hyderabadupdates.com Gallery పూలే జయంతి రాష్ట్ర పండుగగా అధికారిక నిర్వహణ

పూలే జయంతి రాష్ట్ర పండుగగా అధికారిక నిర్వహణ

పూలే జయంతి రాష్ట్ర పండుగగా అధికారిక నిర్వహణ post thumbnail image

అమరావతి : ఈ నెల 11న బడుగుల ఆశాజ్యోతి మహ్మత్మా జ్యోతిరావు పూలే ద్విశతబ్ది జయంతి ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జ్యోతిరావు పూలే జయంతిని రాష్ట్ర పండుగగా, అధికారికంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విజయవాడలో రాష్ట్ర స్థాయి పూలే జయంత్యోత్సవం నిర్వహించనున్నామన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళా విద్య, దళిత, బడుగు వర్గాల హక్కుల కోసం, అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలన కోసం పోరాడిన యోధుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కోసం జీవితాన్ని ధారపోశారన్నారు.
తన సతీమణి సావిత్రిబాయి పూలేతో కలిసి 1848లో పూణేలో బాలికల కోసం మొదటి పాఠశాలను స్థాపించారన్నారు. ఈ నెల 11న మహత్మా జ్యోతిరావు పూలే ద్విశతాబ్ధి జయంతిని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జ్యోతిరావు పూలే జయంతిని రాష్ట్ర పండుగగా, అధికారికంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర స్థాయి పూలే జయంత్యోత్సవం నిర్వహించనున్నామని మంత్రి సవిత తెలిపారు. అంతకు ముందు ఏలూరు జిల్లా హనుమాన్ జంక్షన్ కు చెందిన శిల్ప కళాకారులు రూపొందించిన జ్యోతిరావు పూలే విగ్రహ నమూనాలను తన క్యాంపు కార్యాలయంలో మంత్రి సవిత పరిశీలించారు. వాటిని రూపొందించిన కళాకారులను మంత్రి అభినందించారు.ఈ సమావేశంలో పలువురు కార్పొరేషన్ చైర్మన్లు నందం అబద్ధయ్య, మల్లె ఈశ్వరరావు, ఎర్రిబోతు రమణరావు, వీరంకి గురుముర్తి తదితరులు పాల్గొన్నారు.
The post పూలే జయంతి రాష్ట్ర పండుగగా అధికారిక నిర్వహణ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Sabarimala: ఆదాయం లేని వ్యక్తి శబరిమల బంగారు తాపడం దాత ?Sabarimala: ఆదాయం లేని వ్యక్తి శబరిమల బంగారు తాపడం దాత ?

Sabarimala : శబరిమల ఆలయంలో బంగారు ఫలకాల బరువు తగ్గిపోవడంపై తలెత్తిన వివాదంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గర్భగుడి వెలుపలి బంగారు ఫలకాలకు తాపడం దాత, బెంగళూరు వ్యాపారి ఉన్నికృష్ణన్‌కి (Unnikrishnan) అసలు స్థిరమైన ఆదాయ వనరులే లేవని,

Deputy Speaker: డీజీపీకు డిప్యూటీ స్పీకర్ రఘురామ ఫిర్యాదు Deputy Speaker: డీజీపీకు డిప్యూటీ స్పీకర్ రఘురామ ఫిర్యాదు 

    కూటమి పక్షాల మధ్య, కులాల మద్య చిచ్చుపెట్టేందుకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారిపై డీజీపీకి పిర్యాదు చేశారు. అంభోజి వినయ్ కుమార్ పేరుతో ఫేస్‌బుక్‌లో కరుడుగట్టిన

వీలైనంత త్వ‌ర‌గా మున్సిప‌ల్ ఎన్నిక‌లు నిర్వ‌హించాలివీలైనంత త్వ‌ర‌గా మున్సిప‌ల్ ఎన్నిక‌లు నిర్వ‌హించాలి

మేడారం : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా మున్సిప‌ల్ ఎన్నిక‌లు నిర్వహించాల‌ని ఆదేశించారు. పదవీకాలం పూర్తయిన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నిక‌లు చేప‌ట్టాలంటూ సీఎం అధ్యక్ష‌త‌న జ‌రిగిన మంత్రిమండ‌లి స‌మావేశం నిర్ణ‌యించింది. రాష్ట్రంలో గడువు