hyderabadupdates.com Gallery నీటి భద్రత కోసం జలధార యాక్షన్ ప్లాన్

నీటి భద్రత కోసం జలధార యాక్షన్ ప్లాన్

నీటి భద్రత కోసం జలధార యాక్షన్ ప్లాన్ post thumbnail image

అమరావతి : పోలవరం ప్రాజెక్టు పూర్తి కాగానే గోదావరి జలాలను కుడి, ఎడమ కాలువల ద్వారా తరలించి వాటిని ఏయే అవసరాలకు, ఎంత మేర వినియోగించు కోవాలనే దానిపై ఓ నిర్దుష్టమైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కుడి, ఎడమ ప్రధాన కాలువలకు అనుసంధానంగా ఉన్న రిజర్వాయర్లు, చెరువులు నింపేలా ప్రణాళిక చేయాలని సీఎం సూచించారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై క్యాంపు కార్యాలయంలో జల వనరుల శాఖ అధికారులతో బుధవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు పనులతో పాటు…వెలిగొండ, హంద్రీనీవా సుజల స్రవంతి, పోలవరం- నల్లమల సాగర్ లింక్, చింతలపూడి ఎత్తిపోతల పథకం, వరికెపూడిశిల, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్రంలో భూగర్భ జలాల పెంపు, జల ధార, జల హారతి కార్యక్రమాలపైనా సమీక్షించారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులైన తారక రామ, మహేంద్ర తనయ, తోటపల్లి బ్యారేజ్, మద్దువలస, జంఝావతి, హీరమండలం లిఫ్ట్ పనుల్లో వేగం పెంచాలని సీఎం సూచించారు. డిసెంబర్ నాటికి వంశధార-నాగావళి అనుసంధానం, జూలై నాటికి నాగావళి-చంపావతి అనుసంధానం పూర్తి చేయాలన్నారు. శ్రీకాకుళం జిల్లా వంశధార నదిపై నిర్మించ తలపెట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నేరడి బ్యారేజ్‌కు అడ్డంకులు తొలగడంతో త్వరితగతిన టెండర్లు పిలవాలని స్పష్టం చేశారు. వెలిగొండ స్టేజ్ 1కు సంబంధించి హెడ్ రెగ్యులేటర్ కాంక్రీట్ పనులు 74 శాతం, టన్నెల్ 2 బెంచింగ్ 94 శాతం, లైనింగ్ 66 శాతం, ఫీడర్ కెనాల్ రిటైనింగ్ వాల్ కాంక్రీట్ 84 శాతం, లైనింగ్ 8 శాతం పూర్తయ్యాయని తెలిపారు.
The post నీటి భద్రత కోసం జలధార యాక్షన్ ప్లాన్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Deepak Reddy: జూబ్లీహిల్స్‌ బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్‌ రెడ్డిDeepak Reddy: జూబ్లీహిల్స్‌ బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్‌ రెడ్డి

Deepak Reddy : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి విషయంలో ఉత్కంఠ వీడింది. లంకల దీపక్‌ రెడ్డిని తమ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. ఊహించిన విధంగా దీపక్‌ రెడ్డి వైపే… బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది. తాజాగా బుధవారం దీపక్‌

Chirag Paswan: బిహార్‌ లో ఎన్డీయేకు తప్పని చిరాగ్ చికాకు ?Chirag Paswan: బిహార్‌ లో ఎన్డీయేకు తప్పని చిరాగ్ చికాకు ?

Chirag Paswan : బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలతో ప్రస్తుతం అన్ని పార్టీలు సీట్ల పంపకాలపై దృష్టి సారించాయి. అధికార ఎన్డీయే, విపక్ష ఇండియా కూటమి పక్షాలు తమ భాగస్వామ్య పార్టీలతో పొత్తులను తేల్చుకునే చర్చలను ముమ్మరం చేశాయి. ఎన్డీయే

జ‌ర్న‌లిస్టుల అరెస్ట్ అక్ర‌మం : హ‌రీశ్ రావుజ‌ర్న‌లిస్టుల అరెస్ట్ అక్ర‌మం : హ‌రీశ్ రావు

హైద‌రాబాద్ : సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ స‌జ్జ‌నార్ పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఎన్టీవీతో పాటు ఇత‌ర ఛాన‌ల్స్ లో వ‌చ్చిన క‌థ‌నాల‌పై స్పందించిన స‌ర్కార్ సిట్ ను ఏర్పాటు చేయ‌డాన్ని త‌ప్పు