నిన్న సాయంత్రం ది గర్ల్ ఫ్రెండ్, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో స్పెషల్ ప్రీమియర్లు హైదరాబాద్ లో వేశారు. దీనికి వెళ్లిన వాళ్ళ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ కనిపించడం బయ్యర్ వర్గాల్లో సంతోషాన్ని నింపుతోంది. రస్మిక మందన్న పెర్ఫార్మన్స్, రాహుల్ రవీంద్రన్ టేకింగ్ గురించి ఒక వర్గం పొగడ్తలు కురిపిస్తుండగా, సింపుల్ కామెడీతో తిరువీర్ బృందం నవ్వించిన తీరు గురించి షో చూసిన నెటిజెన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఇతరులను ప్రోత్సహించడం కోసం రెండు సినిమాలకు గివ్ ఆవేల రూపంలో ఫ్రీ టికెట్లు ఇవ్వడం ప్రమోషన్స్ పరంగా ఉపయోగపడేలా ఉంది. రేపొచ్చే అసలైన టాక్ వీటికి కీలకం కానుంది.
సుధీర్ బాబు జటాధరకు షోలు వేయలేదు. నేరుగా రేపే రిలీజ్ ప్లాన్ చేయడంతో దానికి సంబంధించిన టాక్ బయటికి రాలేదు. ముందస్తు ప్రీమియర్లు ఒకసారి వర్కౌట్ అయ్యి మరోసారి తేడా కొడుతున్న ట్రెండ్ లో ది గర్ల్ ఫ్రెండ్, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోలు రెండు రోజుల ముందే షోలు వేయడం ఒకరకంగా రిస్కే. అయినా సరే తీసుకున్నారు. ఇలా చేయడానికి కారణం లేకపోలేదు. ఎంత రష్మిక మందన్న ఉన్నప్పటికీ గర్ల్ ఫ్రెండ్ బుకింగ్స్ చాలా సెంటర్స్ లో ఆశించిన స్థాయిలో లేవు. మొదటి రోజు ఎక్కువ శాతం ఆడియన్స్ రావడం కీలకం. వాళ్ళు తీసుకెళ్లే టాకే వీకెండ్ వసూళ్లకు ఉపయోగపడుతుంది.
అందుకే నిర్మాతలు ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ది గర్ల్ ఫ్రెండ్ లో కంటెంట్ చాలా డిఫరెంట్ గా ఉండనే మాట నేపథ్యంలో యూత్ కి కనక ఇది కనెక్ట్ అయితే కలెక్షన్లు బాగుంటాయి. ఇక కామెడీనే నమ్ముకున్న ప్రీ వెడ్డింగ్ షో మీద హీరో తిరువీర్ మాములు నమ్మకంగా లేడు. మాసూద తర్వాత మళ్ళీ అంత సక్సెస్ తనకు దక్కలేదు. అందుకే ఇది కీలకం కానుంది. సోషల్ మీడియా స్పందన పట్ల రెండు టీమ్స్ హ్యాపీగానే ఉన్నాయి. మరి రేపు కామన్ పబ్లిక్ నుంచి ఇదే రెస్పాన్స్ వస్తే మాత్రం మళ్ళీ థియేటర్లు జనం కళకళలాడటం చూడొచ్చు.