hyderabadupdates.com movies పెయిడ్ ట్వీట్లతో ప్రయోజనమేమి?

పెయిడ్ ట్వీట్లతో ప్రయోజనమేమి?

చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే కొంచెం నెమ్మదిగా అయినా టాక్ జనాల్లోకి చేరేది. ప్రేక్షకులు క్రమంగా థియేటర్లకు వచ్చేవారు. సినిమాలకు లాంగ్ రన్ ఉండేది కాబట్టి అవి అంతిమంగా మంచి ఫలితాలు అందుకునేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.

ప్రి రిలీజ్ బజ్ క్రియేట్ చేయకపోతే జనం థియేటర్లకు రావట్లేదు. దీని వల్ల బాగున్న సినిమాలు కూడా ఆడకుండా వెళ్లిపోతున్న పరిస్థితి చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి చిన్న సినిమాల మేకర్స్ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అందరి దృష్టి తమ సినిమాపై పడేలా వివాదాస్పదంగా మాట్లాడడం.. కాంట్రవర్శీలు క్రియేట్ చేయడం లాంటివి కూడా చేస్తున్నారు. అవన్నీ అర్థం చేసుకోదగ్గవే. 

ఐతే మంచి కంటెంట్ ఉన్న సినిమా కోసం ప్రమోషన్ల పరంగా కొంచెం లైన్ దాటినా ఓకే అనుకోవచ్చు. కానీ విషయం లేని సినిమాను ఫేక్ ప్రచారంతో పైకి లేపాలని చూడడం మాత్రం కచ్చితంగా తప్పే. ఈ మధ్య కొన్ని సినిమాల విషయంలో ఇదే జరుగుతోంది.

రేపు సినిమా రిలీజ్ అనగా.. ముందు రోజు రాత్రి చిన్న సినిమాలకు పెయిడ్ ప్రిమియర్స్ వేయడం ఈ మధ్య ట్రెండుగా మారింది. ఈ షోల నుంచి మంచి టాక్ వస్తే అది ఆ చిత్రాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. గత ఏడాది కోర్టు, లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి చిత్రాలు ఇలాగే లాభం పొందాయి. కానీ ఈ సినిమాల్లో విషయం ఉంది కాబట్టి ప్రిమియర్స్ కలిసి వచ్చాయి. కానీ కంటెంట్ బలంగా లేని సినిమాల మాటేంటి అన్నదే ఇక్కడ ప్రశ్న.

ప్రిమియర్స్‌‌కు జనాల స్పందన గురించి, సినిమా టాక్ గురించి అబద్ధపు ప్రచారాలు చేసి ప్రేక్షకులను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ మధ్య రిలీజైన ఓ చిన్న సినిమా విషయంలో ఇదే జరిగింది. పెయిడ్ ప్రిమియర్స్‌కు జనం నుంచి స్పందన పెద్దగా లేకపోయినా.. జనం ఎగబడిపోతున్నట్లు, టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నట్లు, హై డిమాండ్ వల్ల షోలు పెంచేస్తున్నట్లు టెంప్లేట్ పోస్టులు పెట్టేశారు.

టీం డబ్బులు పెట్టి కొన్ని షోల వరకు ఫుల్స్ చేసుకుంది తప్ప.. సినిమా కోసం ఎగబడ్డ ప్రేక్షకులు తక్కువ. చాలా వరకు షోల్లో జనం పెద్దగా లేరు. ఐతే మంచి సినిమా తీసి ఉంటే.. ఈ రకమైన ప్రమోషన్‌ను తప్పుబట్టలేం. చిన్న సినిమాలకు జనాలను రప్పించడానికి ఇలాంటి విన్యాసాలు చేయక తప్పని పరిస్థితే ఉందిప్పుడు. కానీ మంచి సినిమా తీసినపుడు ఇలాంటివి ఎన్ని చేసినా ఓకే. కానీ ఆ సినిమా ఆ బాపతు కాదు. 

సినిమా బాలేకున్నా సరే.. ఆ విషయం పక్కన పెట్టి పెయిడ్ బ్యాచ్‌ను పెట్టి అదొక కళాఖండం అన్నట్లుగా ఒకే ఫార్మాట్లో కుప్పలు కుప్పలుగా ట్వీట్లు వేయించేశారు. ఆ ట్వీట్ల వరస చూస్తే.. అవి పెయిడ్ అనే విషయం అర్థమైపోతుంది. సినిమా టాక్ ఏంటో తెలుసుకుందాం అని ఎక్స్‌ చూసిన జనాలు అయోమయానికి గురయ్యారు.

ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేయించి జనాలను థియేటర్లకు రప్పించగలరా.. ఒకవేళ కొంతమంది ప్రేక్షకులు థియేటర్లకు వచ్చినా ఆ ట్వీట్లకు, సినిమాలో కంటెంట్‌కు పొంతన లేనపుడు తిట్టుకోరా అన్నది ఆలోచించాలి. ఎలాగూ రిలీజ్ రోజు మధ్యాహ్నం లోపు ఒరిజినల్ రివ్యూలు వచ్చేస్తాయి. అప్పుడు బండారం బయటపడిపోతుంది. ఆ మాత్రం దానికి ఈ ఆరాటం ఎందుకు? 

బాగున్న సినిమాకు ఇలా పెయిడ్ ట్వీట్ల అవసరం ఉండదు. చూసిన జనమే దాని గురించి పోస్టులు పెడతారు. రివ్యూలు కూడా పాజిటివ్‌గా వస్తాయి. ప్రమోషన్లతో సినిమాకు ఇంకొంచెం పైకి లేపే ప్రయత్నం చేస్తే ప్రయోజనం ఉంటుంది. అలా కాకుండా ఈ ఫేక్ ట్వీట్ల వల్ల క్రెడిబిలిటీ కోల్పోవడం, జనాలకు  అసహనం కలిగించడం తప్ప లాభం శూన్యం.

ఇది ఈ ఒక్క సినిమాకు పరిమితమైన విషయం కాదు. గత నెలలో వచ్చిన మరో చిన్న సినిమాను కూడా ఇలాగే లేపారు. తీరా చూస్తే ఆ సినిమా తొలి రోజే బాక్సాఫీస్ దగ్గర వాషౌట్ అయిపోయింది. గత వీకెండ్ సినిమా పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. ఈ అనుభవాల నుంచి మిగతా చిన్న సినిమాల మేకర్స్ పాఠాలు నేర్చుకుని పెయిడ్ ట్వీట్ల కోసం పెట్టే పనికిరాని ఖర్చును నివారిస్తే మంచిది.

Related Post

‘ఫైర్’ పెరిగి తగ్గి.. ఏపీ మహిళా ఎమ్మెల్యేల గ్రాఫ్ ఇదే..!‘ఫైర్’ పెరిగి తగ్గి.. ఏపీ మహిళా ఎమ్మెల్యేల గ్రాఫ్ ఇదే..!

కొంతమంది మహిళా నేతలు ఈ ఏడాది జోరుగా రెచ్చిపోయారు. నియోజకవర్గంతో పాటు స్థానిక రాజకీయాల్లో తమ హవా చూపించాలన్న ఉద్దేశంతో పలువురు మహిళా నేతలు దూకుడు చూపించారు. అయితే తొలి రోజుల్లో కనిపించిన ఆ దూకుడు, తర్వాత కాలంలో తగ్గడం చర్చనీయాంశంగా

6 Telugu and Tamil Films to Watch on OTT This Week: Prabhas’ The Raja Saab to Sivakarthikeyan, Ravi Mohan’s Parasakthi6 Telugu and Tamil Films to Watch on OTT This Week: Prabhas’ The Raja Saab to Sivakarthikeyan, Ravi Mohan’s Parasakthi

Cast: Sivakarthikeyan, Ravi Mohan, Atharvaa Murali, Sreeleela, Kulappulli Leela, Prakash Belawadi, Dev Ramnath, Prithvi Rajan, Guru Somasundaram, Sandhya Mridul, Chetan, Rana Daggubati (cameo), Basil Joseph (cameo) Director: Sudha Kongara Genre:

Rashmika Mandanna cheers for fiancé Vijay Deverakonda, praises intense Rowdy Janardhana first lookRashmika Mandanna cheers for fiancé Vijay Deverakonda, praises intense Rowdy Janardhana first look

She also reacted on X (formerly Twitter), quoting the Rowdy Janardhana announcement and writing, “Let’s go! Lets go! Let’s goooo!! @TheDeverakonda.” The first look of Rowdy Janardhana presents Vijay Deverakonda