hyderabadupdates.com Gallery పాట‌లు త‌ప్ప స్కాంలు చేయ‌డం తెలియ‌దు

పాట‌లు త‌ప్ప స్కాంలు చేయ‌డం తెలియ‌దు

పాట‌లు త‌ప్ప స్కాంలు చేయ‌డం తెలియ‌దు post thumbnail image

హైద‌రాబాద్ : ఒక‌టా రెండా ఏకంగా రూ. 210 కోట్ల స్కాం ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోంది సింగ‌ర్ మంగ్లీ. త‌న స్వస్థలం రాయ‌ల‌సీమ‌. కానీ అనూహ్యంగా తెలంగాణకు వ‌చ్చింది. బంజారా క‌మ్యూనిటీకి చెందిన‌ది కావ‌డంతో మెల మెల్ల‌గా జ‌ర్న‌లిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ త‌ర్వాత పాపుల‌ర్ అయ్యింది. అక్క‌డి నుంచి గొంతు బాగుండ‌డంతో పాట‌లు పాడ‌టం మొద‌లు పెట్టింది. ఇక ఆనాటి నుంచి నేటి దాకా వెన‌క్కి చూసుకోలేదు. తెలంగాణ జాన‌ప‌ద పాట‌ల‌తో దుమ్ము రేపింది. త‌న‌తో పాటు త‌న సోద‌రిణి కూడా ఊ అంటావా మావ అంటూ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఈ ఒక్క పాట‌తో త‌ను కూడా పాపుల‌ర్ అయ్యింది దేశ వ్యాప్తంగా.
తెలుగు, క‌న్న‌డ సినీ రంగాల‌లో మంగ్లీ , సోద‌రి కూడా పాట‌లు పాడుతూ మ‌రింత జ‌నాద‌ర‌ణ పొందారు. ఈ త‌రుణంలో త‌ను ఓ కంపెనీ, ప‌బ్, స్కూల్ పెడ‌తానంటూ మంగ్లీతో పాటు సోద‌రుడు , ఇంకొంద‌రు క‌లిసి మాయ మాట‌లు చెప్పి కోట్లు కొల్ల‌గొట్టిన‌ట్లు విమ‌ర్శ‌లు ఉన్నాయి. బాధితులు సైతం బ‌య‌ట‌కు వ‌చ్చారు. దీంతో మంగ్లీ నోరు విప్పింది. తాను అమాయ‌కురాలిన‌ని, త‌న‌కు ఏ పాపం తెలియ‌దంటూ బుకాయించే ప్ర‌య‌త్నం చేస్తోంది. పంజాగుట్ట పీఎస్ లో త‌న‌పై కేసు న‌మోదు అయ్యింది. ఈ సంద‌ర్బంగా మంగ్లీ మాట్లాడుతూ త‌న‌కు పాట‌లు పాడ‌టం త‌ప్ప స్కాంలు చేయ‌డం తెలియ‌ద‌ని వాపోయింది. తాను త‌ప్పు చేసి ఉంటే ఎలాంటి శిక్షకైనా సిద్దంగా ఉన్నాన‌ని అన్నారు. డబ్బున్న కుటుంబం నుంచి రాలేదని, పేదరికం నుంచి వచ్చానని, డబ్బు విలువ బాగా తెలుస‌న్నారు.
The post పాట‌లు త‌ప్ప స్కాంలు చేయ‌డం తెలియ‌దు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

సహకార సంఘాలకు రూ.5 కోట్ల బకాయిల విడుదలసహకార సంఘాలకు రూ.5 కోట్ల బకాయిల విడుదల

అమరావతి : చేనేత సహకార సంఘాలకు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత సంక్రాంతి ముంగిట శుభవార్త తెలిపారు. ఆప్కో బకాయిలకు సంబంధించి రూ.5 కోట్లు చెల్లించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. గతంలో చేనేత

Delhi Bomb Blasts: డాక్టర్ ఉమర్ నబీ ఆత్మాహుతి దాడి కేసులో వెలుగులోకి సంచలన విషయాలుDelhi Bomb Blasts: డాక్టర్ ఉమర్ నబీ ఆత్మాహుతి దాడి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

    దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద నవంబర్ 10వ తేదీన కారు బాంబు దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఉమర్ ఉన్ నబీ అనే డాక్టర్ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. దర్యాప్తు అధికారులు ఇప్పటి వరకు అరెస్ట్ అయిన

YS Jagan: సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ లేఖYS Jagan: సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ లేఖ

    కృష్ణా జలాల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్… ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాసారు. ట్రిబ్యునల్ లో రాష్ట్ర ప్రభుత్వం తరపున గట్టిగా వాదనలు వినిపించి… ఏపీకు