ఏపీలో కొత్తగా సర్పమిత్ర వాలంటీర్లను అటవీశాఖ నియమించనుంది. గ్రామాల్లో జనావాసాల్లోకి వచ్చిన పాముల నుంచి ప్రజలకు హాని కలగకుండా సర్ప మిత్రలను ఏర్పాటు చేసేందుకు ప్రతి పంచాయతీ పరిధిలో వాలంటీర్లను ఎంపిక చేసి శిక్షణ ఇవ్వనున్నట్టు అటవీ శాఖ తెలిపింది. ఈ విషయాన్ని ఈ రోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులు వివరించారు. గ్రామ స్థాయిలో ముందుకు వచ్చే సర్ప మిత్ర వాలంటీర్లకు అటవీ శాఖ నుంచి ప్రోత్సాహకాలు అందించాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు.
మానవులు, ఏనుగుల మధ్య సంఘర్షణను నివారించడంతో పాటు సరికొత్త సాంకేతికతతో అటవీ జంతువులకు సంరక్షణ చేపట్టేందుకు రాష్ట్ర అటవీశాఖ రూపొందించిన ‘హనుమాన్’ ప్రాజెక్ట్ వివరాలను పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు. 11 అంశాలతో కూడిన ఈ ప్రాజెక్ట్ ను అటవీశాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయనకు వివరించారు.
హనుమాన్ ప్రాజెక్ట్ లోని ప్రతి అంశాన్ని ఆసక్తిగా విన్న పవన్ కళ్యాణ్ ప్రాజెక్టుని ముందుకు తీసుకువెళ్లడానికి అంశాల వారీగా నిర్దుష్ట కాలపరిమితి అవసరం అన్నారు. జంతువుల సంచారానికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పడు ప్రజలకు చేరవేసేందుకు వీలుగా అధునాతన టెక్నాలజీతో కొత్త యాప్ ను రూపొందించి మార్చి 3వ తేదీలోపు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.