hyderabadupdates.com movies పవన్ కు అంబటి కూతురు సూటి ప్రశ్న

పవన్ కు అంబటి కూతురు సూటి ప్రశ్న

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసిన ఘటన రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ దాడిపై అంబటి రాంబాబు కూతురు మౌనిక మీడియాతో మాట్లాడారు. ఇంత నీచమైన రాజకీయాలు ఎప్పుడూ చూడలేదని, దాడి సమయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని సంచలన ఆరోపణలు చేశారు. మహిళలపై దాడులను హోంమంత్రి అనిత సమర్థిస్తారా అని ప్రశ్నించారు.

కాపు మహిళలైన తమపై కూడా దాడులు చేశారని, లకారాలతో బండబూతులు తిడుతూ దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. తాను అన్నది చంద్రబాబును కాదని అంబటి రాంబాబు క్లియర్ గా చెప్పారని, గతంలో చంద్రబాబు కూడా జగన్ ను అనేక సార్లు అనరాని మాటలు అన్నారని చెప్పారు.

తాను అలా మాట్లాడినందుకు అంబటి రాంబాబు క్షమాపణ కూడా చెప్పారని గుర్తు చేశారు. 8 గంటలపాటు తమపై దాడి చేశారని, మహిళల క్షేమం గురించి మాట్లాడే పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఆయన బలాన్ని చూసుకునే వాళ్ళు ఇలాంటి దాడి చేశారని ఆరోపించారు.

తమ ఫిర్యాదులను పోలీసులు తీసుకోవడం లేదని, టీడీపీ గూండాలను కంట్రోల్ చేస్తున్నట్టు పోలీసులు యాక్షన్ చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలోనే ఈ దాడి జరిగిందని ఆరోపించారు.

తాగుబోతులను తమపైకి ఉసిగొల్పారని, ఆమెకు నైతిక విలువలున్నాయా అని ప్రశ్నించారు. ఇక, సినిమా చూపిస్తానని పెమ్మసాని అంటున్నారని, మహిళలపై ఇలా దాడులు చేయడమే సినిమా చూపించడమా అని ప్రశ్నించారు. దీనికి పెమ్మసాని భార్య సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

“కాపులు అంటూ ప్రస్తావించి మా ఇంటిమీద దాడి చేశారు.దీనికి పవన్ కల్యాణ్ గారి బలాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్నారు.ఈ దాడిని ఆయన ఖండించాలి.”– అంబటి రాంబాబు కుమార్తె pic.twitter.com/vuij78fs5A— Gulte (@GulteOfficial) February 2, 2026

Related Post

స్మృతి పెళ్లికి బ్రేక్… ఎన్నెన్ని రూమర్లోస్మృతి పెళ్లికి బ్రేక్… ఎన్నెన్ని రూమర్లో

భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి రెండు రోజుల కిందట అర్ధంతరంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు మూడేళ్ల పాటు ప్రేమలో ఉన్న సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌ను ఈ ఆదివారం పెళ్లి చేసుకోవాల్సింది స్మృతి. మూడు రోజుల ముందు

Bison Twitter Review: 9 tweets to read before watching Mari Selvaraj-Dhruv Vikram’s filmBison Twitter Review: 9 tweets to read before watching Mari Selvaraj-Dhruv Vikram’s film

For the unversed, Bison marked the fifth film of director Mari Selvaraj after Periyerum Perumal, Karnan, Maamannan, and Vaazhai. Besides Dhruv, the movie stars an ensemble cast that includes Pasupathy,