hyderabadupdates.com movies పసికూన పంజాకు కంగారూలు విలవిల!

పసికూన పంజాకు కంగారూలు విలవిల!

​ఈసారి టీ20 వరల్డ్ కప్ 2026లో చిన్న దేశాలు పెద్ద జట్లకు చుక్కలు చూపిస్తున్నాయి. నేడు కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో బలమైన ఆస్ట్రేలియాపై జింబాబ్వే 23 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 169 పరుగులు చేసింది. బ్రైన్ బెన్నెట్ (64 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు.

​అనంతరం 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు జింబాబ్వే బౌలర్లు చెమటలు పట్టించారు. బ్లెస్సింగ్ ముజరబానీ, బ్రాడ్ ఈవాన్స్ కొత్త బంతితో ఆసీస్ టాప్ ఆర్డర్‌ను కకావికలం చేశారు. ట్రావిస్ హెడ్ (17), గ్రీన్ (0), టిమ్ డేవిడ్ (0) వరుసగా పెవిలియన్ చేరడంతో ఆస్ట్రేలియా ఒక దశలో 29 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. బ్యాటింగ్ లైనప్‌లో ఆసీస్ చేసిన ప్రయోగాలు కూడా ఆ జట్టు కొంపముంచాయి.

​మధ్యలో మ్యాట్ రెన్షా (65), గ్లెన్ మాక్స్‌వెల్ (31) ఐదో వికెట్‌కు 77 పరుగులు జోడించి ఆశలు రేకెత్తించినా, జింబాబ్వే స్పిన్నర్ రైన్ బర్ల్ వీరిద్దరిని పెవిలియన్ చేర్చి ఆసీస్ ఆశలపై నీళ్లు చల్లాడు. జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా కండరాల నొప్పితో మైదానాన్ని వీడినా, ఆ జట్టు పట్టుదల మాత్రం తగ్గలేదు. చివరకు ఆస్ట్రేలియా 19.3 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ముజరబానీ 17 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాసించాడు.

​ఆస్ట్రేలియాను వరల్డ్ కప్‌లో ఓడించడం జింబాబ్వేకు ఇది కొత్తేమీ కాదు. గతంలో 1983, 2007 వరల్డ్ కప్‌లలో కూడా ఈ పసికూన జట్టు కంగారూలను మట్టికరిపించింది. ఆస్ట్రేలియా అతివిశ్వాసం, పేలవమైన షాట్ సెలక్షన్ వారికి శాపంగా మారాయి. అదే సమయంలో జింబాబ్వే గ్రౌండ్ పరిస్థితులను సరిగ్గా అంచనా వేసి, పక్కా ప్రణాళికతో ఆడి గెలిచింది. ఈ విజయంతో జింబాబ్వే ‘సూపర్-8’ రేసులో నిలవడమే కాకుండా క్రికెట్ ప్రపంచానికి మరో పెద్ద షాక్ ఇచ్చింది.

​చిన్న జట్టు అని తక్కువ అంచనా వేస్తే ఫలితం ఎలా ఉంటుందో జింబాబ్వే మరోసారి నిరూపించింది. ఈ ఓటమితో ఆస్ట్రేలియా తన లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా బ్యాటింగ్ లైనప్‌లో స్థిరత్వం లేకపోవడం ఆ జట్టుకు ఆందోళన కలిగిస్తోంది. మరి రాబోయే మ్యాచ్‌ల్లోనైనా కంగారూలు కోలుకుంటారో లేదో చూడాలి.

Related Post

“Karmanye Vadhikaraste” — A Gripping Thriller Hitting Theatres on October 31“Karmanye Vadhikaraste” — A Gripping Thriller Hitting Theatres on October 31

Ushaswini Films is all set to thrill audiences with its latest investigative mystery, “Karmanye Vadhikaraste,” releasing in theatres on October 31. The film stars versatile actors Brahmaji, Shatru, and Master