hyderabadupdates.com movies నెత్తురుకు మరిగిన వెట్రి ‘సామ్రాజ్యం’

నెత్తురుకు మరిగిన వెట్రి ‘సామ్రాజ్యం’

సామజిక సమస్యలను తీసుకుని వయొలెన్స్ జోడించి చాలా సీరియస్ సినిమాలు తీస్తారని పేరున్న దర్శకుడు వెట్రిమారన్ త్వరలో అరసన్ తో రాబోతున్నారు. తెలుగులో సామ్రాజ్యం పేరుతో డబ్బింగ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ ద్వారా టీజర్ లాంచ్ జరిగింది. పేరుకి ప్రోమో అన్నారు కానీ ఏకంగా 5 నిమిషాలకు పైగా వీడియోతో కంటెంట్ గురించి క్లారిటీ ఇచ్చారు. వెట్రిమారన్ బెస్ట్ వర్క్స్ లో ఒకటిగా చెప్పుకునే వడ చెన్నై యునివర్స్ లో భాగంగా దీన్ని తీస్తున్న క్రమంలో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ధనుష్ క్యామియో ఉంటుందనే ప్రచారం కోలీవుడ్ వర్గాల్లో బలంగా ఉంది.

కథేంటో వీడియోలో చెప్పలేదు కానీ కాన్సెప్ట్ వివరించారు. ఒక పల్లెటూరి యువకుడు. పైకి అమాయకంగా ఉన్నా లోలోపల అగ్ని పర్వతం మోస్తూ ఉంటాడు. ఓ రాత్రి ఊళ్ళో ఓ ముగ్గురిని దారుణంగా కత్తులతో నరికి చంపేసి, సైకిల్ మీదెళ్ళి కొళాయి దగ్గర శుభ్రంగా స్నానం చేసే టైపు. ఎన్ని హత్యలు చేసినా ఇతగాడు పోలీసులకు చిక్కడు. ఓసారి దొరికిపోతాడు. కోర్టులో జడ్జ్ అడిగితే నాకేం తెలియదంటూ బుకాయిస్తాడు. మాసిన చొక్కా, పంచెకట్టుతో ఉండే ఇతని వెనుక అంత దారుణమైన నేపథ్యం ఎందుకుంది, నరమేథం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనేది తెరమీద చూడాలి.

ఈసారి వెట్రిమారన్ కు అనిరుద్ రవిచందర్ తోడవ్వడంతో సన్నివేశాలలో డెప్త్ పెరిగిపోయింది. విడుదల పార్ట్ 1 2, అసురన్, విసరనై తరహా ట్రీట్ మెంట్ సామ్రాజ్యంలో కనిపిస్తున్నప్పటికీ ఇప్పటిదాకా శింబుని ఎవరూ చూపించినంత డార్క్ క్యారెక్టర్ లో వెట్రిమారన్ ప్రెజెంట్ చేయబోతున్న  వైనం స్పష్టమవుతోంది. మూవ్ లవర్స్ వెట్రి నుంచి కోరుకుంటున్నది ఇలాంటి బ్లాస్ట్ లే. విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు కానీ వచ్చే ఏడాది వేసవిలో రావొచ్చని ఒక అంచనా. క్యాస్టింగ్ గురించి వివరాలు బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్న వెట్రిమారన్ బృందం ఈసారి తెరమీద రక్తపాతం చిందించడం ఖాయం.

Related Post

పజిల్ ప్రశ్న – వీళ్ళిద్దరికే ఎలా సాధ్యమవుతోందిపజిల్ ప్రశ్న – వీళ్ళిద్దరికే ఎలా సాధ్యమవుతోంది

ఇద్దరు పెద్ద స్టార్లు కలిసి నటించాలంటే దాని వెనుక ఎన్నో లెక్కలు, ఈగోలు, బాలన్సులు, బడ్జెట్ లు ఉంటాయి. రాజమౌళి కాబట్టి ఆర్ఆర్ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ని కలిపాడు కానీ లేదంటే ఈ కాంబో వేరే దర్శకుడికి