hyderabadupdates.com Gallery పుదుచ్చేరి ఎన్నిక‌ల్లో టీవీకే ఒంట‌రిగానే బ‌రిలోకి

పుదుచ్చేరి ఎన్నిక‌ల్లో టీవీకే ఒంట‌రిగానే బ‌రిలోకి

పుదుచ్చేరి ఎన్నిక‌ల్లో టీవీకే ఒంట‌రిగానే బ‌రిలోకి post thumbnail image

చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్రంతో పాటు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నిక‌ల హ‌డావుడి పీక్ స్టేజ్ కు చేరుకుంది. నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెల‌కొంది. ప్ర‌ధానంగా ప్ర‌ముఖ న‌టుడు ద‌ళ‌ప‌తి విజ‌య్ సార‌థ్యంలోని టీవీకే పార్టీపై అంద‌రి చూపు నెల‌కొని ఉంది. తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్ర‌స‌క్తి లేద‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించాడు అధ్య‌క్షుడు. తాజాగా పుదుచ్చేరిలో ఎన్నిక‌ల‌లో పోటీ చేసే అభ్య‌ర్థుల‌కు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశాడు. ఇందులో భాగంగా మొత్తం 30 మంది అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేశాడు. వ‌చ్చే ఏప్రిల్ నెల‌ 9న జరగనున్న ఎన్నికల్లో ఈ పార్టీ స్వతంత్రంగా పోటీ చేయనుంది, ఓట్ల లెక్కింపు మే 4న జరగనుంది. 30 మంది సభ్యులు కలిగిన పుదుచ్చేరి శాసనసభ ప్రస్తుత పదవీకాలం జూన్ 15న ముగియనుంది.
2021 శాసనసభ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ 10 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించగా సీఎం ఎంకే స్టాలిన్ సార‌థ్యంలోని డీఎంకే ఆరు స్థానాలతో తర్వాతి స్థానంలో నిలిచింది. ఇక భార‌తీయ జ‌న‌తా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు చెరో ఆరు స్థానాల‌తో స‌రి పెట్టుకున్నాయి. 2016 ఎన్నికల్లో కాంగ్రెస్ 15 స్థానాలతో స్పష్టమైన మెజారిటీని సాధించింది. ఏఐఎన్ఆర్సీ ఎనిమిది స్థానాలను, ఏఐడీఎంకే నాలుగు స్థానాలను, డీఎంకే రెండు స్థానాలను దక్కించుకున్నాయి. ఆ సమయంలో ఓటింగ్ శాతం 83.6 శాతంగా నమోదైంది. ఏఐఎన్ఆర్సీ పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్న బీజేపీ మార్చి 21న తన మొదటి జాబితాలో తొమ్మిది మంది అభ్యర్థులను విడుదల చేసింది. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ మార్చి 18న సమావేశమైంది.
The post పుదుచ్చేరి ఎన్నిక‌ల్లో టీవీకే ఒంట‌రిగానే బ‌రిలోకి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

హైద‌రాబాద్ లో ఘ‌నంగా కైట్, స్వీట్ ఫెస్టివ‌ల్హైద‌రాబాద్ లో ఘ‌నంగా కైట్, స్వీట్ ఫెస్టివ‌ల్

హైద‌రాబాద్ : సంక్రాంతి ప‌ర్వ‌దినం పుర‌స్క‌రించుకుని రాష్ట్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ లోని ప‌రేడ్ గ్రౌండ్స్ లో నిర్వ‌హంచిన అంతర్జాతీయ కైట్ , స్వీట్ ఫెస్టివల్ ఘనంగా జ‌రిగింది. తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ నిర్వహించిన ఈ మూడు రోజుల ఉత్సవం

సింగ‌రేణి స్కాంపై శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాలిసింగ‌రేణి స్కాంపై శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాలి

హైద‌రాబాద్ : మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్ర‌భుత్వంపై భ‌గ్గుమ‌న్నారు. రాష్ట్రానికి ఆత్మ‌గా ఉన్న సింగ‌రేణి బొగ్గు గ‌నులకు సంబంధించి చోటు చేసుకున్న స్కాంపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆదివారం హ‌రీశ్ రావు మీడియాతో మాట్లాడారు.

సంక్షేమ వ‌స‌తి గృహాల‌లో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌నసంక్షేమ వ‌స‌తి గృహాల‌లో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న

గుంటూరు జిల్లా : ఏపీ రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సంక్షేమ హాస్ట‌ళ్ల‌లో వార్డెన్లు త‌మ ప‌నితీరు మార్చుకోవాల‌ని సూచించారు. కొంద‌రి నిర్ల‌క్ష్యం కార‌ణంగా ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు వ‌స్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం