hyderabadupdates.com Gallery పశు సంవర్ధక రంగానికి స‌ర్కార్ భారీ ఊరట

పశు సంవర్ధక రంగానికి స‌ర్కార్ భారీ ఊరట

పశు సంవర్ధక రంగానికి స‌ర్కార్ భారీ ఊరట post thumbnail image

అమరావతి : రాష్ట్రంలో పశు సంవర్ధక రంగాన్ని బలోపేతం చేస్తూ పశు పోషకులు, చిన్న రైతులకు పెద్ద ఎత్తున ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసిన జీవో ప్రకారం రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలు (ULBs), పట్టణ అభివృద్ధి సంస్థలు (UDAs) పరిధిలో డెయిరీ ఫారాలు, గొర్రెలు/మేకల పెంపకం కేంద్రాలు, పందుల పెంపకం యూనిట్లు, ఇతర పశుసంవర్ధక ఫారాలకు బెటర్‌మెంట్ చార్జీలు, డెవలప్‌మెంట్ చార్జీల నుండి పూర్తిగా మినహాయింపు మంజూరు చేయబడిందని పేర్కొన్నారు.
అదేవిధంగా ఈ ఫారాలకు భవన అనుమతి లేదా లైసెన్స్ రుసుమును గ్రామ పంచాయతీల్లో వసూలు చేసే రుసుముకు సమానంగా నిర్ణయించినట్లు వెల్లడించారు మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు. ఈ నిర్ణయం ద్వారా పట్టణ ప్రాంతాల్లో పశు పోషణపై ఆధారపడిన రైతులు, చిన్న వ్యవసాయదారులకు ఆర్థిక భారం గణనీయంగా తగ్గి వారి జీవనోపాధి మెరుగు పడుతుంద‌ని చెప్పారు. మరింత మందికి స్వయం ఉపాధి, సంవృద్ది లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. గత జూన్ నెలలో జరిగిన సీఎం కాంక్లేవ్ మీటింగ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.
త‌మ ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాలను అమ‌లు చేస్తోంద‌ని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఏపీ వ్యాప్తంగా కురుస్తున్న వ‌ర్షాల‌పై కూడా ఆరా తీశారు మంత్రి. ఎప్ప‌టిక‌ప్పుడు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించారు. ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు.
The post పశు సంవర్ధక రంగానికి స‌ర్కార్ భారీ ఊరట appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Pawan Kalyan: కుంకీ ఏనుగుల ఆపరేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్Pawan Kalyan: కుంకీ ఏనుగుల ఆపరేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్

    పలమనేరు ముసలిమడుగు వద్ద కుంకీ ఏనుగుల ఆపరేషన్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గజరాజుల విన్యాసాలను పవన్ కల్యాణ్, అధికారులు తిలకించారు. ఏనుగులు కృష్ణా, అభిమన్యులకు పవన్ స్వయంగా ఆహారాన్ని అందించారు.

రాష్ట్రాన్ని హార్టికల్చర్, కోకో హబ్ గా రూపొందిస్తాంరాష్ట్రాన్ని హార్టికల్చర్, కోకో హబ్ గా రూపొందిస్తాం

అమ‌రావ‌తి : రాష్ట్రాన్ని హార్టికల్చర్, కోకో హబ్ గా తీర్చిదిద్దేలా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. ఏలూరులో రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ సదస్సును మంత్రి జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా

PM Narendra Modi: ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా ఉత్తరాఖండ్‌ – ప్రధాని మోదీPM Narendra Modi: ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా ఉత్తరాఖండ్‌ – ప్రధాని మోదీ

    పెద్దసంఖ్యలో పుణ్యక్షేత్రాలున్న ఉత్తరాఖండ్‌కు అసలైన బలం ఆధ్యాత్మిక శక్తి అని, ఈ రాష్ట్రం సంకల్పిస్తే రాబోయే అయిదేళ్లలో ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధానిగా అవతరించగలదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆవిర్భవించిన పాతికేళ్లలో అన్ని రంగాల్లో గణనీయ పురోగతి సాధించి ఇతర