hyderabadupdates.com movies నేహా శెట్టి పాట ప్లస్సయ్యిందా లేదా

నేహా శెట్టి పాట ప్లస్సయ్యిందా లేదా

ఎడిటింగ్ లో తీసేసిన ఓజి ఐటెం సాంగ్ ని ఇటీవలే జోడించిన సంగతి తెలిసిందే. నేహా శెట్టి మీద బ్యాంకాక్ లో షూట్ చేసిన ఈ ప్రత్యేక గీతం వల్ల పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. ప్రీ క్లైమాక్స్ కు ముందు పవన్ కళ్యాణ్ గాయపడితే ఇమ్రాన్ హష్మీ వచ్చే టైంలో దర్శకుడు సుజిత్ దీనికి ప్లేస్ మెంట్ ఇచ్చాడు. అయితే సీరియస్ గా జరుగుతున్న నెరేషన్ లో ఇది అడ్డం వస్తుందని భావించి ఫస్ట్ వెర్షన్ లో తీసేశారు. డీజే టిల్లు భామ ఆడిపాడినా ఎందుకు ఇంపాక్ట్ లేదంటే అందులో పవన్ కళ్యాణ్ డాన్స్ చేయడం లాంటివేవీ లేవు కాబట్టి. తమన్ కూడా మిగిలిన సాంగ్స్ రేంజ్ లో దీన్ని కంపోజ్ చేయలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఏతావాతా చెప్పేదేంటంటే నేహా శెట్టి పాట వల్ల కలిగిన ప్రయోజనం పెద్దగా లేదు. అందుకే తను కూడా ఒకచోట తప్ప ఎక్కడా ఓజి గురించి చెప్పడం కానీ, పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ పంచుకున్నందుకు ఎగ్ జైట్మెంట్ చూపించడం కానీ ఏమి చేయలేదు. ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు లేనప్పుడు తను మాత్రం ఏం చేస్తుంది. ఒక్కటి మాత్రం వాస్తవం. ఫ్లోకు అడ్డం వస్తాయని తీసేసిన పాటల వల్ల అమాంతం కలెక్షన్లు పెరగడం లాంటివి ఉండవు. దేవర, మిరాయ్ ఎంత పెద్ద హిట్టయినా తర్వాత యాడ్ చేసిన సాంగ్స్ వల్ల ఎక్కువ బెనిఫిట్ పొందలేకపోయాయి. ఒరిజినల్ గా లాక్ చేసిన వర్షన్లే బాగున్నాయని ఆడియన్స్ అనుకునేలా చేశాయి.

సుహాస్ సీన్ తీసేయడం, అర్జున్ దాస్ ఫ్లాష్ బ్యాక్ అయ్యాక కాస్త ట్రిమ్ చేయడం లాంటివి కూడా కొంచెం మైనస్ అయ్యాయని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. సరే ఏదైతేనేం నేహా శెట్టిది బోనస్ గా ఫీలవ్వడం తప్ప ఎవరైనా చేయగలిగింది ఏమి లేదు. కాకపోతే మొదటిసారి ఓజి చూస్తున్న వాళ్లకు మాత్రం ఇదో స్పీడ్ బ్రేకర్ లా అనిపించడమే సమస్య. గతంలో గాడ్ ఫాదర్ లో కూడా ఇలాగే సందర్భం లేకుండా పెట్టిన పాట సినిమాలో ఉన్న సీరియస్ ఫీల్ తగ్గించేసింది. ఏదో మాస్ కోసమని బలవంతంగా చేసే ఇలాంటి ప్రయత్నాలు మిస్ ఫైర్ అవుతున్న దాఖలాలు ఎక్కువ. పుష్ప లాంటివి మాత్రమే ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.

Related Post

OG యునివర్స్ గురించి పవన్ & సుజిత్
OG యునివర్స్ గురించి పవన్ & సుజిత్

మొదటి వారం కాకుండానే 250 కోట్ల గ్రాస్ దాటేసిన ఓజి అంచనాలకు మించి ఆడటం టీమ్ నే కాదు మొత్తం మెగా ఫ్యామిలీనే సంతోషంలో ముంచెత్తింది. కుటుంబం మొత్తం ఒక సినిమాని కలిసి చూడటం గత కొన్నేళ్లలో చిరంజీవికి కూడా జరగలేదు.

జగన్ కు లోకేష్ కు తేడా వివరించిన ఎమ్మెల్యేజగన్ కు లోకేష్ కు తేడా వివరించిన ఎమ్మెల్యే

నాయ‌కులు అంటే.. ప్ర‌జ‌ల‌కు చేరువ కావ‌డం ఒక భాగం మాత్ర‌మే. వారిని మెప్పిస్తేనే తిరిగి ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే.. ఇదొక్క‌టే కాదు.. క‌దా?  నాయ‌కులు అన్నాక‌.. పార్టీ నాయ‌కుల‌తోనూ మమేకం కావాలి. అప్పుడే పార్టీలోనూ నాయ‌కుల‌కు బ‌ల‌మైన