hyderabadupdates.com Gallery నిమ్మ‌ల ప‌నితీరు భేష్ అన్న చంద్ర‌బాబు నాయుడు

నిమ్మ‌ల ప‌నితీరు భేష్ అన్న చంద్ర‌బాబు నాయుడు

నిమ్మ‌ల ప‌నితీరు భేష్ అన్న చంద్ర‌బాబు నాయుడు post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీలో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఈసారి నీటి పారుద‌ల శాఖ ఆధ్వ‌ర్యంలో నీటి త‌రలింపు శ‌ర‌వేగంగా జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు రాష్ట్ర నీటి భారీ నీటి పారుద‌ల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడును ప్ర‌త్యేకంగా అభినందించారు. హంద్రీ-నీవా ప్రాజెక్టు ద్వారా సీమ జిల్లాలకు నీటి తరలింపులో ఏపీ నీటి పారుద‌ల శాఖ సరికొత్త రికార్డు సృష్టించ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. ఇదిలా ఉండ‌గా ప్రాజెక్ట్ డిజైన్ కెపాసిటీని మించి తొలిసారి నీటిని డ్రా చేసిన హంద్రీ-నీవా ప్రాజెక్ట్. హంద్రీ-నీవా ప్రాజెక్టు నుంచి కేవలం 190 రోజుల్లోనే 40.109 టీఎంసీల మేర నీటిని కాల్వలకు మళ్లించింది. రాయలసీమ జిల్లాలకు చెందిన రిజర్వాయర్లు, చెరువులకు మళ్లించారు.
2014-19 మధ్య కాలంలో టీడీపీ హయాంలోనే 1 పంపు నుంచి 6 పంపుల ద్వారా నీటిని డ్రా చేసేలా సామర్థ్యం పెంచారు. మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చాక 12 పంపుల ద్వారా నీటిని తోడేందుకు సామర్థ్యాన్ని పెంచేలా పనులు చేప‌ట్టారు. 12 పంపుల ఏర్పాటుతో పాటు వంద రోజుల్లో కాల్వల వెడల్పు పనులను రికార్డు స్థాయిలో పూర్తి చేసింది ప్ర‌భుత్వం. హంద్రీ-నీవా విస్తరణ పనులను త్వరితగతిన చేపట్టి… సీమ ప్రాంతానికి నీళ్లందించేలా కృషి చేసిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాస్. ప్రాజెక్ట్ డిజైన్ కెపాసిటీని మించి 40.109 టీఎంసీల నీటిని డ్రా చేసి రికార్డ్ సృష్టించామన్నారు.
హంద్రీ-నీవా ప్రాజెక్టును పూర్తి స్థాయిలో సద్వినియోగం అయ్యేలా ప్రణాళికతో సీఎం వ్యవహరించారన్నారు మంత్రి పయ్యావుల. సీఎంతో పాటు హంద్రీ-నీవా పనులకు సహకరించిన ఇరిగేషన్ మంత్రి నిమ్మలకు ధన్యవాదాలు తెలిపారు సీమ మంత్రులు. ఇదిలా ఉండ‌గా రాయలసీమ ప్రాంతంలోని అన్ని రిజర్వాయర్లను, చెరువులను నీటితో నింపాలని ఆదేశించారు నారా చంద్ర‌బాబు నాయుడు.
The post నిమ్మ‌ల ప‌నితీరు భేష్ అన్న చంద్ర‌బాబు నాయుడు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Minister Satya Kumar Yadav: ఏలూరు ఎలుకల దాడి ఘటనపై మంత్రి సీరియస్Minister Satya Kumar Yadav: ఏలూరు ఎలుకల దాడి ఘటనపై మంత్రి సీరియస్

    ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులను ఎలుక కరిచిన ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనకు బాధ్యులైన హాస్టల్ వార్డెన్, నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ప్రైవేట్

CM Chandrababu: సీఐఐ సదస్సుకు విశాఖ చేరుకున్న సీఎం చంద్రబాబుCM Chandrababu: సీఐఐ సదస్సుకు విశాఖ చేరుకున్న సీఎం చంద్రబాబు

    ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖ వేదికగా జరగనున్న సీఐఐ సమ్మిట్ లో పాల్గొనడానికి ఏపీ సీఎం చంద్రబాబు విశాఖ చేరుకున్నారు. వాయుమార్గం ద్వారా విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాష్ట్ర ముఖ్య‌మంత్రికి స్థానిక నేత‌లు మరియు