hyderabadupdates.com Gallery నీటి ప్రాజెక్టుల‌ను యుద్ధ ప్రాతిప‌దిక‌న పూర్తి చేయాలి

నీటి ప్రాజెక్టుల‌ను యుద్ధ ప్రాతిప‌దిక‌న పూర్తి చేయాలి

నీటి ప్రాజెక్టుల‌ను యుద్ధ ప్రాతిప‌దిక‌న పూర్తి చేయాలి post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో సాగు నీటి ప్రాజెక్టుల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని ఆదేశించారు. నిర్ల‌క్ష్యం వ‌హిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వంటూ హెచ్చ‌రించారు. బుధ‌వారం రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పోలవరం, వెలిగొండ, హంద్రీనీవా సుజల స్రవంతి, పోలవరం-నలమల్ల సాగర్ లింక్, చింతలపూడి ఎత్తిపోతల, వరికపూడిశెల, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పనులపై ఆరా తీశారు. రాష్ట్రంలో భూగర్భజలాల పెంపు, జల ధార, జల హారతి కార్యక్రమాల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1, 2 పనులను వచ్చే ఏడాది మార్చి లోగా పూర్తి చేయాలని ఆదేశించారు చంద్రబాబు నాయుడు.
ట్విన్ టన్నెల్స్ లైనింగ్ పనులు 77 , అప్రోచ్ చానల్ ఎర్త్ వర్క్ పనులు 98 శాతం, హెడ్ రెగ్యులేటర్ కాంక్రీట్ పనులు 71 శాతం, ఇరిగేషన్ టన్నెల్ లైనింగ్ 76 శాతం పూర్తైనట్టు తెలిపారు అధికారులు. కేఎల్ బండ్ ఎర్త్ వర్క్, ఎంబార్క్‌మెంట్ పనులు ఈ ఏడాది జూన్ కల్లా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఆర్ అండ్ ఆర్‌ కి సంబంధించి 49 కాలనీలు ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి, మరో 20 కాలనీలు 2027 ఏప్రిల్ కల్లా పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు. మొదటి దశలో మొత్తం 38,060 నిర్వాసిత కుటుంబాలకు, ఇప్పటి వరకు 16,763 కుటుంబాల తరలించ‌డం జ‌రిగింద‌న్నారు. ఈ ఏడాది ఆగస్ట్ నాటికి 8,518 కుటుంబాలు, 2027 ఏప్రిల్‌కు 12,779 కుటుంబాలు తరలించాలని సూచించారు సీఎం. ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.27,089 కోట్లు వ్యయం అయినట్టు వెల్లడించారు. మరో రూ.5,108 కోట్లతో సివిల్, ఆర్ అండ్ ఆర్ పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
The post నీటి ప్రాజెక్టుల‌ను యుద్ధ ప్రాతిప‌దిక‌న పూర్తి చేయాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఒలెక్ట్రా గ్రీన్ టెక్ సంస్థ అరుదైన రికార్డ్ఒలెక్ట్రా గ్రీన్ టెక్ సంస్థ అరుదైన రికార్డ్

హైద‌రాబాద్ : ప్ర‌ముఖ విద్యుత్ బ‌స్సుల త‌యారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీ అరుదైన రికార్డును న‌మోదు చేసింది. ఈ ఏడాది ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించి 3వ త్రైమాసికంలో ఏకంగా 385 ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను త‌యారు చేసింది. వాటిని డెలివ‌రీ

రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారిందిరాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారింది

హైద‌రాబాద్ : మాజీ మంత్రి హ‌రీశ్ రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రం పిచోడి చేతిలో రాయిలాగా అయి పోయింద‌న్నారు. ఇది భూసేకర కాద‌ని, దళిత బలహీన వర్గాల మీద రేవంత్ రెడ్డి చేస్తున్న దండయాత్ర అని మండిప‌డ్డారు. మంగ‌ళ‌వారం ప‌రిగి

హామీల అమ‌లులో రేవంత్ స‌ర్కార్ ఫెయిల్హామీల అమ‌లులో రేవంత్ స‌ర్కార్ ఫెయిల్

హైద‌రాబాద్ : ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌లేక కొత్త దుకాణం మొద‌లు పెట్టారంటూ కాంగ్రెస్ స‌ర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. కోతల సమయం వచ్చినా ఈ సీజన్ ఇప్పటి వరకు రైతు భరోసా దిక్కు