటూ మండిప‌డ్డారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ స్కాంపై పెద్ద ఎత్తున అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.
The post నా వ‌ల్లే రూ. 30 వేల కోట్ల స్కాం బ‌య‌ట ప‌డింది appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తాం : స‌వితబీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తాం : స‌విత

విజయవాడ : ఉన్నత ఉద్యోగాల్లో బీసీ బిడ్డలు స్థిరపడి, పాలనలో కీలక భూమిక పోషించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. అందుకోసమే సివిల్ సర్వీసెస్, డీఎస్సీ, ఇతర పోటీ పరీక్షలకు

అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా ఏపీఅతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా ఏపీ

అమరావతి : ఏపీని అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా మార్చే కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్ప‌ష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18 లక్షల మంది రైతులు, 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ముందుకు