hyderabadupdates.com Gallery నిబంధనల ఉల్లంఘనలే ప్రమాదానికి కారణం

నిబంధనల ఉల్లంఘనలే ప్రమాదానికి కారణం

నిబంధనల ఉల్లంఘనలే ప్రమాదానికి కారణం post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. యాజమాన్యాలు భద్రతాపరమైన నిబంధనలు పాటించక పోవడమే వేట్లపాలెం బాణసంచా తయారీ యూనిట్లోపేలుడు ప్రమాదానికి కారణమని చెప్పారు. జాతరలు, పండుగలు ఉండడంతో పరిమితికి మించి కూలీలను పనికి పెట్టుకున్నారని తెలిపారు. 8 మంది పని చేసేందుకు అనుమతి ఉన్న ప్రదేశంలో 31 మంది చేత పని చేయిస్తుండడం దారుణమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిబంధనలు మరింత కఠినతరం చేస్తామని చెప్పారు. కాకినాడ జీజీహెచ్ లో వేట్లపాలెం పేలుడు ఘటన మృతుల కుటుంబాలు, క్షతగాత్రులను పరామర్శించారు. ఘటన వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో క్షతగాత్రులకు అందుతున్న వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీడియాతో మాట్లాడారు.
సామర్లకోట మండలం, వేట్లపాలెం వద్ద బాణసంచా తయారీ యూనిట్ లో జరిగిన ప్రమాదంలో 20 మంది మృతి చెందగా, 9 మంది గాయపడ్డారు. ఇది అత్యంత విషాదకరమైన సంఘటన అని పేర్కొన్నారు. అనుమతులు తీసుకున్న మేరకు యాజమాన్యాలు నిబంధనలు పాటించడం లేదన్నారు. ఇలాంటి సంఘటనలకు యాజమాన్యాలే బాధ్యత వహించాలని స్ప‌ష్టం చేశారు. సీఎంతో నిబంధనలు మరింత కఠినతరం చేయడంపై చర్చించామ‌న్నారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున పరిహారం అందజేస్తున్నాం అని తెలిపారు. క్షతగాత్రులకు చికిత్సకయ్యే పూర్తి ఖర్చుల ప్రభుత్వమే భరిస్తుంద‌ని భ‌రోసా ఇచ్చారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.
The post నిబంధనల ఉల్లంఘనలే ప్రమాదానికి కారణం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

CM Chandrababu: డేటా ఆధారిత పాలనసై సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశంCM Chandrababu: డేటా ఆధారిత పాలనసై సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం

  డేటా డ్రైవెన్‌ గవర్నెన్స్‌పై సీఎం చంద్రబాబు నాయుడు గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలు పాల్గొనగా… జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… దీర్ఘకాలిక, మధ్యకాలిక,

అంబ‌టి రాంబాబు బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌లు చెప్పాలిఅంబ‌టి రాంబాబు బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి

అనంత‌పురం జిల్లా : రాజకీయ విమర్శల పేరుతో హద్దులు దాటితే, అంబటి రాంబాబుకు చట్టపరమైన గట్టి సమాధానం తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సింగ‌న‌మ‌ల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ.అంబటి రాంబాబు వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల‌ని, బహిరంగ

గోదావ‌రి పుష్క‌రాలు ఘ‌నంగా నిర్వహించాలిగోదావ‌రి పుష్క‌రాలు ఘ‌నంగా నిర్వహించాలి

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టికే ప్ర‌భుత్వం సాంస్కృతిక‌, ప‌ర్యాట‌క రంగానికి ప్ర‌యారిటీ ఇస్తోంద‌ని చెప్పారు. ఆధ్యాత్మ‌కత ఉట్టి ప‌డేలా ఆల‌యాల‌ను కూడా స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చిదిద్దుతున్న‌ట్లు తెలిపారు. ఇదిలా ఉండ‌గా తాజాగా