hyderabadupdates.com movies న్యూ ఏజ్ దర్శకులకు ప్రభాస్ ఛాన్స్

న్యూ ఏజ్ దర్శకులకు ప్రభాస్ ఛాన్స్

అదేంటి దర్శకుల్లో ఈ న్యూ ఏజ్ బ్యాచ్ ఎవరనుకుంటున్నారా. కమర్షియల్ ఎలిమెంట్స్ కి దూరంగా సహజమైన కథా కథనాలతో నిజ జీవితాలకు దగ్గరగా కథలు రాసుకునేవాళ్లను ఈ బ్యాచ్ లోకి చేర్చవచ్చు. ముఖ్యంగా మలయాళంలో వీళ్ళు కొన్నిసార్లు చేస్తున్న వండర్లు బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపిస్తున్నాయి. రాజా సాబ్ వైఫల్యంతో అభిమానులను బాగా నిరాశకు గురి చేసిన ప్రభాస్ ఇప్పుడు న్యూ ఏజ్ ఫిలిం మేకర్స్ వైపు దృష్టి సారిస్తున్నట్టు కనిపిస్తోంది.

ఎకో – కిష్కిందకాండం లాంటి మూవీస్ తో విమర్శకులను మెప్పించి బాక్సాఫీస్ వసూళ్లు రాబట్టిన దర్శకుడు దింజిత్ ఇటీవలే ప్రభాస్ ని కలుసుకున్న ఫోటో సోషల్ మీడియాలో తెగ తిరిగింది. ఒక లైన్ ఇద్దరి మధ్య చర్చకు వచ్చిందని, కానీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. ప్రస్తుతం ధనుష్ – సాయిపల్లవి – మమ్ముట్టి కాంబోలో సినిమా తీస్తున్న రాజ్ కుమార్ పెరియస్వామి సైతం ప్రభాస్ ని కలిసినవాళ్లలో ఉన్నాడట. ఇతని గత చిత్రం అమరన్ గురించి తెలిసిందే.

ఈ ఇద్దరికీ ఎక్కువ అనుభవం లేదు. అయినా సరే కంటెంట్ తో హిట్లు కొడుతున్నారు. ప్రభాస్ ఇలాంటివాళ్లతో పని చేయడం చాలా అవసరం. మారుతీ, హను రాఘవపూడి లాంటి సీనియర్లతో పాటు సందీప్ రెడ్డి వంగా, నాగ్ అశ్విన్, ప్రశాంత్ నీల్ లాంటి వాళ్ళతో చేతులు కలపడం వల్ల మంచి ఫలితాలు అందుకునే ఛాన్స్ ఉంటుంది.

ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 సమాంతరంగా జరిగేలా చూసుకుంటున్న ప్రభాస్ ఆ తర్వాత సలార్ 2 మొదలుపెట్టే అవకాశం ఉంది. ఈలోగా మరో రెండు ప్రాజెక్టులు లాక్ చేసుకుంటే గ్యాప్ రాకుండా ఉంటుంది. ఆ దిశగా ప్రభాస్ ప్లానింగ్ చేసుకుంటున్నాడు. ఈ ఏడాది ఫౌజీ విడుదలైపోతుంది. వచ్చే మార్చిలో స్పిరిట్ వచ్చేస్తుంది. సో కల్కి 2, సలార్ 2లకు ఎక్కువ డేట్లు ఇవ్వొచ్చు. ఒకవేళ దింజిత్, రాజ్ కుమార్ లలో ఒకరికి ఛాన్స్ ఇస్తే మటుకు ఊహించని ఒక ఫ్రెష్ కాంబినేషన్ అవుతుంది.

Related Post

ఇవేం మాటలు మల్లన్నా?ఇవేం మాటలు మల్లన్నా?

చింతపండు నవీన్…అలియాస్ తీన్మార్ మల్లన్న..తెలంగాణ ప్రజలకు సుపరిచితుడే. తీన్మార్ మల్లన్నగా పాపులర్ అయిన నవీన్…ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఫక్తు పొలిటిషన్ గా మారిపోయారు. పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత తన వివాదాస్పద వ్యాఖ్యలతో మల్లన్న ఎక్కువ పాపులర్ అయ్యారు. బీజేపీ,

Official: Ravi Teja’s Mass Jathara to open with paid premieres in IndiaOfficial: Ravi Teja’s Mass Jathara to open with paid premieres in India

The theatrical trailer of Ravi Teja’s Mass Jathara was unveiled recently, and it’s packed with high-voltage action, promising a complete mass feast. Director Bhanu Bhogavarapu has showcased the Mass Maharaja