hyderabadupdates.com Gallery పార్టీ బ‌లోపేతంపై మ‌రింత ఫోక‌స్ పెట్టాలి

పార్టీ బ‌లోపేతంపై మ‌రింత ఫోక‌స్ పెట్టాలి

పార్టీ బ‌లోపేతంపై మ‌రింత ఫోక‌స్ పెట్టాలి post thumbnail image

గుంటూరు జిల్లా : ఏపీ తెలుగుదేశం పార్టీ చీఫ్ ప‌ల్లా శ్రీ‌నివాస రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పార్టీ అంటేనే కార్య‌క‌ర్త‌లు అని, వారు లేక పోతే పార్టీ మ‌నుగ‌డ సాధించ‌డం అత్యంత క‌ష్ట‌మ‌న్నారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌గ‌న్ రెడ్డి స‌ర్కార్ దాష్టీకాల‌ను, అక్ర‌మ కేసుల‌ను త‌ట్టుకుని నిల‌బ‌డ్డార‌ని, ఇదే స్పూర్తితో ముందుకు సాగాల‌ని కోరారు. మంగ‌ళ‌వారం గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభమైన పార్లమెంటరీ కమిటీల శిక్షణ తరగతుల కార్యక్రమంలో ఐటి శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్
తో కలిసి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ప్రతిమకు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
అనంతరం శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడారు. పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలను లోతుగా అవగాహన చేసుకోవడమే ఈ శిక్షణ తరగతుల ప్రధాన ఉద్దేశమని స్ప‌ష్టం చేశారు. పార్లమెంటరీ కమిటీల సభ్యులు ప్రజాస్వామ్య విలువలు, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకొని పార్టీ బలోపేతానికి, ప్రజల సమస్యలపై సమర్థవంతంగా పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పార్టీ సీనియర్ నేతల అనుభవం ఈ శిక్షణల ద్వారా అందరికీ దిశానిర్దేశం చేస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి శిక్ష‌ణా త‌ర‌గ‌తులు మ‌రికొన్నింటిని ద‌శ‌ల వారీగా నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు. శిక్ష‌ణ అనేది ప్ర‌తి ఒక్క‌రికీ అవ‌స‌ర‌మ‌న్నారు. 75 ఏళ్ల వ‌య‌సులో కూడా 15 ఏళ్ల కుర్రాడిలో నారా చంద్ర‌బాబు నాయుడు ప‌ని చేస్తున్నార‌ని, మ‌నందరం ఆయ‌న‌ను స్పూర్తిగా తీసుకోవాల‌ని కోరారు ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు.
The post పార్టీ బ‌లోపేతంపై మ‌రింత ఫోక‌స్ పెట్టాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

రామ్ చ‌ర‌ణ్ పెద్ది మూవీపై ఎడ‌తెగ‌ని ఉత్కంఠ‌రామ్ చ‌ర‌ణ్ పెద్ది మూవీపై ఎడ‌తెగ‌ని ఉత్కంఠ‌

హైద‌రాబాద్ : అంద‌రి దృష్టి మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ , జాహ్న‌వి క‌పూర్ క‌లిసి న‌టించిన చిత్రం పెద్ది. దీనికి ఉప్పెన ఫేమ్ ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు స‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. భారీ ఖ‌ర్చు పెట్టారు ఈ మూవీ కోసం.

తెలంగాణ రైజింగ్ విజ‌న్ దేశానికే రోల్ మోడ‌ల్తెలంగాణ రైజింగ్ విజ‌న్ దేశానికే రోల్ మోడ‌ల్

హైద‌రాబాద్ : తెలంగాణ రైజింగ్ 2047 విజ‌న్ దేశానికే రోల్ మోడ‌ల్ గా మారింద‌ని అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. హైద‌రాబాద్ లో బ‌యో స‌ద‌స్సు 2026ను ప్రారంభించి ప్ర‌సంగించారు. పెన్సిల్వేనియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసన్ ప్రొ. బ్రూస్

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ పూర్తి కావాలిఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ పూర్తి కావాలి

హైద‌రాబాద్ : యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ మొద‌టి విడ‌త‌లో పూర్త‌య్యే వాటిలో ఎక్కువగా బాలికలకు కేటాయించాల‌ని ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. రానున్న మూడేళ్ల‌లో ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గం లోనూ బాలురు, బాలిక‌ల‌కు ఒకొక్క‌టి చొప్పున వీటి నిర్మాణాలు