hyderabadupdates.com Gallery పెట్టుబ‌డి ప్ర‌తిపాద‌న‌ల‌కు స‌ర్కార్ ఆమోదం

పెట్టుబ‌డి ప్ర‌తిపాద‌న‌ల‌కు స‌ర్కార్ ఆమోదం

పెట్టుబ‌డి ప్ర‌తిపాద‌న‌ల‌కు స‌ర్కార్ ఆమోదం post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 15 వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఐటీ, విద్యుత్, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల రంగాలకు చెందిన వివిధ పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ఈ కీల‌క స‌మావేశంలో మంత్రులు నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్, పి.నారాయణ, కింజార‌పు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్ధన్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా కీల‌క సూచ‌న‌లు చేశారు. ప్ర‌తిపక్ష పార్టీ కావాల‌ని బ‌ద్నాం చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని అన్నారు.
దీనిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ఆయా శాఖ‌ల‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మంత్రులు పూర్తి అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని స్పష్టం చేశారు. ఇప్ప‌టికే ఆయా మంత్రుల ప‌నితీరుపై స‌ర్వే కూడా చేప‌ట్ట‌డం జ‌రిగింద‌న్నారు. ముంద‌స్తుగా ర్యాంకులు కూడా ఇప్ప‌టికే ప్ర‌క‌టించామ‌ని, దాని ఆధారంగా ప‌ని చేయాల‌ని మ‌రోసారి పేర్కొన్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ప్ర‌స్తుతం జరుగుతున్న శాస‌న స‌భ స‌మావేశాల‌లో ప్ర‌తి ప్ర‌శ్న‌కు సావ‌ధానంగా స‌మాధానం ఇచ్చేందుకు ప్రిపేర్ అయి ఉండాల‌ని అన్నారు. గ‌తంలో ప్ర‌భుత్వం అన్ని వ్య‌వ‌స్థ‌లను నిర్వీర్యం చేసింద‌ని, అది చేసిన నిర్వాకం కార‌ణంగా పెద్ద ఎత్తున న‌ష్టం జ‌రిగింద‌న్నారు. దేశంలో పెట్టుబ‌డుల‌ను అత్య‌ధికంగా ఆక‌ర్షించిన చ‌రిత్ర ఒక్క ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి మాత్ర‌మే ఉంద‌న్నారు నారా చంద్ర‌బాబు నాయుడు.
The post పెట్టుబ‌డి ప్ర‌తిపాద‌న‌ల‌కు స‌ర్కార్ ఆమోదం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఇరాన్ త‌ల‌వంచితే స‌రి లేదంటే నాశ‌న‌మేఇరాన్ త‌ల‌వంచితే స‌రి లేదంటే నాశ‌న‌మే

అమెరికా : ఇరాన్ త‌మ దారికి రావాల‌ని, దాడుల‌ను ఆపాల‌ని లేక పోతే నాశ‌నం కాక త‌ప్ప‌ద‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అమెరికా దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆదివారం ఆయ‌న జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. హోర్ముజ్‌ను తెరవండి లేదా విద్యుత్

తిల‌క్ వ‌ర్మ అన్ ఫిట్ టి20 మ్యాచ్ ల‌కు నో ఛాన్స్తిల‌క్ వ‌ర్మ అన్ ఫిట్ టి20 మ్యాచ్ ల‌కు నో ఛాన్స్

ముంబై : హైద‌రాబాద్ కు చెందిన తిల‌క్ వ‌ర్మ‌కు బిగ్ షాక్ త‌గిలింది. ఇప్ప‌టికే ఓపెన‌ర్ గా ఛాన్స్ ఇచ్చినా కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంసన్ వ‌రుస‌గా న్యూజిలాండ్ తో జ‌రుగుతున్న టి20 సీరీస్ లో భాగంగా మూడు మ్యాచ్

Ponnam Prabhakar: రాజకీయ దుమారం రేపుతోన్న మంత్రి పొన్నం వ్యాఖ్యలుPonnam Prabhakar: రాజకీయ దుమారం రేపుతోన్న మంత్రి పొన్నం వ్యాఖ్యలు

Ponnam Prabhakar : జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో జరిగిన ఓ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ (Ponnam Prabhakar)…చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణా కాంగ్రెస్ లో దుమారం రేపుతున్నాయి. మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ ను ఉద్దేశించి… పొన్నం (Ponnam Prabhakar)