hyderabadupdates.com movies నితిన్… ఇదీ వదిలేశాడా?

నితిన్… ఇదీ వదిలేశాడా?

ఒకప్పుడు వరుసగా డజనుకు పైగా ఫ్లాపులు ఎదుర్కొని ఇండస్ట్రీ నుంచి అంతర్ధానం అయిపోయే పరిస్థితుల్లో ‘ఇష్క్’ మూవీతో ఊపిరి పీల్చుకున్నాడు నితిన్.  ఆ తర్వాత అతను జాగ్రత్తగానే అడుగులు వేశాడు. గుండె జారి గల్లంతయ్యిందే, అఆ, భీష్మ లాంటి విజయాలతో తన కెరీర్ బాగానే సాగింది. కానీ ఆపై మళ్లీ కథ మొదటికి వచ్చేసింది. 

‘భీష్మ’ వచ్చి ఐదేళ్లు దాటిపోగా.. తర్వాత ఒక్కటంటే ఒక్క సక్సెస్ లేదు నితిన్‌కు. ఆల్రెడీ ఫ్లాప్ స్ట్రీక్ అరడజనుకు చేరుకుంది. ఓటీటీలో రిలీజై పెద్దగా ఆకట్టుకోని ‘మేస్ట్రో’ను కూడా కలిపితే లెక్క ఏడుకు చేరుతుంది. ఏడాది వ్యవధిలో రాబిన్ హుడ్, తమ్ముడు రూపంలో రెండు భారీ డిజాస్టర్లను ఖాతాలో వేసుకున్నాడు నితిన్. దీంతో ‘తమ్ముడు’ రిలీజ్ కాగానే పట్టాలెక్కాల్సిన ‘యల్లమ్మ’ అతడి చేజారింది. 

ఆ తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘ఇష్క్’ తర్వాత ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ చిత్రాన్ని సొంత బేనర్లో నితినే ప్రొడ్యూస్ చేసుకుంటాడని కూడా వార్తలు వచ్చాయి. కానీ తీరా చూస్తే.. ఈ సినిమా కూడా క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. ‘ఇష్క్’ కాంబినేషన్లో రెండో సినిమా వచ్చే అవకాశం లేదట. మరి సమస్య నితిన్ దగ్గర ఉందా.. విక్రమ్ దగ్గరా అన్నది తెలియదు కానీ.. వీళ్లిద్దరూ కలిసి సినిమా చేయట్లేదట. 

విజయ్ దేవరకొండతో తన కొత్త చిత్రం చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడట విక్రమ్. యువి క్రియేషన్స్ బేనర్లో ఈ సినిమా తెరకెక్కనుందట. రాహుల్ సంకృత్యన్ సినిమా, రౌడీ జనార్దన్ అయ్యాక విజయ్.. ఈ చిత్రంలో నటిస్తాడట. మరి నితిన్‌కు చెప్పిన కథనే విజయ్ దగ్గరికి తీసుకెళ్లాడా.. ఇది వేరే స్టోరీనా అన్నది క్లారిటీ లేదు. మరి విక్రమ్‌తో కూడా సినిమా లేదంటే.. నితిన్ తన కొత్త చిత్రాన్ని ఎవరితో చేయబోతున్నట్లు? వరుస ఫ్లాపుల నేపథ్యంలో అతనేమైనా బ్రేక్ తీసుకోవాలని భావిస్తున్నాడా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Related Post

6 Malayalam Films Expected to Release for Summer 2026: Mohanlal’s Drishyam 3 to Mammootty’s Patriot6 Malayalam Films Expected to Release for Summer 2026: Mohanlal’s Drishyam 3 to Mammootty’s Patriot

Cast: Mammootty, Mohanlal, Fahadh Faasil, Nayanthara, Kunchacko Boban, Darshana Rajendran, Revathi Director: Mahesh Narayanan Genre: Spy Action Drama Patriot, starring Mammootty in the lead, is expected to release for Vishu

K-Ramp Trailer: Kiran Abbavaram brings absolute laugh riot with a crazy plotK-Ramp Trailer: Kiran Abbavaram brings absolute laugh riot with a crazy plot

Kiran Abbavaram’s KRamp under Hasya Movies and Rudransh Celluloids is going to be an absolute laugh riot and the recently released trailer proves that. The trailer launched at a grand